
Daily Current Affairs in Telugu 17-12-2020
పాకిస్తాన్ ప్రముఖ క్రికెటర్ ఆమిర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్ బోర్డు మేనేజ్ మెంట్ వేధింపులు బరించలేక రిటైర్ అవుతున్నట్లు 20ఏళ్ల క్రికెటర్ ఆమిర్ ప్రకటించారు .రిటైర్ కావాలన్న మహమ్మద్ ఆమిర్ నిర్ణయం అతడి వ్యక్తిగత౦ అని గౌరవిస్తామని పిసిబి ఒక ప్రకటనలో పేర్కొంది. అతడి ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించింది .ఆమిర్ నిరుడు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు ఆమిర్ 2010లో ఐదేళ్ళ నిషేదానికి గురయ్యాడు.2016 జనవరి లో పునరాగమనం చేసిన అతడు ఆరంబం లో రాణించాడు.కానీ క్రమంగా ఫాం కోల్పోయాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్తాన్ ప్రముఖ క్రికెటర్ ఆమిర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: ఆమిర్
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: డిసెంబర్ 17
అంతరిక్షం లోకి పి.ఎస్.ఎల్.వి.-50 విజయవంతంగా కక్ష్యలోకి పంపిన భారత్ :

భారత అంతరిక్ష పరిదోదనసంస్థ (ఇస్రో)చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదు అయింది.పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పి.ఎస్.ఎల్.వి)వాహక నౌక సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. సి.సిరీస్ లో డిసెంబర్17న ప్రయోగించిన ఫై.ఎస్ఎల్.వి-50 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకు గాను నెల్లూర్ జిల్లాలోని. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వేదికగా ఇది డిసెంబర్ 15న మద్యాహ్నం 2.41 గంటలకు ప్రారంబం అయిన కౌంట్డౌ న్ 25గంటలు కొనసాగింది.ఇది పూర్తయిన వెంటనే డిసెంబర్ 17న మద్యాహ్నం 3.41 గంటలకు పి.ఎస్.ఎల్.వి- 50 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 1410 కిలోల బరువు గల సిఎం ఎస్ -01 ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ లో ప్రవేశ పెట్టింది. ఇస్రో 2011 లో పంపిన జి షాట్ -12ఉపగ్రహం జీవిత కాలం పూర్తి కావడం దాని స్థానం లో సేవలంధించేదుకు సి.ఎంఎస్-01ను పంపారు .ఇది సి బ్యాండ్ లో టెలికాం సేవలు అందిస్తుంది. షార్ నుండి ఇది 77వ ప్రయోగం కాగ పి.ఎస్.ఎల్.వి సిరీస్ లో 52 వ వ వార్షిక నౌక కమ్యునికేషన్ ఉపగ్రహం లో 42కావటం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతరిక్షం లోకి పి.ఎస్.ఎల్.వి.-50 విజయవంతంగా కక్ష్యలోకి పంపిన భారత్
ఎవరు: ఇస్రో
ఎక్కడ: నెల్లూర్ జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
ఎప్పుడు: డిసెంబర్ 17
భారత యువ వ్యాపారవేత్త కు దక్కిన ఐరాసా పర్యావరణ అవార్డు :

ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి (ఐరాస) యంగ్ చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ పురస్కారాన్ని భారత్ యువ వ్యాపార వేత్త, 29 ఏళ్ల విద్యుత్ మోహన్ అందుకోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈఅవార్డుకు ఏడుగురిని ఐరాస ఎంపిక చేసింది. అందులో మోహన్ ఒకరు పర్యావరణ హితం అయిన ఆవిష్కరణలు చేసే యువ వ్యాపారవేత్తలకు ఈ అవార్డును బహుకరిస్తారు. పంట వ్యర్దాలను కాల్చడం ద్వారా పర్యవరణ౦కు కలుగుతున్న హానిని అరికేట్టేందుకు “టక చార్” అనే సంస్థను మోహన్ నెలకొల్పి వ్యర్దాలతో రైతులకు ఆదాయం కల్పిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఈ.పి) ఆయన్ని అవార్డుకు ఎంపిక చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత యువ వ్యాపారవేత్త కు దక్కిన ఐరాసా పర్యావరణ అవార్డు
ఎవరు: విద్యుత్ మోహన్
ఎప్పుడు: డిసెంబర్ 17
ఇండియా కాకస్ ఉపాధ్యక్షునిగా ఎంపిక అయిన రో ఖన్నా :

అమెరికా భారత్ ల మద్య సత్సంబందలకు మద్య కృషి చేసే కాంగ్రేసినల్ ఇండియా కాకస్ లో రోహిత్ ఖన్న(44) కీలక పదవి పొందారు. రో ఖన్నా డెమోక్రటిక్ పార్టీ తరపున వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతండెమోక్రటిక్ పార్టీ తరపున దిగువసభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ప్రాతినిత్యం వహిస్తున్నారు. ఆయన సిలికాన్ వ్యాలీ నుంచి వరుసగా మూడో సారి విజయం సాధించడం విశేష౦.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా కాకస్ ఉపాధ్యక్షునిగా ఎంపిక అయిన రో ఖన్నా
ఎవరు: రో ఖన్నా
ఎప్పుడు: డిసెంబర్ 17
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |