
Daily Current Affairs in Telugu 12-12-2020
అబుదాబి గ్రాండ్ ఫ్రీ విజేత గా నిలిచిన వెర్ స్టాపెన్ :

రెడ్ బుల్ డ్రైవర్ గా ఉన్న మ్యాక్స్ వెర్ స్టాఫాన్ అబుదాబి గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచాడు.సీజన్ లో చిట్టచివరిది అయిన ఈ రేసులో బొటాస్ (మెర్సిడెస్) రెండో స్తానంలో నిలిచాడు. అతడి కన్నా 16సెకన్ల ముందు వెర్ స్టాపెన్ రేసును ముగించారు.పోల్ పొజిషన్ తో మొదలైన అతడు ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సీజన్ లో వెర్ స్టాఫెన్ కు ఇది రెండో విజయం. కేరీర్ లో పదవది. ప్రపంచ చాంపియన్ లూయిస్ హమిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్ లో 11 విజయాలతో చాంపియన్ షిప్ గెలుచుకున్న లూయిస్ హమిల్టన్ కరోనా కారణం గా బహ్రెయిన్ లో గ్రాండ్ ఫ్రీ లో పోటీ పడలేదు. కాగా రెడ్ బుల్ కి చెందిన అలేగ్జండర్ అల్బాన్ నాలుగవ స్థానం సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అబుదాబి గ్రాండ్ ఫ్రీ విజేత గా నిలిచిన వెర్ స్టాపెన్
ఎవరు: వెర్ స్టాపెన్
ఎప్పుడు: డిసెంబర్ 12
యునిసెఫ్ దినోత్సవం గా డిసెంబర్ 11 :

ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 11 ను యునిసెఫ్ దినోత్సవం గా జరుపుకుంటారు. దేనిని డిసెంబర్ 11,1946 న ఐక్యరాజ్యసమితి యునిసెఫ్ ను యుద్దానంతర యూరప్ ను మరియు చైనా లోని పిల్లల అత్యవసర అవసరాలను తీర్చడానికి ఈ సంస్థ ను స్థాపించారు.దేని యొక్క పూర్తి పేరు ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి .చిన్న నాటి నుంచి కౌమార దశ వరకు పిల్లలను మరియు వారి యొక్క హక్కులను కాపాడటానికి యునిసెఫ్ 190 పైగా దేశాలు పని చేస్తున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: యునిసెఫ్ దినోత్సవం గా డిసెంబర్ 11
ఎవరు: ఐక్యరాజ్యసమితి
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: డిసెంబర్ 11
5 వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభించిన కేంద్ర జల్ శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా :

5 వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ (ఐడబ్ల్యుఐఎస్) 2020 డిసెంబర్ 10 న ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా ప్రారంభించారు. IWIS 2020 యొక్క లక్ష్యం సమగ్ర విశ్లేషణ మరియు నదులు మరియు నీటి వ్యవస్థ పైసమగ్ర నిర్వహణ. IWIS 2020 ను నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) మరియు సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ (cGanga) నీటి సంబంధిత సమస్యలు మరియు భూమి యొక్క అత్యంత విలువైన వనరును కాపాడటానికి తీసుకున్న చర్యలను చర్చించడానికి ఈ కార్యక్రమం నిర్వహించింది. IWIS 2020 యొక్క థీమ్ ఆర్థ్ గంగా: నది పరిరక్షణ సమకాలీకరించబడిన అభివృద్ధి. ఈ సమావేశంలో నది పునర్ యవ్వనము మరియు స్థానిక నది యొక్క సమగ్ర విశ్లేషణ మరియు సమీక్షజరిగింది. ఇది ఆర్థ్ గంగా గురించి కూడా చర్చ, అనగా నది పరిరక్షణ సమకాలీకరించబడిన అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే విషయాలపై జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 5 వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభించిన కేంద్ర జల్ శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా
ఎవరు: కేంద్ర జల్ శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా
ఎప్పుడు: డిసెంబర్ 12
అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం “APVAX” ప్రోగ్రాంను ప్రారంభించిన ADB బ్యాంక్ :

మనీలాకు చెందిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి) తన అభివృద్ధి చెందుతున్న సభ్య దేశాల కోసం ఆసియా పసిఫిక్ వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీ (ఎపివిఎక్స్) అనే చొరవను ప్రారంభించింది. APVAX కోసం బ్యాంక్ 9 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల సభ్యులకు ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో,మహమ్మారిని అధిగమించడానికి మరియు ఆర్థిక పునరుద్ధరణపై దృష్టి పెట్టడంలో APVAX కీలక పాత్ర పోషిస్తుంది. APVAX ద్వారా ADB బ్యాంకు దాని అభివృద్ధి చెందుతున్న సభ్యులకు వేగవంతమైన మరియు సమానమైన మద్దతును అందిస్తుంది. వీరికి టీకాలు సేకరించడానికి ఫైనాన్సింగ్అవసరం అలాగే కోవిడ్-19 వ్యాక్సిన్ను సురక్షితంగా,సమానంగా మరియు సమర్థవంతంగా అందించచడానికి మరియు దాని పంపిణీ చేయడానికి తగిన ప్రణాళికల ను అందిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం “APVAX” ప్రోగ్రాంను ప్రారంభించిన ADB బ్యాంక్
ఎవరు: ADB బ్యాంక్
ఎప్పుడు: డిసెంబర్ 12
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |