
Daily Current Affairs in Telugu 23-12-2020
ఒకే క్లబ్ తరపున అధిక గోల్స్ చేసిన పుట్ బాలర్ గా ఘనత సాధించిన లయోనేల్ మెస్సి :

పుట్ బాల్ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు ను బార్సిలోనా స్టార్ ప్లేయర్ అర్జెంటినా జట్టు కెప్టెన్ లయోనేల్ మెస్సి రికార్డ్ బద్దలు కొట్టాడు. ఒకే క్లబ్ జట్టు తరుపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ గా 33 ఏళ్ల మెస్సి గుర్తింపు పొందారు. ఇప్పటిదాకా 643 గోల్స్ తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న ఈ రికార్డులను గత డిసెంబర్ 20న మెస్సి సమం చేసాడు. పీలే 1957 నుంచి 1974 వరకు బ్రెజిల్ లోని సాంబోస్ క్లబ్ తరపున ఆడిన పీలే 643 గోల్స్ సాధించారు. డిసెంబర్ 22న జరిగిన స్పానిష్ లీగ్ లో రియల్ వాలాడో లిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బార్సిలోనా జట్టు 3-0 తో గెలిచింది. ఆట 65 వ నిమిషం లో మెస్సి గోల్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ పుట్ బాల్ లో మెస్సి 2004 నుంచి బార్సిలోన క్లబ్ కు ప్రాతినిద్యం వహిస్తున్నారు. పీలే 643 గోల్స్ ను 757 మ్యాచ్ లో చేయగా మెస్సి 644 గోల్స్ తో749 మ్యాచ్ సాదించాడు. ఈ జాబితాలో గెర్డ్ ముల్లర్( బాయేర్న్ మ్యునిక్ 564గోల్స్) మూడో స్థానం లో పెర్నాండో పెరోటియ (స్పోర్టింగ్ లిస్బన్ 544 గోల్స్ ) నాలుగో స్థానం లో జోసెప్ జోసెప్ బికాన్ (స్లావియ ప్రాగ్ 534గోల్స్ ) తో ఐదో స్థానం లో ఉన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఒకే క్లబ్ తరపున అధిక గోల్స్ చేసిన పుట్ బాలర్ గా ఘనత సాధించిన లయోనేల్ మెస్సి
ఎవరు: లయోనేల్ మెస్సి
ఎప్పుడు: డిసెంబర్ 23
ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చోటు దక్కించుకున్న ప్రజ్ఞాన్ ఓజా :

క్రికెట్ సలహాదారుడు కమిటీ (సిఏసి) సహా పలు ప్రదాన సబ్ కమిటీ లను ఏజిఎం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బిసిసిఐ ఉపాద్యక్షునిగా రాజీవ్ శుక్లా ఎంపిక కు ముగ్గురు సభ్యుల ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు కూడా ఆమోద ముద్ర వేస్తారు. ఇందులో బ్రిజేష్ పటేల్ ,ఖైరుల్ మజుందార్ మరో ఏడాది కొనసాగనుండగా భారత క్రికెటర్ల సంఘం (ఐసిఏ) తరపున హైదరాబాద్ కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కు అవకాశం దక్కింది. సురీందర్ ఖన్నా స్థానంలో ఓజా పేరును ఐసిఏ కు ఐసిఏ ప్రతిపదించింది. భారత్ తరపున 24టెస్టులు ,18 వన్డేలు ,6టి20 లు ఆడిన ఓజా ఏడేళ్ళ క్రితం చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిత్యం వహించాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చోటు దక్కించుకున్న ప్రజ్ఞాన్ ఓజా
ఎవరు: ప్రజ్ఞాన్ ఓజా
ఎప్పుడు: డిసెంబర్ 23
తెలుగు భాషకు అధికార భాష హోదా ప్రకటించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రము :

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో డిసెంబర్ 23 ణ సమవేశం అయిన రాష్ట్ర మంత్రి మండలి తెలుగు భాషకు అధికార భాష హోదాను కల్పించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే తెలుగు ప్రజలను భాషాపరమైన మైనార్టీలు గా గుర్తించే ప్రతిపాదనను కూడా కేబినేట్ ఆమోదించింది. కాగా తెలుగు భాషను అధికార భాషగా గుర్తించాలని గత కొన్నేళ్ళ నుంచి తెలుగు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపద్యం లో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బెంగాల్ రాష్ట్రంలో 10వరకు అధికార బాషలు ఉన్నాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: తెలుగు భాషకు అధికార భాష హోదా ప్రకటించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర౦
ఎవరు: పశ్చిమ బెంగాల్
ఎక్కడ: పశ్చిమ బెంగాల్
ఎప్పుడు: డిసెంబర్ 23
జాతీయ గణిత దినోత్సవం గా డిసెంబర్ 22 :

డిసెంబర్ 22ను ప్రతిసంవత్సరం జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకుంటారు. గణిత శాస్త్రం లో పితామహునిగా పిలువబడే శ్రీనివాస రామానుజన్ 1887 లో ఈ రోజున ఆయన జన్మించాడు. ఆయన యొక్క పుట్టిన రోజు సందర్బంగా మరియు ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజును జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకుంటారు 2012 లో నుంచి అప్పటి ప్రదాన మంత్రి మన్మోహన్ సింగ్ డిసెంబర్ 22 ను జాతీయ గణిత దినోత్సవం గా ప్రకటించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: జాతీయ గణిత దినోత్సవం గా డిసెంబర్ 22
ఎప్పుడు: డిసెంబర్ 22
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |