
Daily Current Affairs in Telugu 06-02-2021
సి.ఆర్ పి.ఎఫ్ కోబ్రా దళంలో తొలిసారిగా 34 మంది మహిళలకు దక్కిన చోటు :
దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం లో పాల్గొనేందుకు సిఆర్పిఎఫ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోబ్రా దళం లో తొలిసారిగా 34మంది మహిళ సిబ్బంది చేరారు. త్వరలోనే వీరు మావోయిస్టులు ఏరివేత కార్యక్రమంలో పాల్గొననున్నారు. గురుగ్రాంలోని కదార్ పూర్ గ్రామంలో ఫిబ్రవరి 07న ఏర్పాటు చేసిన కార్య క్రమం లో సిఆర్ పి ఎఫ్ డిజి ఏపి మహేశ్వరి సమక్షం లో మహిళల బృందాన్ని కోబ్రా విభాగం లోకి లాంచనంగా తీసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సి.ఆర్ పిఎఫ్ దళం లో కోబ్రా లో తొలిసారిగా 34 మంది మహిళలకు దక్కిన చోటు
ఎవరు: : సి.ఆర్ పిఎఫ్
ఎప్పుడు : ఫిబ్రవరి 06
దేశంలోనే తొలి ఈ మంత్రివర్గం ప్రవేశపెట్టిన రాష్ట్రం గా హిమాచల్ ప్రదేశ్ :

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ మంత్రి వర్గం కార్యకలాపాలు కాగిత రహితంగా జరనున్నాయి. దేశంలోనే తొలి ఈ- అసెంబ్లీ ఈ మంత్రి వర్గంగా పేరు పొందాయి. ఫిబ్రవరి 07న సిఎం జైరాం ఠాకూర్ ఎలాంటి కాగితాలను ఉపయోగించకుండా కేవలం ఎలక్ట్రానిక్ పద్దతిలో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది ఆయన ఈ విధానం లోనే బడ్జెట్ ను సమర్పించారు. 2014 ఆగస్టు 05 నుంచి ఈ విధానసభను నిర్వహిస్తున్నారు. టచ్ స్క్రీన్ల ద్వారానే కార్యకలాపాలన్నీ జరుగుతాయి. ఈ కారణంగా ఏటా రూ.15కోట్లు ఆదాఅవుతోంది. దీన్ని స్పూర్తిగా తీసుకుని సచివాలయానికి చెందిన మొత్తం కార్యకలాపాలను ఎలక్ట్రానిక్ పద్దతిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సైబర్ దాడులు జరగకుండ కూడా ఇందులో ఏర్పాట్లు చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే తొలి ఈ మంత్రివర్గం ప్రవేశపెట్టిన రాష్ట్రం గా హిమాచల్ ప్రదేశ్
ఎవరు: హిమాచల్ ప్రదేశ్
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్
ఎప్పుడు : ఫిబ్రవరి 06
బిడిఎల్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న 12 అంతర్జాతీయ సంస్థలు :

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) దేశ విదేశాలలో 12సంస్థలతో పరస్పర అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. బెంగళూర్ లో ఇటీవల జరిగిన ఏరో స్పేస్ ఇండియా-21 సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. రెండు కొత్త అస్త్రాలు బి.డిఎల్ ఆవిష్కరణ జరిగింది. డిఆర్డివో బిడిఎల్ ఎన్ఎస్టిఎల్ సంయుక్తంగా డిజైన్ అబివృద్ది చేసిన అత్యాధునిక జలాంతర్గామి టార్పేడో గురుదాస్తావి దిశాని ని ఆవిష్కరించారు.యుకె ప్రాన్స్ ఉక్రెయిన్,బల్గేరియ దేశాలకు చెందిన సంస్థలతో పాటు భారతీయ కంపెనీలతో బిడిఎల్ ఒప్పందం చేసుకుంది. వీటిలో అంకుర సంస్థలు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : బిడిఎల్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న 12 అంతర్జాతీయ సంస్థలు
ఎవరు: 12 అంతర్జాతీయ సంస్థలు
ఎప్పుడు : ఫిబ్రవరి 06
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల లో స్వర్ణం సాధించిన తెలంగాణ అథ్లెట్ నందిని :

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ లో చాంపియన్ షిప్ పోటీల తొలి రోజు తెలుగు అథ్లెట్ లు మెరిసారు. అండర్ -18బాలికల లాంగ్ జంప్ లో తెలంగాణ అథ్లెట్ నందిని స్వర్ణం ఖాతాలో వేసుకుంది. నార్సింగ్ లోని సాంఘిక సంక్షేమ వసతి పాతశాలకు చెందిన తను కొన్నేళ్ళుగా అథ్లెటిక్స్ లో ఉత్తమంగా రాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మాయి లక్ష్మి 5.38కిమీ లో రజతం సొంతం చేసుకుంది. అండర్ -16బాలుర షాట్ పట్ లో తెలంగాణ కు చెందిన మహమ్మద్ మోసిన్ ఖురేషి కంచు పథకం గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల లో స్వర్ణం సాధించిన తెలంగాణ అథ్లెట్ నందిని
ఎవరు: తెలంగాణ అథ్లెట్ నందిని
ఎప్పుడు : ఫిబ్రవరి 06
అమెరికా విదేశాంగ మంత్రి జార్జి శూల్జ్ కన్నుమూత :

అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జార్జిశూల్జ్ ఫిబ్రవరి 7న కన్నుమూసారు. ఆయన వయసు 100 సంవత్సరాలు. స్టాన్ పర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. రీగన్ అధ్యక్షునిగా ఉన్నపుదు అయన విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసి రష్యా దేశం తో సంబందాలు పెరుగులకు ఆయన ఎంతంగానో కృషి చేసారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జార్జి శూల్జ్ కన్నుమూత
ఎవరు: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జార్జి శూల్జ్
ఎప్పుడు : ఫిబ్రవరి 06
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |