
Daily Current Affairs in Telugu 10-12-2020
ముంబై ఇండియన్స్ టీం టాలెంట్ స్కౌట్ గా పార్దివ్ పటేల్ నియమకం:

ఇంటర్ నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వికెట్ కీపర్ పార్దివ్ పటేల్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తో కలిసి పని చేయనున్నారు. ఈ మేరకు పార్దివ్ పటేల్ ను తమ టాలెంట్ స్కౌట్ గా నియమిచుకున్నట్లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది. దీంతో గ్రాస్ రూట్ లెవెల్ లో ప్లేయర్ లను వెతికి పట్టుకుని వాళ్ళను నాణ్యమయిన క్రికెటర్ గా తీర్చి దిద్దడం పార్దివ్ పటేల్ పని. పార్దివ్ పటేల్ కు డొమెస్టిక్ ఇంటర్ నేషనల్ క్రికెట్ లో చాలా అనుభవం ఉంది. దాదాపు 18ఏళ్ల పాటు వివిధ స్థాయిలో ఆయన క్రికెట్ ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ముంబై ఇండియన్స్ టీం టాలెంట్ స్కౌట్ గా పార్దివ్ పటేల్ నియమకం
ఎవరు: పార్దివ్ పటేల్
ఎక్కడ: ముంబై
ఎప్పుడు:డిసెంబర్ 10
బిల్ గేట్స్ కు దక్కిన ట్రై గ్లోబల్ జీవనకాల సాపల్య అవార్డు :

పర్యావరణాన్ని పరిరక్షించటంలో అధిక ఉత్పత్తి సాధనలో మహమ్మారి అరికట్టడానికి పరిశోదన కీలకమని మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ తెలిపారు .ట్రై గ్లోబల్ జీవనకాల సాపల్య అవార్డు బిల్ గేట్స్ కు లబించింది. ఈ అవార్డును డిసెంబర్ 10 న ఆన్ లైన్ విధానంలో జరిగిన ప్రధాన కార్యక్రమం లో ఆయన స్వీకరించారు. ఈ సందర్బంగా స్పందిస్తూ ప్రపంచాన్ని వణికించే జబ్బుల నుంచి రక్షణ మార్గాల పరిశోదన ద్వారానే లబిస్తాయిని వివరించారు. లైఫ్ టైం సర్వీస్ టు ఇండియన్ ఐటి ఇండస్ట్రి అవార్డును ఇటీవల మరణించిన దేశీయ ఐటి దిగ్గజం అయిన ఎఫ్సి కోహ్లి ఇదే సదస్సులో ప్రకటించారు. ఆయన అవార్డును ఆయన భార్య స్వీకరించారు. ఇంకా వివిధ విభాగాల్లో అవార్డులను టై గ్లోబల్ అందజేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బిల్ గేట్స్ కు దక్కిన ట్రై గ్లోబల్ జీవన కాల సాపల్య అవార్డు
ఎవరు: బిల్ గేట్స్
ఎప్పుడు: డిసెంబర్ 10
జగనన్న జీవ క్రాంతి అనే నూతన పథకం ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

వై.ఎస్సార్ చేయూత ,ఆసరా పథకాల ద్వారా ఎంపిక అయిన మహిళలకు గొర్రెలు ,మేకల ను పంపిణి చేసేందుకు ఉద్దేశించిన జగన్న జీవ క్రాంతి అనే ఒక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారబించింది. ఈ పథకం ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం లో డిసెంబర్ 10న వర్చువల్ విధానం లో ప్రారంబించారు.తరువాత జిల్లాలోని లబ్ది దారుల గురించి వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
- ఈ పథకంలో జీవన క్రాంతి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,869 కోట్ల వ్యయం తో మేలు జాతికి చెందిన 2,49 లక్షల మేకలు గొర్రెలు యూనిట్ల మూడు దశల్లో పంపిణి చేస్తున్నారు.
- ఇందులో ఒక్కో యూనిట్ లో ఐదు నెలల వయసున్న 14మేకలు లేదా గొర్రెలు ఒక మేక పోతు లేదా పొట్టేలు ఉంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: జగనన్న జీవ క్రాంతి అనే నూతన పథకం ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 10
ల్యాండింగ్ సమయంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన స్టార్ ఫిష్ రాకేట్ :

అమెరికా కు చెందిన విజయవంత౦ గా రాకెట్ ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్ ఫిష్ అనే రాకెట్ ల్యాండింగ్ సమయం లో పేలిపోయింది. అమెరికా లో ని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న బోకాచికా రాకెట్ కేంద్రం నుంచి డిసెంబర్ 09 ఈ రాకెట్ ను ప్రయోగించారు .ప్రయోగ అనంతరం 6నిమిషాల 42 సెకన్లు పయనించిన రాకెట్ స్ట్రాతో స్పియర్ ను చేరిందితరువాత వెంటనే పేలిపోయింది. ఇది చంద్రుడు మరియు అంగారకుడు మానవులకు సామాగ్రి ని తీసుకువెళ్ళి తిరిగి భూమికి పైకి సురక్షితంగా తీసుకు రావడానికి స్పేస్ ఎక్స్ సంస్థ రూపొంధించిన స్టార్ ఫిష్ వ్యోమ నౌక. ఆ రాకెట్ల పని తీరును అంచనా వేయడానికి తాజాగా ఈ ప్రయోగం జరిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ల్యాండింగ్ సమయంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన స్టార్ ఫిష్ రాకేట్
ఎవరు: స్టార్ ఫిష్ రాకేట్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: డిసెంబర్ 10
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |