
Daily Current Affairs in Telugu 08-12-2020
ప్రతిష్టాత్మక మైన ఏఏఏఎస్ ఫెలోషిప్ దక్కించుకున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి :

ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటారాలజి (ఏంజి) చైర్మన్ జీర్ణకోశ వ్యాధుల నిపుణుల డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి కి అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ అయిన అమెరికన్ అసోసియన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఏఏఏఎస్) లో స్థానం దక్కింది. నోబెల్ పురస్కారాల గ్రహీతలు అంతర్జాతీయ ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు మాత్రమె ఈ సంస్థలో ఫెలోషిప్ దక్కుతుంది. జీర్ణ కోశ వ్యాదుల చికిత్స లో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపు గా 2020 సంవత్సరానికి గాను ఈ ఫెలోషిప్ అందజేస్తున్నట్లు ఏఏఏఎస్ ప్రకటించింది. ఫిబ్రవరి 13 2021న నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికారిక ధ్రువ పత్రంతో పాటు శాస్త్ర సాంకేతిక కు ప్రతికగా రూపొందించిన బంగారం నీలి రంగును కూడిన బ్యాడ్జ్ ను ఆయనకు అందజేస్తారు. గడిచిన 50ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక భారత వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక మైన ఏఏఏఎస్ ఫెలోషిప్ దక్కించుకున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
ఎవరు: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
ఎప్పుడు: డిసెంబర్ 08
కెనడా లో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన ప్రవాస భారతీయుడు :

కెనడాలో రాజ్ చౌహాన్ అనే ప్రవాస భారతీయుడు చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ అసెంబ్లీ ఆయన స్పీకర్ ఎన్నిక అయ్యారు. డిసెంబర్ 08న ఆయన ఎన్నిక జరిగింది. ఈ పదవిని అలంకరించిన భారతీయుడు మూలలున్న తొలి వ్యక్తి గా నిలిచారు. పంజాబ్ లో జన్మించిన చౌహాన్ 1973 లో కెనడా కు వలస వెళ్లారు. బ్రిటిష్ కొలంబియా అసెంబ్లీ ఐదు సార్లు చట్ట సబ్యుడిగా ఎన్నిక అయ్యారు. ఆయన అక్కడ డిప్యుటీ స్పీకర్ గాను సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కెనడా లో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన ప్రవాస భారతీయుడు
ఎవరు: రాజ్ చౌహాన్
ఎక్కడ: కెనడా లో
ఎప్పుడు: : డిసెంబర్ 08
యుఎఈ,సౌది అరేబియా లో తొలి సారిగా ప్రకటించిన భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవనే :

భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) సౌది అరేబియా ఆరు రోజులు పర్యటనకు గాను డిసెంబర్ 08న బయల్దేరి వెళ్లార. భారత్ కు వ్యుహాత్మకమైన కీలకమైన ఈ రెండు గల్ప్ దేశాల్లో ఒక భారత సైన్యాధిపతి పర్యటిస్తుండడం ఇదే తొలిసారి అని సైన్యం తెలిపింది. ఇదో చారిత్రాత్మక పర్యటనగా పేర్కొంది. ఈ రెండు దేశాలతో భారత వ్యూహాత్మక సంబందాల మెరుగుకు రక్షణ భద్రత పరమైన అంశాల్లో సహకార పురోగతి ఈ పర్యటన కీలకంగా నిలుస్తుంది. డిసెంబర్ 09 నుంచి 14వరకు జనరల్ నరవనే ఈ రెండు దేశాల్లో పర్యటిస్తారు. తొలుత యుఎఈ కి వెళ్లారు. 13,14 తేదిల్లో సౌది అరేబియాలో పర్యటిస్తారు. కాగా చైనా అమెరికా జపాన్ ల తర్వాత భారత్ కు సౌది అరేబియా దేశం అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎఈ,సౌది అరేబియా లో తొలి సారిగా ప్రకటించిన భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవనే
ఎవరు: జనరల్ ఎం.ఎం. నరవనే
ఎప్పుడు: : డిసెంబర్ 08
యుకె లో రెండో అతి పెద్ద ఐటి కంపెని గా నిలిచిన టిసిఎస్ కంపెని :

భారత్ కి చెందిన ప్రముఖ కంపెని టాటా కన్సల్టేన్సి సర్వీసెస్ (టిసిఎస్) యుకె లో నే రెండో అతి పెద్ద ఒక ఐటి కంపెనిగా అవతరించింది అని డిసెంబర్ 07న టిసిఎస్ సంస్థ తెలిపింది. యుకె డిజిటల్ ఎకానమీ లో టిసిఎస్ ప్రభావంతమైన బ్రాండ్ గా ఎదిగింది. వరుసగా 6సార్లు ఐటి సేవలు అందించే 30 కంపెని లలో పోటీ పడి మూడు ప్రదాన బ్రాండ్ లతో ఒకటి గా నిలిచింది. టిసిఎస్ సంస్థ గత ఏడాది 5 వ స్థానం లో ఉండగా మూడు స్థానాలను ఎగబాకి రెండో స్తానం లో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుకె లో రెండో అతి పెద్ద ఐటి కంపెని గా నిలిచిన టిసిఎస్ కంపెని
ఎవరు: టిసిఎస్ కంపెని
ఎక్కడ: యుకె లో
ఎప్పుడు: : డిసెంబర్ 08
గ్రీన్ ఇండియా చాలెంజ్ పై ప్రచురించిన పుస్తకం వృక్ష వేదం :

తెలంగాణా రాష్ట్రము నుంచి రాజ్యసభ సబ్యుడిగా ఉన్నజోగినిపల్లి సంతోష్ కుమార్ గారి జన్మ దినోత్సవం ను సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ పై ప్రచురించిన “వృక్ష వేదం” అనే ఒక పుస్తకాన్ని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు డిసెంబర్ 07న ప్రగతి భవన్ లో ఈ పుస్తకంను ఆవిష్కరించారు. దేశపతి శ్రీనివాస్ గారి సంపాదకత్వం లో మామిడి హరికృష్ణ ఈ పుస్తకంను రచించారు. భారతీయ సాహిత్యంలో వృక్షాలు వనాల ప్రశస్తితో కూడిన శ్లోకాలను తెలంగాణా అటవీ సౌందర్యం ను చాటి చూపే వాటి ఫోటో లు అను జత చేసి ఈ పుస్తకం ను ప్రచురించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్రీన్ ఇండియా చాలెంజ్ పై ప్రచురించిన పుస్తకం వృక్ష వేదం
ఎవరు: చంద్ర శేఖర్ రావు
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: : డిసెంబర్ 08
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |