
Daily Current Affairs in Telugu 15-12-2020
సన్ రైజర్స్ టీం డైరెక్టర్ గా టామ్ మూడి నియామకం :

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు కోచ్ టామ్ మూడి మరో సారి సన్ రైజర్స్ హైదరబాద్ జట్టు బృందం లో చేరాడు. సన్ రైజర్స్ కు మూడి డైరెక్టర్ గా వ్యవహరిస్తాడని డిసెంబర్ 15 ప్రాంచైజీ ప్రకటించింది. 2013నుంచి 2019వరకు సన్ రైజర్స్ జట్టు కు మూడి కోచ్ గా వ్యవహరిస్తారు. ఏడేళ్ళ ఐదు సార్లు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇంగ్లాండ్ ప్రపంచ కప్ అందించిన ట్రైవర్ బెయిలీస్ నిరుడు జులై లో సన్ రైజర్స్ కోచ్ గా బాద్యతలు స్వీకరించారు. బెయిలిస్ అద్వర్యం లో ఈ ఏడాది ఐపిఎల్ లో సన్ రైజర్స్ మూడో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సన్ రైజర్స్ డైరెక్టర్ గా టామ్ మూడి నియామకం
ఎవరు: టామ్ మూడి
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 15
జాతీయ అవార్డు ను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ పోలిస్ శాఖ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలిస్ శాఖ కు ఇటీవల జాతీయ పురస్కారం గెలుచుకుంది. ఇంటర్ అపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం అమలు దాని వినియోగం లో మంచి పని తీరు కనబరిచినందుకు గాను దేశంలో రెండో స్థానంలో నిలవగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా వర్చువల్ లో DGP గౌతమ్ సవాంగ్ గారు ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్మోహన్ రెడ్డి గారు మరియు హోం మంత్రి హర్షం వ్యక్తం చేసారు. ఈ విభాగంలో మహారాష్ట్ర రాష్ట్ర౦ నంబర్ వన్ లో ఉండగా తెలంగాణా రాష్ట్రము మూడో స్థానం లో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ అవార్డు ను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ పోలిస్ శాఖ
ఎవరు: ఆంధ్రప్రదేశ్ పోలిస్ శాఖ
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 15
హుగ్లీ నదిలోకి జల ప్రవేశనం చేసిన తొలి దేశీయ స్టేల్త్ యుద్దనౌక హిమగిరి :

పి17ఏ ప్రాజెక్టు కింద రూపొందించబడిన దేశీయ స్టేల్త్ యుద్దనౌక “హిమగిరి “జల ప్రవేశం చేసింది. త్రివిధ దళాధిపతి (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ గారి సతిమని మధులిక రావత్ గారు డిసెంబర్ 14న హిమగిరి యుద్దనౌక కు పూజలు నిర్వహించి పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిలోకి జలప్రవేశనం చేయించారు. పశ్చిమ బెంగాల్ లోని రాజదాని కోల్ కతాలోని జిఆర్ఎస్ఈ (గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్)యార్డ్ ఈ యుద్దనౌకను తయారు చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ గారు మాట్లాడుతూ దేశ రక్షణ లో ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోగలిగేలా భారత దళాలు సర్వ సన్నద్ధం అయ్యేలా ఉంటుందని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హుగ్లీ నదిలోకి జల ప్రవేశనం చేసిన తొలి దేశీయ స్టేల్త్ యుద్దనౌక హిమగిరి
ఎవరు: (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్
ఎక్కడ: పశ్చిమ బెంగాల్ లోని రాజదాని కోల్ కతా లో
ఎప్పుడు: డిసెంబర్ 15
ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కి దక్కిన గ్రీన్ బెర్గ్ ఎండ్ బ్లైండ్ నెస్ ప్రైజ్ -2020 :

ఎల్,వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి (ఎల్వి పిఇఐ) అత్యంత ప్రతిష్టాత్మక మైన గ్రీన్ బెర్గ్ ప్రైజ్ ఎండ్ బ్లైండ్ నెస్ -2020 అవార్డును దక్కించుకుంది. అందత్వాన్ని తొలగించడానికి వారు చేసిన కృషి కి గాను వాటి ఆదారంగా విజేతలను ఎంపిక చేసారు. డాక్టర్ గుళ్ళపల్లి ఎన్ రావు వ్యవస్థాపకుడు చైర్ పర్సన్ కాగా ఎల్.వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును అత్యుత్తమ సాదన బహుమతి విభాగంలో అందుకున్నారు. LVPEI అవార్డు ను మరియు 3మిలియన్ డాలర్స్ బహుమతి ని భారత దేశంలోని మరొక సంస్థ తో పంచుకుంటుంది. ఈ అవార్డును అందత్వ నిర్మూలనకు సంస్థలు చేస్తున్న కృషికి గాను ఈ అవార్డులు ఇస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కి దక్కిన గ్రీన్ బెర్గ్ ఎండ్ బ్లైండ్ నెస్ ప్రైజ్ -2020
ఎవరు: ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్
ఎప్పుడు: డిసెంబర్ 15
స్పైస్ మని సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్ననటుడు సోను సూద్ :

డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంద సంస్థ అయిన స్పైస్ మని కి బ్రాండ్ అంబాసిడర్ గా నటుడు సోను సూద్ వ్యవహరించనున్నారు. ఈ డీల్ లో భాగంగా సోనుసూద్ కి చెందిన సూద్ ఇన్ఫో మాటిక్స్ (సిఐఎల్) సంస్థకు స్పైస్ మని లో 5శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్ ను నాన్ ఎగ్సిక్యుటివ్ అడ్వైసరి బోర్డ్ మెంబర్ గా కూడా నియమిస్తారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోను సూద్ అయన నిర్వహించిన కార్యక్రమాలలో కొన్నింటిని తాము కొనసాగిస్తామని స్పైస్ మని సంస్థ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్పైస్ మని సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్ననటుడు సోను సూద్
ఎవరు: సోను సూద్
ఎప్పుడు: డిసెంబర్ 15
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |