
Daily Current Affairs in Telugu 16-12-2020
బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేం లో చోటు దక్కించుకున్న మేవేదర్,లైలా అలీ :

ప్రొఫెషనల్ కెరీర్ ను అజేయంగా ముగించిన బాక్సింగ్ దిగ్గజం ప్లాయిడ్ మేవేదర్,మాజీ హెవి వెయిట్ చాంపియన్ వ్లాదిమిర్ క్లిచ్కో ,మహిళా బాక్సర్,దిగ్గజ బాక్సర్ మహమ్మద్ అలీ తనయ లైలా అలీ అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేం లో చోటు దక్కించుకున్నారు. 2021 కోసం ప్రకటించిన ఆ జాబితాలో వీళ్ళతో పాటు మాజీ ఒలింపిక్ చాంపియన్ ఆండ్రూ వార్డ్ ,వోల్ఫ్ ,ట్రిమియార్ ,మార్గరెట్ లకు స్థానం దక్కింది. మరణం తరువాత డేవి మూర్ ,జాకి ,బ్రౌన్ తదితరులకు ఆ జాబితాలో చోటు కల్పించారు. 2020 జాబితాలో బెర్నార్డ్ ,జువాన్ ,మోస్లీ ,మార్టీన్ ,రిజ్కర్ తదితరులున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేం లో చోటు దక్కించుకున్న మేవేదర్,లైలా అలీ
ఎవరు : మేవేదర్,లైలా అలీ
ఎప్పుడు : డిసెంబర్ 16
2030 ఆసియా క్రీడలకు ఆథిత్యం ఇవ్వనున్న ఖతర్ :

2030 ఆసియా క్రీడలకు ఖతర్ రాజదాని అయిన దోహా ఆథిత్యం ఇవ్వనుంది. ఆ తర్వాత నాలుగేళ్ళకు 2034 క్రీడలు సౌది అరేబియా రాజదాని రియాద్ లో జరగనున్నాయి. ఈ రెండు శత్రు దేశాలు 2030 ఆతిథ్య హక్కులు కోసం పోటీ పడగ డిసెంబర్ 1న ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఒసిఎ) జనరల్ అసెంబ్లీ సమావేశం లో ఓటింగ్ ద్వారా ఖతర్ కు ఆ హక్కులు కట్టబెట్టారు.ఈ ఓటింగ్ లో ఓడిన రియాద్ కు ఆ తరువాత జరిగే ఆసియా క్రీడల నిర్వహించే అవకాశం దక్కింది. 2017లో ఖతర్ పై సౌది అరేబియా వ్యాపార ,ప్రయాణ ఆంక్షలు విధించింది. 2022ఫిఫా ప్రపంచ కప్ నకు ఖతర్ అతిత్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే .
క్విక్ రివ్యు :
ఏమిటి: 2030 ఆసియా క్రీడలకు ఆథిత్యం ఇవ్వనున్న ఖతర్
ఎవరు : ఖతర్ దేశం
ఎక్కడ: ఖతర్ దేశం
ఎప్పుడు : డిసెంబర్ 16
స్పేస్ ఎక్స్ క్రూ-3 మిషన్ కమాండర్ గా ఎంపిక అయిన రాజాచారి :

అమెరికా వైమానిక దళం లో కర్నల్ పని చేస్తున్న భారతీయ అమెరికన్ రాజచారి (43) స్పేస్ ఎక్స్ క్రూ-3మిషన్ కమాండర్ గా ఎంపిక అయ్యారు. మిగిలిన ఇద్దరు వ్యోమగాములలో అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా కు చెందిన టామ్ మార్ష్ బర్న్ పైలట్ గా ఐరోపా అంతరిక్ష పరిశోదన సంస్థ (ఈఎస్ ఏ) కు చెందిన మత్తియాస్ మౌరర్ మిషన్ స్పెషలిస్ట్ గా ఎంపిక అయ్యారు. ఐఎస్ఎస్ కు పయనం అయ్యేందుకు నాసా ఈఎస్ఏ లు చేపడుతున్న మిషన్ ప్రారంబ తేది వచ్చే ఏడాది ఉండొచ్చు. నాలుగో సభ్యుడిని త్వరలోనే నాసా ఎంపిక చేయనుంది. 2017 లో నాసా వ్యోమగామి శిక్షణకు ఎంపిక అయిన రాజాచారి కి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం విశేషం .
క్విక్ రివ్యు :
ఏమిటి: స్పేస్ ఎక్స్ క్రూ -3 మిషన్ కమాండర్ గా ఎంపిక అయిన రాజాచారి
ఎవరు : రాజాచారి
ఎప్పుడు : డిసెంబర్ 16
ఆసియా పసిఫిక్ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా శేఖర్ వెంపటి ఎన్నిక :

ప్రపంచం లోనే అతి పెద్ద బ్రాడ్ కాస్టింగ్ సంఘాల్లో ఒకటైన ఆసియా పసిఫిక్ ప్రసార సంఘం ఉపాద్యక్షుడిగా ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సియివో ) శశి శేఖర్ వెంపటి గారు డిసెంబర్ 16న ఎన్నిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన ను విడుదల చేసింది. డిసెంబర్ 16 నుండి మూడేళ్ళ పాటు శేఖర్ ఉపాద్యక్షుడిగా కొనసాగనున్నారు అని తెలిపింది. 1964 లో ఏర్పాటైన ఈ సంఘంలో 57 దేశాల నుంచి 286 కు పైగా ప్రసారా సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థలు ద్వారా మొత్తం 300 కోట్ల మంది ప్రజలకు వార్తలు చేరుతున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా పసిఫిక్ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నిక అయిన శేఖర్ వెంపటి
ఎవరు : శేఖర్ వెంపటి
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : డిసెంబర్ 16
మానవ అబివృద్ది సూచిలో 131 వ స్థానం లోనిలిచిన భారత్ :

మనవాబివ్రుద్ది సూచీ లో భారత్ గతంతో పోలిస్తే ఒక స్థానం కిందకు పడిపోయింది .189దేశాలతో కూడిన ఈ జాబితాలో 131వ స్థానానికి పరిమితం అయింది. ఆయా దేశాలలో ఆరోగ్యం విద్య జీవన ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా రూపొంది౦చిన సూచీ ని ఐరాసా అబివృద్ది కార్యక్రమం (యుఎన్డిపి) తాజాగా విడుదల చేసింది. అందులో నార్వే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాలలో వరుసగా ఐర్లాండ్ ,స్విట్జర్ లాండ్,హాంకాంగ్,ఐస్ లాండ్ లు ఉన్నాయి. భారత్ కంటే కాస్త మెరుగ్గా భూటాన్ 129వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (133),నేపాల్ (142) ,పాకిస్తాన్ (154) మన దేశం కంటే వెనుకంజ లో ఉన్నాయి. 2019లో భారత్ సగటు జీవిత కాలం 69.7ఏళ్లుగా ఉన్నట్లు మానవ అబివృద్ది నివేదిక తెలిపింది. ఈ విలువ బంగ్లాదేశ్ లో 72.6ఏళ్ళుగా, పాకిస్తాన్ లో 67.3 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. 2018 మానవ అబివృద్ది సూచీ లో భారత్ 130 వ స్థానం లో ఉంది
క్విక్ రివ్యు :
ఏమిటి: మనవ అబివృద్ది సూచిలో 131 వ స్థానం లోనిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : డిసెంబర్ 16
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |