
Daily Current Affairs in Telugu 03-02-2021
భారత అంతరిక్ష సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఇస్రో :

హైదరాబాద్ కు చెందిన అంతరిక్ష పరిశోధనల సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది .దీనివల్ల అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) తో ఒప్పందం కుదిరింది. దీనివల్ల అంతరిక్ష వాహక అబివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఇస్రో కు ఉన్న సాంకేతిక నైపుణ్యాలు అనుభవం సదుపాయాలను వినియోగించుకునే అవకాశం స్కైరూట్ కు లబిస్తుంది ఇస్రో తో ఒప్పందం కుదుర్చుకున్నాం మేం తయరు చేసిన ఉపకరణాలను త్వరలో ఇస్రో కేంద్రాల్లో పరిక్షిస్తాం అని స్కై రూట్ ట్వీట్ చేసింది. గతంలో ఇస్రో లో పని చేసిన నాగ భరత్,పవన్ కుమార్ చందన కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ కంపెని ని ఏర్పాటు చేసారు. ఈ సంస్థ ప్రదానంగా లాంచ్ వెహికల్ టెక్నాలజీ మీద పని చేస్తుంది. చిన్న ఉపగ్రహలను అంతరిక్షం లోకి ప్రవేశపెట్టడానికి వీలైన మూడు రకాల లాంచ్ వెహికల్స్ కు ఇప్పటికే ఈ సంస్థ ఆవిష్కరించింది. దీనికి ఇప్పటికే 4.3 మిలియన్ డాలర్ల వెంచర్ కేపిటల్ నిధులు లబించాయి. మరో 15 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించే యత్నాల్లో ఈ సంస్థ ఉన్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత అంతరిక్ష సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఇస్రో
ఎవరు: స్కై రూట్ ఏరోస్పేస్
ఎప్పుడు: జనవరి 03
అమెజాన్ నూతన సియివో గా భాద్యతలు స్వేకరిస్తున్న అండి జీస్సి :

అమెజాన్ సియివో గా ఉన్న జెఫ్ బెజోస్ మూడు దశాబ్దాల క్రితం ఆన్ లైన్ లో పుస్తకాలతో మొదలు పెట్టి ఇపుడు అన్ని వస్తువులను విక్రయిన్చేదాక అమెజాన్ ను అంతర్జతీయ ఈ కామర్స్ అగ్రశ్రేణి సంస్థ గా తీర్చిదిద్దిన వ్యవస్థాపక సియివో గా జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు. వృత్తిలోను వ్యక్తిగతంగా ను వేగంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్న బెజోస్ యాబై ఏడు ఏళ్ల వయసులోనే అమెజాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సియివో)భాద్యతల నుంచి తప్పుకుంటున్నారు.వారసుడిగా క్లౌడ్ కంప్యూటింగ్ చీఫ్ ఆండీ జాస్సి ని ప్రకటించారు.కానీ జెఫ్ బెజోస్ మాత్రం కంపెని ని వీడడం లేదు ఎగ్సిక్యుటివ్ చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు,కాగ 1995 లో స్థాపించిన ఈ కంపెని యొక్క వి1988బ్యాచ్ విలువ ఇపుడు 1.7 లక్షల కోట్ల డాలర్లు అంటే రూ 127.5 లక్షల కోట్లకు చేరింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమెజాన్ నూతన సియివో గా భాద్యతలు స్వేకరిస్తున్న అండి జీస్సి
ఎవరు: అండి జీస్సి
ఎప్పుడు: జనవరి 03
సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా ప్రవీణ్ సిన్హా నియామకం :

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తాత్కాలిక డైరెక్టర్ గా గుజరాత్ క్యాడర్ ఐపిఎస్ అధికారి అయిన ప్రవీన్ సిన్హా గారు నియమితులయ్యారు, సిబిఐ లోనే ఆయన అదనపు డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గా రుషి కుమార్ శుక్ల జనవరి 03న రెండేళ్ళ సర్వీస్ ను పూర్తి చేసుకుని పదవి విరమణ చేసారు. ఈ నేపద్యంలో ప్రదాని మోడి నేతృత్వంలో కేబినేట్ నియామకాల కమిటీ సమావేశంపై ప్రవీణ్ సిన్హా నియామకానికి ఆమోదం తెలిపింది. సిబిఐ డైరెక్టర్ పదవి విరమణ అనంతరం తాత్కాలిక డైరెక్టర్ గా నియమించడం 2014 నుంచి ఇది నాలుగో సారి.
క్విక్ రివ్యు:
ఏమిటి: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా ప్రవీణ్ సిన్హా నియామకం
ఎవరు: ప్రవీణ్ సిన్హా
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 03
అమెరికా ఇమ్మిగ్రేషన్ కర్యాదళం ఉమ్మడి అద్యక్షుడిగా రాజా కృష్ణమూర్తి నియామకం :

ప్రముఖ భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజ కృష్ణ మూర్తి కీలక పదవి ని దక్కించుకున్నారు. కాంగ్రెశనల్ ఆసియన్ ఫసిఫిక్ అమెరికన్ కాకస్ కు చెందిన ఇమ్మిగ్రేషన్ కార్యదలానికి ఉమ్మడి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. డ్రీమర్లు ,తాత్కాలిక రక్షణ హోదా (టిసిఎస్)ఉన్న వారికీ రక్షణ కల్పించడం ఇమ్మిగ్రేషన్ విధానాలలో సంస్కరణలు సహాకరించడం వంటి లక్ష్యాలు. కాగా మరో భారతీయ అమెరికన్ చట్ట సభ సభ్యురాలు ప్రమీల జయపాల్ ఈ కార్యదలానికి అధ్యక్షురాలు కావడం విశేషం. మరోవైపు అమెరికా హోం ల్యాండ్ సెక్యురిటి విభాగం ప్రధాన వైద్యదికారిగా భారతీయ అమెరికన్ డాక్టర్ ప్రితేష్ గాంధీని బైడెన్ నియమించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమెరికా ఇమ్మిగ్రేషన్ కర్యాదళం ఉమ్మడి అద్యక్షుడిగా రాజా కృష్ణమూర్తి నియామకం
ఎవరు: రాజా కృష్ణమూర్తి
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: జనవరి 03
సినీ దర్శకుడు దశరథ్ కు దక్కిన సినీ ఎక్సలెన్స్ అవార్డు :

ప్రముఖ తెలుగు దర్శకుడు దశరథ్ అరుదైన గౌరవం ను అందుకున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన ఎవరెస్ట్ అంతర్జతీయ చలన చిత్రోత్సవం లో ఆయన్ని సినీ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. ఈ ఉత్సవాలలో ఆయనతో పాటు నిర్మాతలు శ్రీ అట్లూరి నారయణ రావు ,డివై చౌదరిలకు కూడా ఈ పురస్కారాన్ని అందించారు.ఈ చిత్రోత్సవాల్లో 27దేశాల నుంచి వచ్చిన చలన చిత్రాలను ప్రదర్శించి నట్లు ప్రదర్శకులు నిర్వాహకులు మోహన్ దాస్ సంజయ్ వర్మ తెలియ జేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సినీ దర్శకుడు దశరథ్ కు దక్కిన సినీ ఎక్సలెన్స్ అవార్డు
ఎవరు: టాలివుడ్ దర్శకుడు దశరథ్
ఎప్పుడు: జనవరి 03
హర్ ఘర్ పాని ,హర్ ఘర్ సపాయ్ అనే ఒక మిషన్ ను ప్రారంబించిన పంజాబ్ సిఎం:

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ వర్చువల్ గా హర్ ఘర్ పాణి ,హర్ ఘర్ సపాయ్ అనే మిషన్ ను ప్రారంబించారు. వచ్చే ఏడాది మార్చి నాటికీ అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వారి గృహాలలో 100 శాతం త్రాగునీటి ని పైపుల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని నెరవేర్చాలన్న ప్రభుత్వ ప్రచారంలో ఇది ఒక భాగం. మోగా అనే జిల్లాలలో 85 గ్రామాలకు ఒక మెగా ఉపరితల నీటి సరఫరా పతాకాన్ని ,172 గ్రామాలకు 144 కొత్త నీటి సరఫరా పథకాలను,121 ఆర్సెనిక్ ,ఇనుము తొలగింపు ప్లాంట్లను పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అమరిందర్ సింగ్ గారు ప్రారంబించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: హర్ ఘర్ పాని ,హర్ ఘర్ సపాయ్ అనే ఒక మిషన్ ను ప్రారంబించిన పంజాబ్ సిఎం
ఎవరు: పంజాబ్ సిఎం అమరిందర్ సింగ్
ఎక్కడ: : పంజాబ్
ఎప్పుడు: జనవరి 03
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |