
Daily Current Affairs in Telugu 22-02-2021
అడ్రియటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలుచుకున్న తొలి బాక్సర్ గా నిలిచిన అల్ఫియా పటాన్ :

అడ్రియాటిక్ పేర్ల బాక్సింగ్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారిణి అల్ఫియా పటాన్ భారత్ నుంచి స్వర్ణ పథకం సాధించింది. మా౦టేనిగ్రో దేశంలోనే బాడవ పట్టణం లో ఫిబ్రవరి 20న జరిగిన 81కేజీల విభాగంలోని ఫైనల్లో 2019 ఆసియా జూనియర్ బాలికల చాంపియన్ అయిన అల్ఫియా పటాన్ 5-0 తో దారియా కోజోరేవ్ (మాల్టోవా) ను చిత్తు చేసింది. దీంతో అడ్రియాటిక్ టోర్నీ లో సవరణ పథకంను గెలుచుకున్న తొలి భారత బాక్సర్ క్రీడాకారిణి గా అల్ఫియా నిలిచింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అడ్రియటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలుచుకున్న తొలి బాక్సర్ గా నిలిచిన అల్ఫియా పటాన్
ఎవరు: అల్ఫియా పటాన్
ఎక్కడ: మంటేనీగ్రో
ఎప్పుడు: ఫిబ్రవరి 22
డాన్ డేవిడ్ అవార్డు 2021 విజేత గా నిలిచిన డాక్టర్ ఆంటోని ఫౌచి :

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచికి ప్రతిష్టాత్మక డాన్ డేవిడ్ అవార్డు -2021 లబించింది.హెచ్.ఐ.విఎబోలా,జికా ,ప్రస్తుతం కోవిద్-19 అంటువ్యాదులని అరికట్టండంలో డాక్టర్ ఫౌచి కి చేసిన కృషికి గాను దాని కి గుర్తింపు గా ఇస్తున్నట్లు డేవిడ్ ఫౌండేషన్ ఫిబ్రవరి 18న ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు 10లక్షల డాలర్ల నగదు పురస్కారం లబిస్తుంది. కాగా ఈయన ఇజ్రాయెల్ టెల్ అవీన్ యునివర్సిటి లో ప్రధాన కార్యాలయంలో ఉన్న డాన్ డేవిడ్ ఫౌండేషన్ ప్రతి ఏడాది మూడే కేటగిరిలో పురస్కారాల్లో ఇస్తుంది. గతంలో చేసిన సేవలు ప్రస్తుతం చేస్తున్న పోరాటం భవిష్యత్ లో ఉపయోగపడే వాటికీ ఈ పురస్కారాలు ఉంటాయి. ప్రస్తుతం డేవిడ్ ఫౌండేషన్ అవార్డు కమిటీ చీఫ్ గా ఎలిజిబెత్ మిల్లర్ ఉన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: డాన్ డేవిడ్ అవార్డు 2021 విజేత గా నిలిచిన డాక్టర్ ఆంటోని ఫౌచి
ఎవరు: డాక్టర్ ఆంటోని ఫౌచి
ఎప్పుడు: ఫిబ్రవరి 22
విఎల్.ఎస్ఆర్ శాం క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత్ :

ఉపరితలం నుంచి గగనతలం లోని లక్ష్యాలను చేధించే స్వల్ప శ్రేణి క్షిపణి కి సంబంధించిన నిట్టనిలువు ప్రయోగ వెర్షన్ (వి.ఎల్.ఎస్ ఆర్ శాం) ను భారతదేశం ఫిబ్రవరి 22న రెండు సార్లు విజయవంతంగా పరీక్షించింది. ఓడిశా తీరంలోని చాందిపూర్ లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటిఆర్) నుంచి ప్రయోగం జరిగింది.నిశ్చల వెర్టికల్ లాంచర్ నుంచి క్షిపణి నింగిలోకి పంపారు. నౌకా దళం అవసరాల కోసం ఈ అస్త్రాన్ని స్వదేశి పరిజ్ఞానంతో డిఆర్.డివో రూపొందించింది. చాలా తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను చెందించడానికి ఇది ఉపయోగపడుతుంది. తాజాగా జరిగిన రెండు పరీక్షలో ను ఈ అస్త్రం అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను నేలకూల్చిందని అధికారులు తెలిపారు. కనిష్ట గరిష్ట దూరల్లోనూ దీన్ని పరీక్షించింది.హైదరాబాద్లో డి.ఆర్.డి.ఎల్,ఆర్.సి.ఐ తదితర డి.ఆర్.డి.వో ల్యాబ్ లు ఈ క్షిపనుల రూపకల్పనలో భాగం అయ్యారని వివరించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: విఎల్.ఎస్ఆర్ శాం క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: ఓడిశా తీరంలోని చాందిపూర్ లో
ఎప్పుడు: ఫిబ్రవరి 22
అమర్ వాషా అనే ఒక నూతన సాఫ్ట్ వేర్ ను ప్రారంబించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం :

ఇటీవల జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ౦ ఆదారిత అనువాద సాఫ్ట్ వేర్ అమర్ వాషా ను ప్రారంబించారు. ఈ సాఫ్ట్ వేర్ ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తీర్పులను ఇంగ్లీష్ భాషనుంచి బంగ్లా భాషకు అనువదిస్తుంది. కాగా ఈ సాఫ్ట్ వేర్ ను ఎక్సేఫ్ట్ అనే ఒక ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి దీనిని అబివృద్ది చేసారు. ఇది బంగ్లా తో సహా ఇంగ్లీష్ నుంచి భారత భాషలకు అనువదించడానికి భారతదేశంలోనే ఉపయోగించే వారి అనువాద్ అనే ఒక అనువాద సంస్థ ఆదారంగా రూపొందించబడింది.అనువాద్ ను సుప్రీం సువాన్ సుప్రీం వీదిక్ అనువాద్ సాఫ్ట్ వేర్) గా నవంబర్ 2019 నుంచి నియమించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమర్ వాషా అనే ఒక నూతన సాఫ్ట్ వేర్ ను ప్రారంబించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఎవరు: బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: బంగ్లాదేశ్ ఎప్పుడు: ఫిబ్రవరి 22
మొదటి సారి రాష్ట్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం :

సిఎం యోగి నాథ్ ఆదిత్యనాత్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 22న అసెంబ్లీలో 5.5 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సారి పేపర్ లెస్ బడ్జెట్ ను సమర్పించారు. యుపి చరిత్రలో ఇదే అత్యదిక బడ్జెట్ కావడం విశేషం. కరోన మహమ్మారి తో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్న అన్ని రంగాలకు బడ్జెట్ ను కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఆర్ధిక మంత్రి సురేష్ ఖన్న మాట్లాడుతూ అయోధ్య లో శ్రీ రామ జన్మ భూమి ఆలయ నిర్మాణ కోసం సుమారు 300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: మొదటి సారీ రాష్ట్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
ఎవరు: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: ఉత్తరప్రదేశ్
ఎప్పుడు: ఫిబ్రవరి 22
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |