
Daily Current Affairs in Telugu 13&14-02-2021
టాటా మోటార్స్ సంస్థ నూతన ఎండి &సియివో గా మార్క్ లిస్టోసెల్లా నియామకం :

టాటా మోటార్స్ లిమిటెడ్ 2021 జులై 1 నుంచి మరక్ లిస్తోస్టేలా ను చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించి నట్లు తెలిపింది.టాటా మోటార్స్ కు మార్క్ లిస్తోస్తేల్లా కు స్వాగతం తెలుపుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని టాటా మోటార్స్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. కాగా మార్క్ తన వృత్తిపై వాణిజ్య రంగాల్లోనూ వాహన సంబందిత విషయాల్లోనూ లోతైన జ్ఞానం మరియు నైపుణ్యంఅనుబవం కలిగిన వ్యక్తిగా పేరు. అటోమోటివ్ బిజినెస్ లీడర్ మరియు భారత దేశం లో విస్తృతమైన కార్యాచరణ లో ఈయనకు మంచి అనుభవం కలిగి ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టాటా మోటార్స్ సంస్థ నూతన ఎండి &సియివో గా మార్క్ లిస్టోసెల్లా నియామకం
ఎవరు: మార్క్ లిస్టోసెల్లా
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఇటలి దేశ నూతన ప్రధాన మంత్రిగా మారియో ద్రాగి ప్రమాణ స్వీకారం :

యురోపియన్ యునియన్సెంట్రల్ బ్యాంక్ మాజీ అధిపతి మారియో ద్రాగి ఇటాలియన్ ప్రదానిగా ప్రమాణ స్వీకారం చేసారు. గత నెలలో మునుపటి పరిపాలన పతనం తరువాత దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మద్దతును ఆయన పొందారు. ఇటలి దేశం ఇప్పటికి కరోనా వైరస్ మహామ్మరితో పోరాడుతుంది. దాని పర్యవసానంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోబం ను కూడా అదిఎదుర్కొంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇటలి దేశ నూతన ప్రధాన మంత్రిగా మారియో ద్రాగి ప్రమాణ స్వీకారం
ఎవరు: మారియో ద్రాగి
ఎక్కడ: ఇటలి దేశ౦
ఎప్పుడు : ఫిబ్రవరి 13
అమెరికా దేశ విదేశాంగ వ్యవహారాల చీఫ్ గా శ్రీ కులకర్ణి, సోనాలి నిజావన్ ల నియామకం :

భారతీయ మూలలున్న వారికి ఉన్నత పదవుల్లో నియమించిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్ మరో ఇద్దరు భారత సంతతి కి చెందిన నిపుణులను దేశ విదేశీ వ్యవహారాలలో భాగస్వాములను చేసారు. సోనాలి నిజావన్ అమెరికార్ప్స్ స్టర్ అండ్ నేషనల్ డైరెక్టర్ నియమితులవగా 42ఏళ్ల శ్రీ ప్రేస్తన్ కులకరిని విదేశీ వ్యవహారాల ఛీఫ్ గా నియమించారు. టెక్సాస్ నుంచి కాంగ్రెస్ తరపున రెండు సార్లు విపలం అయినప్పటికీ కులకర్ణి వాషింగ్టన్ నాయకత్వం గురించి అత్యున్నత పదవిలో కూర్చోబెట్టింది.కులకర్ణి తో పాటు సోనాలివన్ డాన్ కొహోల్ ల నియామకం బైడెన్ పరిపాలన యొక్క నిబద్దతను ప్రతిబింబిస్తుంది అని అమెరికా కార్ప్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా దేశ విదేశాంగ వ్యవహారాల చీఫ్ గా శ్రీ కులకర్ణి నియామకం
ఎవరు: శ్రీ కులకర్ణి
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు : ఫిబ్రవరి 13
భారత మహిళా దినోత్సవంగా ఫిబ్రవరి 13 :

భారతదేశంలో ప్రతి సంవత్సరం, ఫిబ్రవరి 13 ను జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున, బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ కోసం భారతదేశంలో చేసిన పోరాటంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరైన సరోజిని నాయుడు జన్మించారు. సరోజిని నాయుడు ఫిబ్రవరి13,1879న జన్మించారు. ఆమె 1925లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అద్యక్షురాలిగా నియమితులయ్యారు మరియు తరువాత 1947లో యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్) గవర్నర్‌గా కూడా కొనసాగారు. కవిగా ఆమె చేసిన కృషికి “నైటింగేల్ ఆఫ్ ఇండియా” అనే బిరుదు లభించింది. ఆమె చెన్నైలో విద్యను పూర్తి చేసి, తరువాత ఉన్నత చదువుల కోసం లండన్ మరియు కేంబ్రిడ్జ్ వెళ్ళింది. సరోజిని నాయుడు తన సాహిత్య సహకారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమె కొన్ని కవితలు పాఠశాల పాఠ్యాంశాల్లో కూడా చేర్చబడ్డాయి. ఆమె సాహిత్య రచనలలో గోల్డెన్ థ్రెషోల్డ్ (1905), ది బర్డ్ ఆఫ్ టైమ్: సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్, అండ్ స్ప్రింగ్, ది బ్రోకెన్ వింగ్: సాంగ్స్ ఆఫ్ లవ్, డెత్ అండ్ స్ప్రింగ్, ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా పలు రచనలు పేరు గాంచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మహిళా దినోత్సవంగా ఫిబ్రవరి 13
ఎప్పుడు : ఫిబ్రవరి 13
మణిపూర్ నూతన జస్టిస్ గా పి.వి సంజయ్ కుమార్ నియామకం :

ప్రస్తుతం పంజాబ్,హర్యానా రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి గా జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ గారిని మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 217 లోని క్లాజ్ (1) ద్వారా ఇవ్వబడిన నిబందనల ప్రకారం పంజాబ్,మరియు హర్యానా హైకోర్టు న్యాయమూర్తి గా శ్రీ జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ ను ప్రధాన న్యాయమూర్తిగా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మణిపూర్ నూతన జస్టిస్ గా పి.వి సంజయ్ కుమార్ నియామకం
ఎవరు: పి.వి సంజయ్ కుమార్
ఎక్కడ :మణిపూర్
ఎప్పుడు : ఫిబ్రవరి 13
సుచిత్ర ఎల్లా,పుల్లెల గోపీచంద్ కు దక్కిన బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారాలు :

ఆంద్ర చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎసిసి) 2020 సంవత్సరానికి గానుబిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు లను ప్రదానం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 14న రాత్రి జరిగిన కార్యక్రమానికి సంస్థ అద్యక్షురాలు డాక్టర్ వి.ఎల్ ఇందిరాదత్ స్వాగతం పలికారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఆమె ప్రత్యేకంగా అబినంధించారు. ఫార్మా రంగం లో హైదరబాద్ లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ,ఆర్కిటిక్ రంగం లో ఆస్కార్ అండ్ పొన్ని అసోసియేట్స్ కు చెందిన డాక్టర్ పొన్ని కాన్ సేస్సావో కు,గ్రామిన విద్య అబివృద్దికి కృషి చేసిన హైదరబాద్ లోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రీసర్చ్ డైరెక్టర్ వి.ఎంఎం ప్రసాద్ కు,క్రీడా రంగానికి చెందిన పూనే లో శివర్ నేచురల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సియివో వినాయక్ సి.హెగాన పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సుచిత్ర ఎల్లా ,పుల్లెల గోపీచంద్ కు దక్కిన బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారాలు
ఎవరు: సుచిత్ర ఎల్లా ,పుల్లెల గోపీచంద్
ఎప్పుడు : ఫిబ్రవరి 14
భారత సైన్యం యొక్క అమ్ములపొదిలో చేరిన అర్జున మార్క్ 1 ఏ ట్యాంకు :

సైన్యం అమ్ముల పొదిలో కి మరో అతిపెద్ద ఆయుధం అర్జున మార్క్ 1 ఏ యుద్ద ట్యాంకు చేరింది. ఫిబ్రవరి 14న అడయార్ లోని ఐఎన్ ఎస్ కోస్ట్ గార్డ్ ప్రాంగణానికి చేరుకొని పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తమిళనాడు లో రూపొందించిన అర్జున్ యుద్ద ట్యాంకు మార్క్-1ఏ ను సైన్యానికి అప్పగించారు. తేజస్ ఆ తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ దళాలను కింద భారత్ దళాలకు అందిన అతి పెద్ద ఆయుధం అర్జున్ యుద్ద ట్యాంకు వాస్తవానికి ఇప్పటికే సైన్యం అర్జున్ (ఎం.బి.టి) యుద్ద ట్యాంకు సేవలు అందిస్తున్నాయి. 71 మార్పులతో అర్జున్ మార్క్-1ఏ రూపంలో అధునాతన ట్యాంకు ను రూపొందించారు.దాదాపు 68 టన్నుల బరువు ఉండి,120 ఎంఎం రౌండ్స్ వినియోగించే గన్ ను దీనికి అమర్చారు. ప్రపంచ స్థాయి అయుదాలతో పోటీ పడేలా దీన్ని డిఆర్.డివో అబివృద్ది చేసింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో ఇది స్తిరంగా పని చేయగలదు. లక్ష్యాన్ని ఆటోమేటిక్ గా ట్రాక్ చేసే ప్రత్యేక వ్యవస్థను ఈ ట్యాంకు గన్లో అమర్చారు. వేగంగా కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ ట్యాంకు సులబంగా పెల్చివేయగలదు. దీనిలోని మందుగుండు ప్రత్యేకమైనది లక్ష్యాన్ని చేరుకోగా తూటా అక్కడి ఆక్సిజన్ పూర్తిగా వినియోగించుకుంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత సైన్యం యొక్క అమ్ములపొదిలో చేరిన మార్క్ 1 ఏ ట్యాంకు
ఎవరు: నరేంద్ర మోడి
ఎక్కడ: : న్యుడిల్లి
ఎప్పుడు : : ఫిబ్రవరి 14