
Daily Current Affairs in Telugu 08-02-2021
ఐఐసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచిన రిషభ పంత్:

ఐసిసి తొలి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ను టీం ఇండియా వికెట్ కీపర్ రిషభ పంత్ సొంతం చేసుకున్నాడు. జనవరి లో ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్న రిశబ్ పంత్ ఈ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. జనవరిలో ఆస్ట్రేలియా తో చివరి రెండు టెస్టుల్లో అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టున్న పంత్ ఐసిసి ఇటీవల ప్రవేశ పెట్టిన ఈ అవార్డ్ ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.సిడ్నీ లో 97,బ్రిస్బేన్ లో 89 (నాటౌట్) పరుగులతో భారత జట్టు సిరీస్ విజయం లో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఏ ఆటగాడైన అత్యుత్తమ బహుమతి జట్టు విజయం లో భాగంఅయిన ప్రతి ఒక్క టీం ఇండియా సభ్యుడికి ఈ అవార్డు అంకితం.అని రిశబ్ పంత్ తెలిపారు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐఐసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచిన రిషభ పంత్
ఎవరు: రిషభ పంత్
ఎప్పుడు : ఫిబ్రవరి 08
ఐసిసి స్పాన్సర్ గా బైజుస్ కంపెని తో ఒప్పందం :

భారతీయ ఎడ్యుకేషన్ కంపెని బైజుస్ తో ఐసిసి చేతులు కలిపింది. 2021 నుంచి 2023 వరకు ఐసిసి ఈవెంట్లకు బైజుస్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని ప్రకటించింది. మూడేళ్ళ ఒప్పందం లో భారత్ లో టి20 ప్రపంచ కప్ న్యూజిలాండ్ లో మహిళల ప్రపంచ కప్ లో సహా ఐసిసి మెగా టోర్నీ అన్నింటిలో బైజుస్ భాగస్వామి ఉంటుంది. ఒప్పందంలో భాగంగా స్టేడియంలో క్రికెట్ ప్రసారాల్లో బైజుస్ విస్తృత ప్రాదాన్యం దక్కుతుంది. ఐసిసి టోర్నీ లో డిజిటల్ హక్కులు కూడా బైజుస్ సంస్థ కు లబిస్తాయి. 2019 ఆగస్టులో టీమిండియ జెర్సీ స్పాన్సర్ గా బైజుస్ కంపిని ఎంపిక అయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐసిసి స్పాన్సర్ గా బైజుస్ కంపెని తో ఒప్పందం
ఎవరు: బైజుస్ కంపెని
ఎప్పుడు : ఫిబ్రవరి 08
స్వదేశ్ దర్శన్ కింద తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిన రూ.268 కోట్లు :

స్వదేశ్ దర్శన్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ లో మూడు పర్యాటక పథకాల కోసం రూ.263 కోట్ల కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ గారు తెలిపారు. ఫిబ్రవరి 08న లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన సమాదానం ఇచ్చారు. ఇందులో రూ.2౩౩.54 కోట్లు విడుదల చేయగా ఇప్పటి వరకు రూ.192.65 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : స్వదేశ్ దర్శన్ కింద తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిన రూ.268 కోట్లు
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎప్పుడు : ఫిబ్రవరి 08
జనరల్ కే.ఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని ప్రారంబించిన రాష్ట్రపతి రాం నాథ్ కోవిద్ :

కర్నాటక లో కొదుగు జిల్లా లో కేంద్రం మడికేర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ.5.50 కోట్లతో కొత్తగా నిర్మించిన దివంగత సైన్యాధికారి జనవర్ కే.ఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి రాం నాథ్ కోవిద్ దంపతులు ఫిబ్రవరి 06ణ ప్రారంబం చేసారు.తిమ్మయ్య సాహసాలుగా అడ్డం పట్టేల ఆయన జన్మించిన ఇల్లు సన్నీసైడ్ నే మ్యుజియంగా మార్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జనరల్ కే.ఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని ప్రారంబించిన రాష్ట్రపతి రాం నాథ్ కోవిద్
ఎవరు: రాష్ట్రపతి రాం నాథ్ కోవిద్
ఎక్కడ : కర్నాటక లో కొదుగు జిల్లా
ఎప్పుడు : ఫిబ్రవరి 08
అలెన్ బోర్డర్ పురస్కారం ను గెల్చుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ :

ఆస్ట్రేలియా క్రికెట్ ఫిబ్రవరి 06న ప్రకటించిన వార్షిక అవార్డులలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు రెండు పురస్కారాలు లబించాయి. ఏడాదిగా మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించిన స్మిత్ అలెన్ బోర్డర్ మెడల్ తో పాటు వన్డే ఇంటర్ నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అనే పురస్కారం దక్కింది. మహిళా విభాగంలో బెత్ మూని బెల్లిండా క్లార్క్ అవార్డును తొలిసారిగా గెల్చుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అలెన్ బోర్డర్ పురస్కారం ను గెల్చుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్
ఎవరు: క్రికెటర్ స్టీవ్ స్మిత్
ఎక్కడ : ఆస్ట్రేలియా
ఎప్పుడు : ఫిబ్రవరి 08
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |