
Daily Current Affairs in Telugu 12-02-2021
ఐక్యరాజ్యసమితి మనవ హక్కుల మండలి తిరిగి మళ్లి చేరిన అమెరికా దేశం :

అమెరికా దేశ మాజీ అద్యక్షుడు ఐన డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ సంస్థ నుంచి వైదొలిగిన మూడేళ్ళ తరువాత ఐక్యరాజ్య సమితి మనవ హక్కుల యు.ఎన్.హెచ్.ఆర్.సిలో తిరిగి చేరాలని అమెరికా అద్యక్షుడు జో బైడెన్ తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ మరియు మిగతా మిత్ర దేశాలు ఇజ్రాయెల్ ను అన్యాయంగా లక్ష్యం చేసుకోవడంతో డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో 2018 ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన మనవ హక్కుల మండల సమితి యు.ఎన్‌హెచ్.ఆర్.సి నుంచి వైదోలోగింది. కాగ నూతన అమెరికా అద్యక్షుడు ట్రంప్ చర్యలకును తిప్పి కొట్టి అతని నిర్ణయాలను వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పారిస్ క్లైమేట్ అకార్డ్ లో కూడా చేరారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐక్యరాజ్యసమితి మనవ హక్కుల మండలి తిరిగి మళ్లి చేరిన అమెరికా
ఎవరు: అమెరికా
ఎక్కడ: యు.ఎన్.హెచ్.ఆర్.సిలో
ఎప్పుడు:ఫిబ్రవరి 12
రాజ్యసభ విపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే నియామకం :

రాజ్యసభ లో ప్రతి పక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పేరున్న మల్లికార్జున్ ఖర్గే ఇటీవల బాద్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిలో ఉన్న గులాం నబి అజాబ్ పదవి కాలం ఇటీవల ముగియడంతో ఆ స్థానం లో ఖర్గే ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఈ మేరకు చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు కు లేఖ రాసింది. కాగా కర్ణాటక చెందిన ప్రముఖ దళిత నాయకుడు కావడం గమనార్హం.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాజ్యసభ విపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే నియామకం
ఎవరు: మల్లికార్జున్ ఖర్గే
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 12
ఏపి పశుసంవర్దన శాఖ కు దక్కిన జాతీయ స్థాయి అవార్డ్ :

ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖకు జాతీయ స్థాయిలో స్పెషల్ ఇంట్రస్ట్ గ్రూప్ ఆన్ ఈ గవర్నెన్స్ 2020 అవార్డు దక్కింది. ఈ పురస్కారం ను ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య గారు ఫిబ్రవరి 12న లఖ్ నవూలో ఉత్తరప్రదేశ్ సిఎం అయిన యోగినాద్ అడిత్యనాద్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పశుపోషకుల శ్రేయస్సు కొరకు చేపడుతున్న సంక్షేమ కర్యకలపను ఈ అవార్డ్ దక్కినట్లు ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ వివరించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏపి పశుసంవర్దన శాఖ కు దక్కిన జాతీయ స్థాయి అవార్డ్
ఎవరు: ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖకు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఫిబ్రవరి 12
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్ డ్యాం 2021లో ప్రతిస్టాత్మక టైగర్ అవార్డు గెలుచుకున్న కుజుంగాల్ చిత్రం :

ఇటీవలే ముగిసిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ రోటర్‌డామ్ 2021 లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డును గెలుచుకున్న తొలి తమిళ చిత్రంగా ‘కూజంగల్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర నిర్మాత పిఎస్ వినోత్రరాజ్ ఇది ఈయనకు మొదటి చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్డ్యామ్ 2021 ఇటీవల ముగిసిన 50 వ ఎడిషన్‌లో ఇవ్వబడిన అత్యున్నత గౌరవం ఇది. ఇందులో ల్యాండ్‌స్కేప్స్ ఆఫ్ రెసిస్టెన్స్, లుకింగ్ ఫర్ వెరెనా, బ్లాక్ మెడుసా మరియు కొన్నింటికి ది ఎడ్జ్ ఆఫ్ డేబ్రేక్ వంటి చిత్రాలు కూడా నిలిచాయి.,కాగ ఈ తమిళ చిత్రం అయిన కూజంగల్ చివరికి అగ్ర గౌరవాన్ని దక్కించుకుంది, కాగా ఇది ఈ అవార్డు గెలుచుకున్న మొదటి తమిళ చిత్రం మరియు రెండవ భారతీయ చిత్రం.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్ డ్యాం 2021లో ప్రతిస్టాత్మక టైగర్ అవార్డు గెలుచుకున్న కుజుంగల్ చిత్రం
ఎవరు: కుజుంగల్ చిత్రం
ఎక్కడ: అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్ డ్యాం 2021లో
ఎప్పుడు: ఫిబ్రవరి 12
ప్రపంచ రేడియో దినోత్సవంగా ఫిబ్రవరి 13:

ప్రపంచ రేడియో దినోత్సవంగా ఫిబ్రవరి 13ను జరుపుకుంటారు.ఈ రోజును ఈ మాధ్యమాన్ని ప్రోత్సహించడం మరియు ప్రజలలో రేడియో యొక్క వాడకంను పెంచడం ఈ రేడియో దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం. కాగా దీని ద్వారా రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కలిపించడం నూతన సమాచార సేకరణ కు ప్రోత్సహించడం చేస్తుంది. యునెస్కో 2011 లో దీని యొక్క 36వ జనరల్ కాన్ఫరెన్స్ సెషన్లో ఫిబ్రవరి 13 ను ప్రపంచ రేడియో దినం గా ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ రేడియో దినోత్సవంగా ఫిబ్రవరి 13
ఎవరు: యునెస్కో
ఎక్కడ: ప్యారిస్
ఎప్పుడు: ఫిబ్రవరి 13
ఒలింపిక్ నిర్వాహక కమిటీ అద్యక్షుడు యేషిరో రాజీనామా :

మరో అయిదు నెలల ఆరంబం కానున్న ఒలింపిక్స్ సన్నాహాలకు ఎదురుకొంటున్న టోక్యో ఒలింపిక్ నిర్వాహక కమిటీ అద్యక్షుడు యేషిరో మోరి తన పదవికి ఫిబ్రవరి 12ణ రాజీనామా చేసారు.ఎగ్సిక్యుటివ్ బోర్డు సమవేశానికి ముందు అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.మహిళలపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ పదవి నుంచి దిగిపోవడానికి ఒప్పుకోలేదు.కానీ అన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఇక తప్పనిసరి అయన ఈ పదవి కి రాజీనామా చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒలింపిక్ నిర్వాహక కమిటీ అద్యక్షుడు యేషిరో రాజీనామా
ఎవరు: యేషిరో
ఎక్కడ: టోక్యో
ఎప్పుడు: ఫిబ్రవరి 12