
Daily Current Affairs in Telugu 22-12-2020
ఆంద్రప్రదేశ్ నూతన ప్రదాన కార్యదర్శి ఆదిత్యానాద్ దాస్ నియామకం :

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా 1987 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్య నాద్ దాస్ నియమితులయ్యారు ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని డిసెంబర్ 31న పదవి విరమణ చేయనున్నారు. అదే రోజు కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాద్ దాస్ బాద్యతలు చేపడతారు. పదవి విరమణ తరువాత నీలంసాహ్ని సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆమెను కేబినేట్ మంత్రి హోదాలో ముఖ్యమంత్రికి ముఖ్య సలహదరుడిగా నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంద్రప్రదేశ్ నూతన ప్రదాన కార్యదర్శి ఆదిత్యానాద్ దాస్ నియామకం
ఎవరు: ఆదిత్యానాద్ దాస్
ఎక్కడ: ఆంద్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 22
అమెరికా దేశ అత్యున్న్టత సైనిక పురస్కారం దక్కించుకున్న నరేంద్ర మోడి:

అమెరికా దేశ అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన లీజియన్ ఆఫ్ మెరిట్ ను డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కి ప్రదానం చేసింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంను వృద్ది చేయడంలో భారత్ ను అంతర్జాతీయ శక్తి గా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపు గా ఈ గౌరవం దక్కింది. డిసెంబర్ 22న వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా జాతీయ బద్రత సలహా దారు రాబర్ట్ ఒబ్రయాన్ ఈ అవార్డు అందజేశారు. అమెరికాలో భారత్ రాయబారి తరం జీత్ సింగ్ సందు,మోడి తరపున దీన్ని అందుకున్నారు. ప్రభుత్వ అధిపతులు దేశాద్యక్షులకు ఇచ్చ్చే అత్యున్నత స్థాయి “చీఫ్ కమాండర్ ఆఫ్ లిజియన్ ఆఫ్ మెరిట్” మోడీకి దక్కింది. ఆస్త్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మొరిసన్,జపాన్ మాజీ ప్రదాని షింజో అబే లకు తాజాగా ఈ అవార్డును అందజేశారు అని ఒబ్రయాన్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా దేశ అత్యున్న్టత సైనిక పురస్కారం దక్కించుకున్న నరేంద్ర మోడి
ఎవరు: నరేంద్ర మోడి
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: డిసెంబర్ 22
సరికొత్త రాకెట్ లాంగ్ మార్చ్ 8 ను విజయవంతంగా ప్రయోగించిన చైనా:

కొత్తగా రూపొందించిన మద్యశ్రేని అంతరిక్ష వాహన నౌక లాంగ్ మార్చ్ 8ను చైనా డిసెంబర్22న విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్బంగా ఐదు ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. హైనాన్ ప్రావిన్స్ లోని వెంచాంగ్ అంతరిక్ష కేంద్ర నుంచి ఈ ప్రయోగం జరిగింది.తాజాగా రోదసి లో ప్రవేశించిన ఐదు ఉపగ్రహాలు సూక్ష్మ తరంగ చిత్రీకరణ ఇతర కీలక పరిజ్ఞానాలను పరేక్షించింది. ఖగోళ శాస్త్రం రిమోట్ సెన్సింగ్ కమ్యునికేషన్ పరిజ్ఞానాలకు సంబంధించిన ప్రయోగాలను నిర్వహిస్తాయి. లాంగ్ మార్చ్ 8 రాకెట్ పొడవు 50.3 మీటర్లు బరువు 356 టన్ను లు ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సరికొత్త రాకెట్ లాంగ్ మార్చ్ ను విజయవంతంగా ప్రయోగించిన చైనా
ఎవరు: చైనా
ఎక్కడ: చైనా
ఎప్పుడు: డిసెంబర్ 22
కంట్రోల్ ఎస్ డేటా సెంటర్లకు దక్కిన గోల్డెన్ పీకాక్ పురస్కారం :

పర్యావరనానికి అనుకూలంగా డేటా సెంటర్లు నిర్వహిస్తున్న౦దుకు గాను హైదారాబాద్ చెందిన కంట్రోల్ ఎస్.డేటా సెంటర్స్ కు ప్రఖ్యాత గోల్డెన్ పీకాక్ పురస్కారం లబించింది. ఈ పురస్కారం కోసం 234 సంస్థలు పోటీ పడ్డాయి. ఆవిష్కరణలు పర్యావరణ పరిరక్షణ ఇంధన వినియోగంపై రక్షణ చర్యలు,వాతావరణ మార్పులపై ప్రభావం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని విజేతను ఎంపిక చేసారు. ఇతర విభాగంలో టాటా మోటార్స్ (ఈఆర్సి), ఐటిసి జె.ఎస్.డబ్ల్యు సిమెంట్,ఐటిసి.లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్,టాటా స్టీల్,ఎం&ఎం రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అవార్డు లబించింది. భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిరెక్టర్ 1991 లో ప్రారంబించిన ఈ గోల్డెన్ పీకాక్ పురస్కారం అవార్డును కార్పోరేట్ల పనితీరు కు ప్రామాణికంగా భావిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కంట్రోల్ ఎస్ డేటా సెంటర్లకు దక్కిన గోల్డెన్ పీకాక్ పురస్కారం
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 22
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |