
Daily Current Affairs in Telugu 24-12-2020
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు దక్కించుకున్న సైదయ్య :

కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన వన విశ్వవిద్యాలయం లో అసోసియేషన్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డా.పిడిగెం సైదయ్య గారు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు. జాతీయ రైతు దినోత్సవం ను పురస్కరించుకుని నల్గొండ లో శ్రీ సేద్య రైతు సేవా సమితి ఎస్.విఆర్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం ల ఆయనకు అవార్డు ప్రదానం చేసారు. రాష్ట్రము లో మొట్టమొదటి సారిగా జడ బొబ్బెర అనే కొత్త రకం పంటను రూపొందించినందుకు గాను సైదయ్య ను ఈ అవార్డు కు ఎంపిక చేసారు. ఈ రకం కేవలం 35 రోజులలోనే బిన్నిస్ కాయలు ఇవ్వడం తో పాటు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు దక్కించుకున్న సైదయ్య
ఎవరు: డా.పిడిగెం సైదయ్య
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: డిసెంబర్ 24
2020 సంవత్సరానికి గాను అంపశయ్య నవీన్ పురస్కారం గెలుచుకున్న ప్రస్థానం నవల రచయిత :

ప్రముఖ కథ నవల రచయిత కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం గ్రహీత డా.అంపశయ్య నవీన్ ఏర్పాటు చేసిన అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ తొలి ఉత్తమ నవల అవార్డు ప్రదానం డిసెంబర్ 24 న జరగనుంది. అంపశయ్య నవీన్ పుట్టిన రోజు డిసెంబర్ 24 న నిర్వహించే వేబినార్ ట్రస్ట్ కార్యదర్శి స్వప్న తెలిపారు. 2020 సంవత్సరానికి ఖమ్మం జిల్లా ఇల్లందు కు చెందిన సమతా శ్రీదర్ (బుగ్గవీటి శ్రీదర్) రాసిన తొలి నవల ప్రస్థానం కు ఈ పురస్కారానికి ఎంపిక అయినట్లు వెల్లడించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: 2020 సంవత్సరానికి గాను అంపశయ్య నవీన్ పురస్కారం గెలుచుకున్న్ ప్రస్థానం నవల
ఎవరు: సమతా శ్రీదర్
ఎప్పుడు: డిసెంబర్ 24
భారత బాస్కెట్ బాల్ ప్లేయర్ సత్నాం సింగ్ పై రెండేళ్ళ నిషేధం విధించిన నాడా :

ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్ బాల్ సంఘం (ఎన్.బిఏ )జట్టుకు బారత్ నుంచి ప్రాతినిత్యం వహించిన తొలి బాస్కెట్ బాల్ ప్లేయర్ గా ఘనత కెక్కిన సత్నాం సింగ్ భామరా డోపింగ్ లో దొరికి పోయాడు. దీంతో 25ఏళ్ల భామారా పైన రెండేళ్ళ పాటు నిషేధం విదిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పైన రెండేళ్ళ క్రమశిక్షణ ప్యానెల్ లో డిసెంబర్ 24 న ప్రకటించింది. బెంగళూర్ లో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్బంగా గత ఏడాది నవంబర్ లో నిర్వహించిన పరీక్ష లోనే సత్నాం సింగ్ డోపి గా తేలడం తో రెండేళ్ళ పాటు సస్పెన్షన్ వేటు వేసారు. దీని సవాలు చేసిన సత్నాం డోపింగ్ నిరోధక క్రమశిక్షణ కమిటీ తో విచారణ జరిపించాలని నాడా ను కోరాడు. ఈ విచారణ లో సత్నాం నాడా నిషేధిత ఉత్ప్రేరకం హైజిసమైన్ తీసుకున్నట్లు తేలిందని నాడా డిసెంబర్ 24 ణ నిర్దారించింది. గత ఏడాది నవంబర్ నుంచే శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్న జాతీయ సంస్థ 19 నవంబర్ 2021 వరకు అతను ఎలాంటి టోర్నీ లో ఆడరాదంటూ నిషేధం విధించింది. ఐదేళ్ళ క్రితం ఎన్.బిఏ డెవెలప్ మెంట్ లీగ్ లో టెక్సాస్ లెజెండ్స్ కు ప్రాతినిత్యం వహించిన భమార ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత బాస్కెట్ బాల్ ప్లేయర్ సత్నాం సింగ్ పై రెండేళ్ళ నిషేధం విధించిన నాడా
ఎవరు: నాడా
ఎప్పుడు: డిసెంబర్ 24
భారత క్రికెట్ సీనియర్ సెలక్సన్ కమిటీ చైర్మన్ గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ నియమామకం
:

భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ (నార్త్ జోన్) ఎంపిక అయ్యారు.డిసెంబర్ 24 న జరిగిన బిసిసిఐ ఏజిఎం లో ఈ ఎంపిక ను ఖరారు చేశారు.చేతన్ తో పాటు సెలక్షన్ కమిషన్ మాజీ పేస్ బౌలర్లు అభయ్ కురువిల్ల ,దేవాశిష్ మహంతి,లకు కూడా అవకాశం దక్కింది. మదన్ లాల్ ఆర్పి.సింగ్ ,సులక్షణ నాయక్ లు సబ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సిఏసి) ఇంటర్వ్యు చేసి కొత్త సెలక్టర్లను ఎంపిక చేసింది. ఐదుగురు సెలక్షన్ కమిటీ లో ఇప్పటికే సునీల్ జోషి ,హర్విందర్ సింగ్ ఉన్నారు.కొత్తగా ఎంపిక అయిన ముగ్గురు వీరితో జత కలుస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత క్రికెట్ సీనియర్ సెలక్సన్ కమిటీ చైర్మన్ గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ నియమామకం
ఎవరు: చేతన్ శర్మ
ఎప్పుడు: డిసెంబర్ 24
జాతీయ రైతు దినోత్సవం గా డిసెంబర్ 23 :

భారతదేశంలో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కిసాన్ దివస్ లేదా రైతు దినోత్సవం లేదా జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున వ్యవసాయం వలన కలిగే లాభాలు రైతుల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు జ్ఞానాన్ని అందించడం కోసం ఈ రోజును జరుపుకుంటారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: జాతీయ రైతు దినోత్సవం గా డిసెంబర్ 23
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |