
Daily Current Affairs in Telugu 28-02-2021
సౌది అరేబియా దేశ పౌరులపై విసా ఆంక్షలు విధించిన అమెరికా దేశం :

ఇటీవల అమెరికా దేశ పౌరుడైన జర్నలిస్ట్ జమాల్ ఖశోగి హత్య కేసులో సౌది అరేబియా పై అమెరికా దేశం ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా ను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఖశోగి చంపించింది సౌది అరేబియా దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆంక్షలు మాత్రమే విధించింది. 76 మంది సౌది అరేబియా నేతలకు అమెరికా ప్రభుత్వ౦ వీసాను నిషేధం విధించింది.
అమెరికా దేశ అద్యక్షుడు : జో బైడెన్ (46వ )
అమెరికా దేశ ఉప అద్యక్షులు : కమల హ్యారిస్
అమెరికా దేశ రాజదాని : వాషింగ్టన్
క్విక్ రివ్యు ;
ఏమిటి : సౌది అరేబియా దేశ పౌరులపై విసా ఆంక్షలు విధించిన అమెరికా దేశం
ఎవరు : అమెరికా దేశం
ఎక్కడ : అమెరికా దేశం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
హాట్ లైన్ ఏర్పాటు కై భారత్ మరియు చైనా దేశ విదేశాంగ మంత్రుల సమావేశం :

భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తాజాగా చైనా విదేశాంగ శాఖ మంత్రి గా వాంగ్ యుతో ఫోన్ లో 75 నిమిషాల పాటు చర్చలు జరిపారు. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య హాట్ లైన్ ఏర్పాటు చేయడానికి ఇరువురు అంగీకరించారు. హాట్ లైన్ ఏర్పాటు చేసుకుని ఇకపై తరుచు మాట్లాడుకోవాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబందాలను బలపరచాలంటే సరిహద్దుల్లో శాంతి సామరస్యం నెలకొల్పడం అత్యవసరం అని భారత దేశ విదేశాంగ మంత్రి జై శంకర్ గారు పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : హాట్ లైన్ ఏర్పాటు కై భారత్ మరియు చైనా దేశ విదేశాంగ మంత్రుల సమావేశం
ఎవరు : భారత్ మరియు చైనా దేశ విదేశాంగ మంత్రులు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
పి.ఎస్.ఎల్.వి సి 51 ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ :

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో మరో చారిత్రాత్మక విజయం ను అందుకుంది. ఈ ఏడాది లోనిర్వహించిన తొలి ప్రయోగం ను విజయవంతం అయింది. పి.ఎస్.ఎల్.వి సి 51 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువేల్లింది. ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గం.లకు పి.ఎస్.ఎల్.వి శాటిలైట్ ను దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను, భగవత్ గీతకాఫీ తో పాటు ప్రదాని నరేంద్ర మోడి గారి ఫోటో ను ఆయన పేరును,ఆత్మ నిర్భార్ భారత్ మిషన్ పేరు సహా 25వేల మంది పేర్లను నింగిలోకి తీసుకువెళ్ళింది. ఇందులో విదేశాలకు చెందిన వెయ్యి మందివి, చెన్నై చెందిన విద్యార్తుల పేర్లు ఉన్నాయి. మన దేశానికి చెందిన 18ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టారు.
ఇస్రో కేంద్రం : బెంగళూర్
ఇస్రో చైర్మన్ :కే.శివన్
క్విక్ రివ్యు :
ఏమిటి ; పి.ఎస్.ఎల్.వి సి 51 ను విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు : భారత్ (ఇస్రో )
ఎక్కడ : బెంగళూర్
ఎప్పుడు : ఫిబ్రవరి 28
సేరావిక్ పురస్కారం కు ఎంపిక అయిన భారత ప్రదాని నరేంద్ర మోడి :

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కీర్తి కీరిటం లో మరో కలికితు రాయి చేరనుంది. వచ్చే వారం జరగనున్న వార్షిక అంతర్జాతీయ ఇంధన సదస్సులో ఆయన సేరవిక్ పురస్కారం ను అందుకోనున్నారు.ఈ మేరకు మర్చి ఒకటి నుంచి ఐదో తేది వరకు విడియో సమావేశం విధానంలో జరగనున్న సెరావిక్ సదస్సు 2021లో మోడి ప్రసంగిస్తారు. ఐహెచ్ ఎస్ మార్కెట్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వాతావరణ మార్పులపై అమెరికా అద్యక్షుడి ప్రత్యేక రాయబారి జాన్ కెర్రి,బిల్ గేట్స్ సౌది అరాం కొ ముఖ్యకార్యనిర్వహణ అధికారి అమీన్ నసీర్ తదితరులు ప్రసంగిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; సేరావిక్ పురస్కారం కు ఎంపిక అయిన భారత ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు : ఫిబ్రవరి 28
నేషనల్ సైన్స్ డే గా ఫిబ్రవరి 28 :

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ రోజును భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త సి.వి రామన్ చేసిన రామన్ ఎఫెక్ట్ ను గుర్తించారు. ఈ ఆవిష్కరణలకు ఆయనకు నోబెల్ బహుమతి లబించింది. కాగా 2021 సంవత్సరానికి గాను జాతీయ విజ్ఞాన దినోత్సవం యోక్క్ థీం Future of STI Impact on Education ,Skill and work గా ఉంది. ప్రజల దైనందిన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం భారత దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 నజాతీయ విజ్ఞాన దినోత్సవం గా జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; నేషనల్ సైన్స్ డే గా ఫిబ్రవరి 28
ఎవరు : సి.వి రామన్
ఎప్పుడు : ఫిబ్రవరి 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |