
Daily Current Affairs in Telugu 19-12-2020
పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా మహమ్మద్ వసీం నియామకం :

పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ గా మాజీ క్రికెటర్ మహమ్మద్ వసీం నియమితుడయ్యాడు.అక్టోబర్ లో ఈ పదవి నుంచి వైదొలిగిన మిస్బా ఉల్ హాక్ స్థానంలో 43 ఏళ్ల మహమ్మద్ వసీం ను నియమిచినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రకటించింది.2023 ప్రపంచ కప్ వరకు అతను ఈపదవిలో ఉంటారని పేర్కొంది. 1996-2000 మద్య పాకిస్తాన్ కు ప్రాతినిత్యం వహించిన మహమ్మద్ వసీం 25వన్డేలలో పాటు ,18టెస్టుల్లో 783 పరుగులు చేసారు. అతను 2018 లో స్వీడన్ జట్టుకు కోచ్ గా పని చేసారు. పాకిస్తాన్ జట్టు 2021 లో దక్షిణాఫ్రికా ,న్యూజిలాండ్ ,ఇంగ్లాండ్ ,వెస్టిండీస్, జట్లతో సిరీస్ లకు అతిత్యం ఇవ్వనుంది. వీటితో పాటు భారత్ వేదికగా టి20 ప్రపంచ కప్ లో తలపడుతుంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా మహమ్మద్ వసీం నియామకం
ఎవరు: మహమ్మద్ వసీం
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: డిసెంబర్ 19
గోవా విముక్తి దినోత్సవం గా డిసెంబర్ 18

ఏటా డిసెంబర్ 19 న గోవా విమిక్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ తేదిన 1961 లో సైన్యం ఆపరేషన్ మరియు విస్తరించిన స్వాతంత్ర్య ఉద్యమం తరువాత గోవా పోర్చుగీస్ రాజ్యం నుంచి విడుదల చేయబడింది. డిసెంబర్ 18 1961 భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ గోవాను ఇండియన్ రిపబ్లిక్ లో చేర్చే ప్రక్రియను అమలు చేసింది.36గంటల యుద్ధం లో గోవా 450సంవత్సరాల పాలనా యొక్క సంకెళ్ళ నుంచి విముక్తిపొందింది.పోర్చుగీస్ పాలన నుంచి స్వేచ్చ పొందడానికి గోవా కు సహాయం చేసిన భారత సాయుడ దళాల జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గోవా విముక్తి దినోత్సవం గా డిసెంబర్ 18
ఎవరు: గోవా
ఎప్పుడు: డిసెంబర్ 18
వంటగ్యాస్ వినియోగం మొదటి స్థానం లో మొదటి స్థానం లో నిలిచిన గోవా రాష్ట్రం :

దేశవ్యాప్తంగా అత్యదికంగా వంట గ్యాస్ (ఎల్పిజి బయో గ్యాస్) వినియోగిస్తున్న కుటుంబాలు ఉన్న రాష్ట్రాలలో గోవా మొదటి స్థానం లో నిలిచింది. గోవా లో 83.6 శాతం మంది కుటుంబాలు వంట గ్యాస్ ను వినియోగిస్తూ కాలుష్య రహిత వాతావరన౦ లో జీవిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వ్ 2019-20 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొదటి దశలో ఐదు రాష్ట్రాలు ,17కేంద్ర పాలిత ప్రాంతాల్లో వంట గ్యాస్ సర్వ్ నిర్వహించారు. రెండో దశ సర్వ్ నివేదికను 2021 ఏడాది విడుదలచేయనున్నారు. ఇందులో గోవా తరువాత 91.8 శాతం కుటుంబాలకు వంట గ్యాస్ వినియోగం లోరెండో స్థానంలో నిలిచింది. 83..6శాతం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మూడో స్థానం లో నిలిచింది. కాగా పారిశుధ్య సూచికలో లక్ష్య ద్వీప్ మొదటి స్థానం లో సాదించింది.అక్కడ 99.8శాతం మంది కుటుంబాలు మెరుగైన పారిశుద్యంను పాటిస్తున్నాయి. రెండో స్థానం లో ఉన్న కేరళా రాష్ట్రం 98.7 శాతం కుటుంబాలు మెరుగైన పారిశుద్యం పరిస్తితులలో జీవిస్తున్నాయి.పారిశుద్యం లో బిహార్,లద్దాక్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: వంటగ్యాస్ వినియోగం మొదటి స్థానం లో మొదటి స్థానం లో నిలిచిన గోవా రాష్ట్రం :
ఎవరు: గోవా రాష్ట్రం
ఎప్పుడు: డిసెంబర్ 19
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |