
Daily Current Affairs in Telugu 13-12-2020
2020 సంవత్సరానికి గాను క్విజ్జింగ్ చాంపియన్ గా నిలిచిన వ్యక్తి రవికాంత్ :

వరల్డ్ క్విజ్జింగ్ చాంపియన్ 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ కి చెందిన అవ్వ రవికాంత్ నిలిచినారు. సింగపూర్ మేర్గియన్స్ తరపున ఆయన ఈ చాంపియన్ షిప్ లో పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్ రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు అయిన ఏపివిఎన్ శర్మ కుమారుడైన రవికాంత్ ప్రస్తుతం సింగపూర్ లో గల ఒక మెడికల్ టెక్నాలజీ కంపెని లో పని చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా ఆయన క్విజ్ నిర్వహణలో కీలకంగా పని చేస్తున్నారు. గతంలో ప్రపంచ క్విజ్జింగ్ చాంపియన్ షిప్ లో పోటీ లో వరుసగా 2018,2019 లో ఆసియా పసిఫిక్ ప్రాంత టాపర్ గా నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2020సంవత్సరానికి గాను క్విజ్జింగ్చాంపియన్ గా నిలిచిన వ్యక్తి రవికాంత్
ఎవరు: అవ్వ రవికాంత్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 13
4ఖండాంత క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన రష్యా దేశం :

అమెరికా తో ఉద్రిక్తతల నేపద్యంలో రష్యా తన అణ్వస్త్ర బలగాల పోరాట సంనద్దతను చాటింది. ఇందులో బాగంగా రష్యా అణు జలాంతర్గామి ఒకటి నాలుగు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఒఖాస్క్ సముద్ర లోతుల్లో మాటు వేసిన వ్లాదిమిర్ మోనో మాఖ్ అనే జలాంతర్గామి ఈ ప్రయోగాలను చేపట్టింది. వరుసగా నాలుగు భులావా క్షిపణులను నింగిలోకి పంపింది. వాటిలోని డమ్మీ వార్ హెడ్ లు అర్ఖాగెల్స్క్ ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాలను చేధించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బోరేయ్ తరగతికి చెందిన వ్లాదిమిర్ మొనోమాఖ్ 16బులావా క్షిపణులను మోసుకేల్లగలదు. రష్యా అణ్వస్త్ర బలగాలకు ఇది ప్రధాన ఆయుధ వ్యవస్థ గా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 4ఖండాంత క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన రష్యా దేశం
ఎవరు: రష్యా దేశం
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: డిసెంబర్ 13
చంద్రుడి పై నమూనాలతో భూమికి పయనం అయిన చైనా వ్యోమనౌక చాంగే-5:

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా చంద్రుడి నుంచి మట్టి రాళ్ల నమూనాలను భూమికి రావడానికి సర్వం సిద్దం అయింది. వీటిని మోసుకెళ్తున్న చైనా వ్యోమ నౌక చాంగే-5 పుడమి దిశగా తిరుగు ప్రయాణం అయింది. కొద్ది రోజుల కిందట చంద్రుడి పైన దిగిన ఈ వ్యోమనౌక. అక్కడ రెండు కిలోల నమూనాలను సేకరించిన సంగతి తెలిసిందే.అనంతరం అది నిర్దేశిత రీతిలో జాబిల్లి కక్ష్య లోకి చేరింది. భూమికి తిరిగి రావడానికి అనువైన సమయం కోసం కక్ష్య నిరీక్షిస్తుంది. డిసెంబర్ 13న ఉదయం ఈ వ్యోమనౌక లోని నాలుగు ఇంజన్లను దాదాపు 22నిమిషాల పాటు మండించడం ద్వారా శాస్త్రవేత్తలు దాని తిరుగు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. మూడు రోజుల రోదసి యానం అనంతరం ఇది మూడు మంగోలియా ప్రాంతంలో దిగుతుంది. 1976 లో లూనా -24 వ్యోమ నౌక ద్వారా చివరిసారిగా చంద్రుడి పైనుంచి నమూనాలను సోవియెట్ యునియన్ రప్పించింది. ఆ తర్వాత అలాంటి ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: చంద్రుడి పై నమూనాలతో భూమికి పయనం అయిన చైనా వ్యోమనౌక చాంగే-5
ఎవరు: చైనా వ్యోమనౌక చాంగే-5
ఎక్కడ: చైనా
ఎప్పుడు: డిసెంబర్ 13
టైమ్స్ జాబితాలో చోటు దక్కించు కున్న మహారాష్ట్ర అశావర్కర్ అర్చన ఘురారే :

మహారాష్ట్రకు చెందిన అశావర్కర్ అర్చన ఘుగారే (41)కు టైమ్స్ మ్యాగజిన్ 2020 “గార్డియన్ఆఫ్ ది ఇయర్” లిస్టులో చోటు దక్కించుకుంది. కరోనా నేపద్యంలో ఫ్రుంట్ లైన్ హెల్త్ వర్కర్ గా ఆమె ముందుండి చేసిన సేవలకు గాను టైమ్స్ ప్రశంసించింది. ఇండియా లో ని గ్రామిణ ప్రాంతాలల్లో పబ్లిక్ హెల్త్ విషయంలో దాదాపు 10లక్షల మంది ఆశా వర్కర్లు కీలకంగా పని చేసారు. కరోనా రాకముందు అర్చన రోజుకు ఐదారు గంటలు పని చేసింది. కానీ విపత్తు సమయం లో రోజుకు 12గంటలు అలసిపోయిన నిర్విరామంగా పని చేసింది. కాగా టైమ్స్ 2020 పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా జోబైడెన్,కమలా హ్యారిస్ ను హీరోస్ ఆఫ్ 2020 లిస్టు లో ఇండో అమెరికన్ రాహుల్ దూబే ను తదితరులను టైమ్స్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. గార్డియన్ ఆఫ్ ది ఇయర్ లిస్టు లో ప్రముఖ అమెరికన్ ఫిజిషియన్ డాక్టర్ అంథోని ఫౌచి తో పాటు ఫ్రుంట్ లైన్ హెల్త్ వర్కర్లను ఎంపిక చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: టైమ్స్ జాబితాలో చోటు దక్కించు కున్న మహారాష్ట్ర అశావర్కర్ అర్చన ఘురారే
ఎవరు: అర్చన ఘురారే
ఎప్పుడు: డిసెంబర్ 13
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |