
Daily Current Affairs in Telugu 04-02-2021
ఫోర్బ్స్ 30 అండర్ 30 లో మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న హైదరాబాది కీర్తి రెడ్డి :

ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రకటించిన 30అండర్ 30 లో ఈసారి మహిళల హవా కనిపించింది. అందులోనూ హైదరాబాది అమ్మాయి కీర్తి రెడ్డి కొత్త(24) కు సైతం చోటు దక్కింది .30ఏళ్ల లోపు వేర్వేరు రంగాల్లో ఉన్నతంగా రాణించిన 30మంది జాబితాను ఏటా ఫోర్బ్స్ ప్రకటిస్తుంది. స్టాట్వి౦గ్ అనే బ్లాక్ చైన్ సాంకేతికత ఆదారిత వ్యాక్సిన్ సరఫరా నిర్వహణ ఫ్లాట్ ఫాం కు సహా వ్యవస్థాపకులు సిఓ ఓగా కీర్తిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటి కల్ సైన్స్ నుంచి మేనేజ్ మెంట్ లో గ్లోబల్ మాస్టర్ పట్టాను పొందారు. ఇదే జాబితాలో మరో 12 మంది మహిళలు కూడా చోటు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్బ్స్ 30 అండర్ 30 లో మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న హైదరాబాది కీర్తి రెడ్డి
ఎవరు: హైదరాబాది అమ్మాయి కీర్తి రెడ్డి
ఎప్పుడు: ఫిబ్రవరి 04
బాక్సింగ్ ఫెడరేషన్ నూతన అధ్యక్షునిగా అజయ్ సింగ్ నియామకం :

మహారాష్ట్ర మాజీ క్రీడా మంత్రి ఆశిష్ షెలార్ ను ఓడించి అజయ్ సింగ్ గారు బాక్సింగ్ ఫెడరేషన్ అఆఫ్ ఇండియా కు బిఎఫ్ఐ) అధ్యక్షునిగా తిరిగి ఎన్నికయ్యారు. అస్సాం లో హేమంత కుమార్ స్థానంలో ఆయనకు కొత్త సెక్రటరీగా జనరల్ గా ఉంటారు. అజయ్ సింగ్ కు 37ఓట్లు లబించగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ముంబై డిస్తిక్స్ పుట్ బాల్ అసోసియేషన్ కు అధ్యక్షునిగా పాత్ర తో సహా క్రీడలో అనేక ఉన్నత పదవులలో షెలార్ కు బిఎస్ఐ ఎన్నికలో 27 ఓట్లు వచ్చాయి. కాగా ఈ ఎన్నికలు గత ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సి ఉండేది. కానీ కరోన వైరస్ వల్ల రెండు సార్లు వాయిదా పడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బాక్సింగ్ ఫెడరేషన్ నూతన అధ్యక్షునిగా అజయ్ సింగ్ నియామకం
ఎవరు: అజయ్ సింగ్
ఎప్పుడు: ఫిబ్రవరి 04
కోవిడ్ టీకాల సరఫరా కు సీరం ఇన్స్టిట్యూట్ యునిసెఫ్ తో ఒప్పందం :

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ టీకాలను అందించడమే లక్ష్యంగా యునిసెఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)తో కలిసి ఆక్స్ పర్డ్ అస్త్రాజెంకా,నోవావాక్స్ టీకా లను దీర్గకాలం పాటు పంపిణి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది, దీంతో 100 దేశాలతో 110 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేయగలుగుతామని యునిసెఫ్ వెల్లడించింది. అల్ఫ మద్య ఆదాయ దేశాలకు ఈ టీకాలను సరఫరా చేస్తామని యునిసెఫ్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ హెన్ రిట్జ్ ఫర్ తెలిపారు. ఆక్స్ పర్డ్ అస్త్రాజేన్ కా అబివృద్ది చేసిన కోవి షీల్డ్ టీకాలను భారత్ లోని పూనే కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. నోవా వాక్స్ టీకాను అమెరికా చెందిన నోవా వాక్స్ అనే సంస్థ అబివృద్ది చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిడ్ టీకాల సరఫరా కు సీరం ఇన్స్టిట్యూట్ యునిసెఫ్ తో ఒప్పందం
ఎవరు: సీరం ఇన్స్టిట్యూట్
ఎప్పుడు: ఫిబ్రవరి 04
ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎండి గా నియమితులైన అనురాగ్ మల్హోత్రా :

ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా అనురాగ్ మల్హోత్రా గారు ఇటీవల నియమితులయ్యారు. గత కొన్ని నెలలుగా కంపెని యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న బాల రాధా కృష్ణన్ గారి స్థానంలో ఆయన నియమితులయ్యారు. రాదా కృష్ణన్ తన డైరెక్టర్ గా మ్యాను ఫ్యాక్చరింగ్ లో తన పదవిని తిరిగి ప్రారంబించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎండి గా నియమితులైన అనురాగ్ మల్హోత్రా
ఎవరు: అనురాగ్ మల్హోత్రా
ఎప్పుడు: ఫిబ్రవరి 04
కరోన రహిత కేంద్రపాలిత భాగంగా నిలిచిన అండమాన్ నికోబార్ :

అండమాన్ మరియు నికోబార్ దీవులు కోవిద్-19 వైరస్ వ్యాప్తి లేనికేంద్ర ప్రాలిత ప్రాంతంగా దేశంలో మొట్టమొదటి రాష్ట్రం లేదా కేంద్ర భూబాగంగా ఇది అవతరించింది. అండమాన్ నికోబార్ దీవులలో చివరి సారిగా నలుగురికి సోకిన వారిని నయం చేసినట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో నివేదించింది. కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 4,932 కేసులు మరియు వైరస్ కారణంగా 62 మరణాలు జరిగాయని తమ నివేదికలో తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కరోన రహిత కేంద్రపాలిత భాగంగా నిలిచిన అండమాన్ నికోబార్
ఎవరు: అండమాన్ నికోబార్
ఎక్కడ:భారత్
ఎప్పుడు: ఫిబ్రవరి 04
ప్రపంచ క్యాన్సర్ దినం గా ఫిబ్రవరి 04 :

యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యుఐసిసి) నిర్వహించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4ను జరుపుకుంటున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను క్యాన్సర్‌తో నివారించగల మార్గాలను వాటి అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించాలానేది దీని ఉద్దేశ్యం. క్యాన్సర్ భారాన్ని పరిష్కరించే సామర్థ్యం ప్రతి ఒక్కరికీ ఉందని క్యాన్సర్ ప్రమాద కారకాలను తగ్గించడానికి దీని ద్వారా తెలియజేయడం ముఖ్య ఉద్దేశ్యం. క్యాన్సర్ నియంత్రణను మెరుగుపరచడానికి మరియు క్యాన్సర్ నుండి అకాల మరణాలను తగ్గించడానికి ప్రపంచ లక్ష్యాలను సాధించడానికి అందరు కలిసి పని చేస్తారు.2021 సంవత్సర ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీం “ఐయాం అండ్ ఐ విల్ “ కాగా జాతీయ క్యాన్సర్ దినోత్సవంగా నవంబర్ 07 న జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ క్యాన్సర్ దినం గా ఫిబ్రవరి 04
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: ఫిబ్రవరి 04
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |