
Daily Current Affairs in Telugu 14-12-2020
ఫిక్కి అధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించిన ఉదయ్ శంకర్ :

మీడీయా ఎగ్సిక్యుటివ్ అయిన ఉదయ్ శంకర్ ఫిక్కి నూతన అధ్యక్షునిగా (2020-21) డిసెంబర్ 14 న బాద్యతలు స్వీకరించారు .ప్రస్తుతం ఆయన ది వాల్ డిస్నీ కంపెని ఆసియా ఫసిఫిక్ అధ్యక్షునిగా,స్టార్ అండ్ డిస్నీ ఇండియా చైర్మన్ గా ఉన్నారు .ప్రస్తుత ఫిక్కి అధ్యక్షురాలు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి నుంచి ఉదయ్ శంకర్ గారు ఈ నూతన బాద్యతలు స్వీకరించారు హిందుస్తాన్ యునిలివర్,చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహత ఫిక్కి సీనియర్ ఉపాధ్యక్షునిగా నియమించబడ్డారు. ఇండియా మెటల్స్ అండ్ ఫెర్రో అల్త్రాయ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శుభకాంత్ పాండా ఫిక్కి ఉపాధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఫిక్కి అధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించిన ఉదయ్ శంకర్
ఎవరు: ఉదయ్ శంకర్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 14
అంగార ఎ 5రాకెట్ ను విజయవంత౦గా ప్రయోగించిన రష్యా :

అంతరిక్షం లో భారీ బరువును మోసుకేల్లెందుకు ఉద్దేశించిన అంగరా ఎ 5 రాకెట్ ను రష్యా డిసెంబర్ 14న విజయవంత౦గా పరీక్షించింది వాయువ్య రష్యా లోని ప్లేస్ టేస్క్ కాస్మో డ్రోం నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం దిగ్విజయంగా సాగిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ అధిపతి దిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు. ఈ రాకెట్ ను 2014 తొలిసారిగా ప్రయోగించారు .ఇది దేశ అంతరిక్ష కార్యక్రమంలో ఒక పెద్ద మైలు రాయి అని రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రోటాన్ ఎం రాకెట్ స్థానం లో అంగార ఎ 5ను ఉపయోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అంగార ఎ 5రాకెట్ ను విజయవంత౦గా ప్రయోగించిన రష్యా
ఎవరు: రష్యా
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: డిసెంబర్ 14
గణతంత్ర్య వేడుకలలో ప్రదర్శన లో నిలువనున్న అటల్ సొరంగ మార్గం :

ప్రపంచం లోనే అత్యంత పొడవైన రహదారి సొరంగ మార్గం అయిన అటల్ సొరంగ మార్గం నమూనాను గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు. 2021 జనవరి 26న గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే పరేడ్ లో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శకటంలో అటల్ సొరంగ మార్గం తో పాటు త్రిలోక్ నాథ్ దేవాలయం ,లాహౌల్ స్పిటి సంస్కృతి ని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మూడు శకటాల నమూనాలను రక్షణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర భాష ,కళ,సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సిద్దం చేసింది. ఈ అటల్ సొరంగ మార్గం సాంకేతిక అద్బుతంగా ఉన్న ఈ నిర్మాణం ప్రపంచం లోనే అతి పొడవైన (9.02 కి.మీ ) సొరంగ రోడ్డుగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గణతంత్ర్య వేడుకలలో ప్రదర్శన లో నిలువనున్న అటల్ సొరంగ మార్గం
ఎవరు: అటల్ సొరంగ మార్గం
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్ లోని
ఎప్పుడు: డిసెంబర్ 14
ప్రముఖ శాస్త్రవేత్త రొద్దం నరసింహ కన్నుమూత :

ఏరో స్పేస్ శాస్త్రవేత్త ఫ్లుయిడ్స్ డైనమిస్ట్ పద్మ భూషణ్ గ్రహీత ఆచార్య రోడ్డం నరసింహ (87) డిసెంబర్ 14 రాత్రి కన్నుమూసారు. మెదడు సంబందిత సంబందిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు చికిత్స కోసం బెంగళూర్ లోని ఒక ప్రైవేట్ వైద్య శాలలో చేర్పించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ డిసెంబర్ 14 న కన్నుమూశారు. అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతానికి చెందిన నరసింహ శాస్త్రవేత్తగా దేశం గర్వించదగ్గ అనేక కీలక శాస్త్ర ప్రయోగాలలో పాల్గొన్నారు. భారతీయ అంతరిక్ష సమితి (ఇండియన్ స్పేస్ కమిషన్) లో సభ్యుడిగా కూడా కొనసాగారు .ఆయనకు 2013 లో పద్మవిభూషణ్ లబించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రముఖ శాస్త్రవేత్త రొద్దం నరసింహ కన్నుమూత
ఎవరు: రొద్దం నరసింహ
ఎప్పుడు: డిసెంబర్ 14
ఎస్వాతిని దేశ ప్రదాని అయిన అంబ్రోస్ మాండ్వు కన్నుమూత :

ఆఫ్రికా ఖండంలో గల ఎస్వాతిని దేశ ప్రదాని అంబ్రోస్ మాండ్వు లామిని (52) కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ డిసెంబర్ 13న మరణించారు. ఇటీవలే ఆయనకు కరోన వైరస్ సోకి అయన దక్షిణాఫ్రికా లోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించారు. బ్యాంకింగ్ రంగంలో పని చేసిన అంబ్రోస్ మాండ్వు 2018 అక్టోబర్ 27న ఎస్వాతని దేశ ప్రదానిగా ఆయన బాద్యతలు స్వీకరించారు. కాగా పోలాండ్ లోని కటోవిస్ నగరంలో జరిగిన ప్రపంచ సదస్సులో వాతావరణ మార్పులపై అయన చివరిసారిగా ప్రసంగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎస్వాతిని దేశ ప్రదాని అయిన అంబ్రోస్ మాండ్వు కన్నుమూత
ఎవరు: అంబ్రోస్ మాండ్వు
ఎక్కడ: ఆఫ్రికా ఖండం లో గల ఎస్వాతిని దేశ౦
ఎప్పుడు: డిసెంబర్ 14
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |