
Daily Current Affairs in Telugu 07-02-2021
బ్లూమ్బెర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో మొదటి స్థానం లో దక్షిణ కొరియా దేశం :

బ్లూమ్‌బెర్గ్ తన తాజా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ను విడుదల చేసింది. ఈ నివేదికలో దక్షిణ కొరియా తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది యుఎస్ యూరోపియన్ దేశాల సమూహాన్ని కలిగి ఉన్న టాప్ 10 లో నిలిచింది. నాలుగో స్థానానికి పడిపోయిన జర్మనీ ఇపుడు దక్షిణ కొరియా నుంచి మొదటి స్థానం ను తిరిగి పొందింది. ఆసియాలోని దేశాలలో ఇప్పటి వరకు ప్రచురించబడిన తొమ్మిది సంవత్సరాలలో ఏడు సూచికలలో అగ్రస్థానంలో ఉంది ఈ నివేదికలో భారతదేశం యొక్క స్థానం మెరుగుపడింది. ఈ జాబితాలో, గత సంవత్సరంతో పోల్చితే నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని ప్రపంచంలో నూతన ఆవిష్కరణల విషయంలో భారతదేశం 50 వ స్థానంలో ఉంది
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్లూమ్బెర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో మొదటి స్థానం లో దక్షిణ కొరియా దేశం
ఎవరు: దక్షిణ కొరియా
ఎప్పుడు : ఫిబ్రవరి 07
దేశంలోనే తొలి సారిగా తల్లి పాల బ్యాంక్ ను ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం :

కేరళలో తొలి తల్లి పాల బ్యాంకు ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటైంది. రోటరీ క్లబ్ ఆఫ్ కోచి గ్లోబల్ సహకారం తో నెలకొల్పిన ఈ బ్యాంకు నుఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రారంబించారు. ఇక్కడ సేకరించిన పాలను అనారోగ్యంగా ఉన్న తల్లుల చిన్నారులకు తల్లిని కోల్పోయిన శిశువులకు ఇస్తారు .రూ.35లక్షల వ్యయం తో నెలకొల్పిన ఈ బ్యాంకు లో పాశ్చరైజేషణ్ యూనిట్,రిఫ్రిజిరేటర్స్ ఆర్o ప్లాంట్ ,కంప్యుటర్ లు ఇతర పరికరాలు ఉన్నాయి. ఇక్కడ ఆరు నెలల పాటు పాలను నిల్వ ఉంచే అవకాశం ఉంది. ఇక్కడ ఆస్పత్రిలో ఐసియులో చేరిన శిశువులకు ఉంచితంగా ణే పాలను అందించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే తొలి సారిగా తల్లి పాల బ్యాంక్ ను ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం
ఎవరు: కేరళ ప్రభుత్వం
ఎక్కడ: కేరళ
ఎప్పుడు : ఫిబ్రవరి 07
ఆసియా ఎన్ ఫోర్స్ మెంట్ అవార్డుకు ఎంపిక అయిన భారత తొలి అధికారి సాస్మిత లెంకా :

ఓడిశా రాష్ట్రానికి చెందిన అటవీ అధికారి సాస్మితా లెంకా కు అరుదైన గుర్తింపు దక్కింది. ఐక్య రాజ్య సమితి ఏడాది కి ఒకసారి ఇచ్చే ఆసియా ఎన్విరాన్ మెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ అవార్డుకు భారత్ నుంచి ఎంపిక అయిన తొలి అధికారి గా నిలిచింది. అరుదైన పంగోలిన్ జంతువుల అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసిందుకు చేసిన కృషికి గాను జెండర్ లీడర్ షిప్ అండ్ ఇంపాక్ట్ కేటగిరిలో ఆమె ఎంపిక అయ్యారు. కటక్ లోని అత్తా ఘర్ ఫారెస్ట్ డివిజినల్ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న సాస్మిత ఓడిశాలో జరిగే పంగోలిన్ల అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక వాటి గురించి స్థానికులలో అవహగన కల్పించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా ఎన్ ఫోర్స్ మెంట్ అవార్డుకు ఎంపిక అయిన భారత తొలి అధికారి సాస్మిత లెంకా
ఎవరు: సాస్మిత లెంకా
ఎక్కడ: ఓడిశా
ఎప్పుడు : ఫిబ్రవరి 07
మయన్మార్ లో జరుగుతున్న ఉద్యమం అనివివేతకు చర్యలు తీసుకుంటున్న సైన్యం :

మయన్మార్ లో ప్రజా స్వామ్యం లోప్రజా స్వామ్యం అనుకూల ఉద్యమం తీవ్రమవడంతో సైనిక ప్రభుత్వం అణచివేత చర్యలను ప్రారంబించింది. ఫిబ్రవరిలో07న ఇంటర్ నెట్ సేవలను నిలిపి వేసింది. ఇప్పటికే ఫేస్బుక్ పై ఆంక్షలు పెట్టడంతో పాటు ట్విటర్ ఇన్స్టా గ్రామ్ లపై నిషేధం విధించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నెపం మోపుతూ ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం స్వయంగా పరిపాలను చేపట్టింది. మరోవైపు ఉదయం యంగూన్ లో భారీ ప్రదర్శన ను జరిగింది. కర్మాగారాల కార్మికులు విద్యార్థులు ప్రముఖంగా పాల్గోన్న్నారు .కాగా మిలిటరీ నిరంకుశత్వం నశించాలంటూ ఆందోళనలు కారులు నినాదాలు చేసారు. బొటన వేలు చిటికన వేలు మడిచి మద్యన ఉన్న మూడు వెళ్ళను చేతులు పైకెత్తి చూపడాన్ని నిరసనగా చిహ్నంగా ఎంచ్కున్నారు. పొరుగున ఉన్న థాయ్ ల్యాండ్ లో నిరసన తెలపడానికి ఈ చిహ్నం ను ఉపయోగి౦చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మయన్మార్ లో జరుగుతున్న ఉద్యమం అనివివేతకు చర్యలు తీసుకుంటున్న సైన్యం
ఎవరు: మయన్మార్ సైన్యం
ఎక్కడ: మయన్మార్
ఎప్పుడు : ఫిబ్రవరి 07
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |