
Daily Current Affairs in Telugu 02-12-2020
ఫార్చున్ 500 కంపెనీల జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ :

ఫార్చున్ 500భారత కంపెని ల జాబితాలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్.ఐఎల్) అగ్రస్థానాన్ని పొందింది. నవంబర్ 02న విడుదల అయిన ఈ జాబితాలో ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి),ఓఎన్జిసి,ఎస్బిఐ,బిపిసిఎల్ లు ఆ తర్వాతి స్థానాలను పొందాయి. టాటా మోటార్స్ (6) రాజేష్ ఎక్స్ పోర్ట్ (7) ,టిసిఎస్ (8) ఐసిఐసి ఐ బ్యాంక్ (9) ఎల్ అండ్ టి (10) లు టాప్ -10 లో చోటు సంపాదించుకున్నాయి .ఆగస్టులో విడుదల అయిన ఫార్చున్ అంతర్జాతీయ ర్యాంకుల్లో ఆర్ఐఎల్ తొలి సారిగా టాప్-100 కంపెనీల్లో చోటు దక్కించు కున్న విషయం తెలిసిందే. కోల్ కతా కేంద్రంగా పని చేసే ఆర్.పి సంజీవ్ గోయెంకా గ్రూప్ నకు చెందిన ఫార్చున్ ఇండియా ఈ జాబితాలను ప్రచురించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫార్చున్ 500 కంపెనీల జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎవరు: రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎప్పుడు: డిసెంబర్ 02
అంతర్జాతీయ కాలుష్య నిర్మూలన దినోత్సవం గాడిసెంబర్ 02 :

పర్యావరణ కాలుష్యం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఒకటి కంటే ఎక్కువమంది యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ ప్రధానంగా మానవ కార్యకలాపాల వల్ల సంభవిస్తున్నాయి. వివిధ మార్గాల్లో పర్యావరణానికి మానవుల ద్వారా హాని కలిగుతుంది. ఈ రోజుల్లో కాలుష్య నివారణ అనేది ఒక ప్రధాన ప్రపంచ ఆందోళనగ మారింది. ఎందుకంటే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి శ్వాస తీసుకోవడానికి గాలిని శుభ్రపరచడానికి, తాగడానికి నీరు తీసుకునే అవసరం.ఈ కాలుష్యం ముఖ్యంగాపారిశ్రామిక వేత్తల వల్ల వారి వారి కర్మాగారాల్లో నుంచి విడుదల అయ్యే కాలుష్యకారక రసాయనాల వల్ల నీరువాహనాల ద్వారా వెలువడే పొగ ద్వారా,గాలి కాలుష్యం అవుతుంది. దీని వల్ల జరిగే నష్టం వాటి వల్ల మానవులకు జరిగే నష్టం గురించి తెలియచేయడం దీని యోక్క ముఖ్య ఉద్దేశం.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ కాలుష్య నిర్మూలన దినోత్సవం గాడిసెంబర్ 02
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా :
ఎప్పుడు: డిసెంబర్ 02
టెక్నాలజీ వినియోగం లో జాతీయ స్థాయిలో 5 అవార్డులను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ పోలిస్ శాఖ :

ఆంధ్రప్రదేశ్ పోలిస్ లకు జాతీయ స్థాయిలో అవార్డుల పంటపడుతుంది. టెక్నాలజీ వినియోగం పై స్కోచ్ గ్రూప్ జాతీయ స్థాయిలో 18 అవార్డులు ప్రకటించగా వాటిలో ఏకంగా ఐదు అవార్డులను ఏపి పోలిస్ శాఖ దక్కించుకుంది. దీంతో కేవలం 11నెలల వ్యవదిలోనే ఏకంగా 108జాతీయ అవార్డులను దక్కించుకుని ఏపి పోలిస్ లు సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా అవార్డులు దక్కించుకున్న వాటిల్లో సైబర్ మిత్ర (మహిళా బద్రత) తో పాటు అందుబాటులో నేరస్తులు వివరాలు (అఫెండర్ సెర్చ్ ),మహిళల బద్రత (ఉమెన్ సేఫ్టీ) కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా ,ఫ్యాక్షన్ గ్రామాల్లో నిందితుల వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో తెచ్చిన సువిధ కార్యక్రమం అమలులో అనంతపురం జిల్లా ,టెక్నాలజీ లో పోలిస్ సిబ్బంది శిక్షణ ఇచ్చే ప్రాజెక్ట్ టాటా కార్యక్రమం అమలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలిస్ యంత్రాంగం స్కోచ్ అవార్డులను దక్కించుకున్నాయని ఏపి పోలిస్ శాఖా తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: టెక్నాలజీ వినియోగం లో జాతీయ స్థాయిలో 5అవార్డులను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ పోలిస్ శాఖ
ఎవరు: ఆంధ్రప్రదేశ్ పోలిస్ శాఖ
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 02
చండ్రుడి పైన మట్టిని విజయవంతంగా సేకరించిన చైనా వ్యోమనౌక చాంగే 5:

జాబిల్లి పై నుంచి మట్టి ,రాళ్ళను భూమికి తీసుకు వచ్చేందుకు చైనా ప్రయోగించిన చాంగే -5వ్యోమ నౌక నవంబర్ 02న చంద్రుడి ఉపరితలం పై విజయవంతంగా తవ్వకాలు చేపట్టింది.ఎంపిక చేసిన ప్రాంతంలో అత్యంత కచ్చితత్వంతో నమూనాలను సేకరించింది. సుమారు 40ఏళ్ల కల పలించ బోతుందని త్వరలోనినే ఈ పదార్థాలు భూమికి చేరనున్నాయని చైనా దేశ అంతరిక్ష సంస్థ సిఎన్ఎస్ఏ వెల్లడించింది. డ్రాగన్ దేశం ఇప్పటి వరకు చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదే అత్యంత సంక్లిష్టంగా జరిగింది. నవంబర్ 2న చంద్రుడి పై దిగిన చాంగే-5 చంద్రుడి పైనుంచి మట్టి రాళ్ళను భూమి పై కి పంపుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: చండ్రుడి పైన మట్టిని విజయవంతంగా సేకరించిన చైనా వ్యోమనౌక చాంగే 5
ఎవరు: చైనా వ్యోమనౌక చాంగే 5
ఎక్కడ: : చైనా
ఎప్పుడు: డిసెంబర్ 02
మూడు వన్డే ల సిరీస్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు :

భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు కరోనా వైరస్ లాక్ డౌన్ తరువాత జరిగిన తొలి విదేశీ మ్యాచ్ లో సిరీస్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆతిత్య జట్టు ఆస్ట్రేలియా టీం ఇండియా ను మొదటి రెండు మ్యాచ్ లు ఓడించింది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాదించింది. ఇందులో బాగంగా వరుసగా రెండు సెంచరీలు సాదించిన ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా స్టీవ్ స్మిత్ గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మూడు వన్డే ల సిరీస్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
ఎవరు: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
ఎక్కడ: ఆస్ట్రేలియా
ఎప్పుడు: డిసెంబర్ 02
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |