
Daily Current Affairs in Telugu 19-02-2021
టైగర్ ఎక్స్ 1 అనే రోబోటిక్ కార్ ను ప్రవేశపెట్టిన హ్యుందాయ్ మోటార్ కంపెని :

హ్యుందాయ్ మోటార్ కార్ కంపెని టైగర్ ఎక్స్ –1 అనే నూతన పిలువబడే ట్రాన్స్ ఫరెన్స్ లాంటి రోబోటిక్ కార్ ను ఇటీవల విడుదల చేసింది. ఇది భూమిపై నే కాకుండా ఇతర గ్రహలపైన కూడా అత్యంత వేగంగా వాలుగా ఉండే ప్రదేశాలు కలిగి ఉన్న దానిలో కూడా ప్రయానిస్తుంది. ఇందులో టైగర్ అంటే ఇంటలిజెన్స్ గ్రౌండ్ విహార యాత్ర రోబోట్ ను మార్చడం మరియు x-1 దాని యొక్క ప్రయోగాత్మక స్థితి ని తెలియజేస్తుంది.
- హ్యుందాయ్ మోటార్ కంపెని ప్రధాన కార్యాలయం –సియోల్
- దేశం- దక్షిణ కొరియా
క్విక్ రివ్యు:
ఏమిటి : టైగర్ ఎక్స్ 1 అనే రోబోటిక్ కార్ ను ప్రవేశపెట్టిన హ్యుందాయ్ మోటార్ కంపెని
ఎవరు; హ్యుందాయ్ మోటార్ కంపెని
ఎక్కడ: సియోల్
ఎప్పుడు : ఫిబ్రవరి 19
అంగారక గ్రాహం పైకి పర్సోవార్ అనే రోవర్ విజయవంతంగా పంపిన నాసా :

విశ్వాన్వేశణలో అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ (నాసా) సరికొత్త అద్యయనానికి శ్రీకారం చుట్టింది. అంగారక గ్రహం మార్స్ పై అత్యంత అధునాతన మైన తెలివైన రోవర్ ను పర్సోవార్ ను విజయవంత౦ గా దించింది. అరుణ గ్రహం పై గతంలో జీవం ఉండేదా అన్న కీలక ప్రశ్నకు ఇది సమాదానం కనుగొనే ప్రయత్నం. భవిష్యత్ లో అక్కడికి మానవులను పంపేందుకు అవసరమైన కీలక పరిజ్ఞానం ఇది పరీక్షిస్తుంది. అంగారకుడి పై ఉపరితల వాతావరణ పరిశీలన లు సాగిస్తుంది.ఈ అద్భుత విజయాన్ని సాధించిన నాసా ను అమెరికా అద్యక్షుడు జో బైడెన్ గారు ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ అబినంధించారు. మార్చ్ 2020 ప్రాజెక్ట్ లో బాగంగా గత ఏడాది జులై 30న ఫ్లోరిడా లో ని కేప్ కేనావేరాల్ నుంచి పర్సోవార్ ను నాసా ప్రయోగించింది. విశ్వం లో ఇది 203 రోజులు పాటు 47.2 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఫిబ్రవరి 19 తెల్లవారు జామున 2.25 గంటలకు అంగారక వాతావరణం లో ప్రవేశించింది.
- కాగా అంగారకుడి పై కి నాసా ప్రయోగాల్లో పర్సేవరెన్స్ తొమ్మిదో వది.
- వాటిలో ఇదే అతిపెద్ద అత్యంత అధునాతన వాహనం.కారు సైజులో ఉన్న ఈ రోవర్ ప్లూటోనియం శక్తితో నడుస్తుంది.
- ఆరు చక్రాలతో కూడిన ఈ వాహనం బరువు 1026 కిలోలు.
క్విక్ రివ్యు:
ఏమిటి : అంగారక గ్రాహం పైకి పర్సోవార్ అనే రోవర్ విజయవంతంగా పంపిన నాసా
ఎవరు; నాసా
ఎక్కడ: అమేరికా
ఎప్పుడు : ఫిబ్రవరి 19
డబ్ల్యుటిఏ టైటిల్ ను గెలుచుకున్న భారత టెన్నిస్ స్టార్ అంకిత :

భారత టెన్నిస్ స్టార్ అంకిత రైనా సత్తా చాటింది.కెరీర్ లో తొలిసారి డబ్ల్యుటిఏ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఫిలిప్ ఐలాండ్ టోర్నీ లో మహిళల డబుల్స్ లో ఆమె విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 19న జరిగిన ఫైనల్లో అంకిత కమిలా రకిమోవా (రష్యా) జోడి 2-6,6-410-7 తో అనా బ్లింకోవా అనస్తాషియా పోటపోవా (రష్యా) ద్వయాన్ని ఓడించింది. ఈ విజయం తో 280 ర్యాంకింగ్ పాయింట్లు కూడా సొంతం చేసుకున్న అంకిత రైనా తొలిసారి డబుల్స్ లో టాప్ -100 లో చోటు సంపాదించనుంది. ప్రస్తుతం 115 ర్యాంకు లో ఉన్న అంకిత తాజా విజయం తో 94 ర్యాంకు కు చేరుకుంది. సానియా మిర్జా తర్వాతి డబుల్స్ లో టాప్ 100 లో చోటు దక్కించుకో బోతున్న ఘనత అంకిత కే దక్కనుంది..
క్విక్ రివ్యు:
ఏమిటి : డబ్ల్యుటిఏ టైటిల్ ను గెలుచుకున్న భారత టెన్నిస్ స్టార్ అంకిత
ఎవరు; భారత టెన్నిస్ స్టార్ అంకిత
ఎప్పుడు : ఫిబ్రవరి 19
పారిస్ ఒప్పందం లోకి మళ్లి తిరిగి చేరిన దేశం అమెరికా :

అగ్ర రాజ్యం అమెరికా పారిస్ వాతావరణ ఒప్పందంలో మళ్లి చేరింది. ట్రంప్ అద్యక్షుడిగా ఉన్న సమయం లో ఈ ఒప్పందం నుంది అమెరికా వైదొలగిన సంగతి తెలిసిందే. నూతన అద్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఇటీవల బాద్యతలు చేపట్టిన రోజే ప్యారిస్ ఒప్పందం లో అమెరికా మళ్లి చేరుతుంది అని ప్రకటించారు. ఎగ్సిక్యుటివ్ ఆర్డర్స్ పై సంతకం కూడా చేసారు.ఈ మేరకు ఫిబ్రవరి 19న ఈ ఒప్పందం లోకి అమెరికా అధికారికంగా తిరిగి చేరింది. భూతాపాన్ని తగ్గించే లక్ష్యం తో ఒకే తాటి పైకి వచ్చిన ప్రపంచ దేశాలు 2015 పారిస్ వాతావరణ ఒప్పందం చేసుకున్నాయి. ఒబామా పదవి కాలం చివర్లో అమెరికా ఇందులో చేరింది. అయితే ట్రంప్ అధికారం లోకి వచ్చిన తరువాత ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం దీని నుంచి వెళ్ళిపోవడం లేదా తిరిగి చేరడానికి వీలుంటుంది. కాగా అమెరికా మెల్లి చేరడం ఎంతో కీలకం అని ఐక్యరాజ్యసమితి సెక్రటరి జనరల్ అంటోనియో గుటేరాస్ పేర్కొన్నారు.
- ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరి జనరల్ – అంటోనియో గుటేరాస్
- ప్రస్తుత ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగ అధిపతి –క్రిస్టియన ఫిగరస్
క్విక్ రివ్యు:
ఏమిటి : పారిస్ ఒప్పందం లోకి మళ్లి తిరిగి చేరిన దేశం అమెరికా
ఎవరు; అమెరికా
ఎక్కడ: : పారిస్ ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం గా ఫిబ్రవరి 20:

నవంబర్ 26, 2007 న, ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 20 ను ప్రపంచ సామాజిక న్యాయం దినంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని ప్రకటించింది. ప్రపంచం సహకారం మరియు ఆవిష్కరణల ద్వారా ముందుకు సాగుతున్నప్పటికీ, సామాజిక అసమానత ఇప్పటికీ కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ సమాన ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక హక్కులు మరియు అవకాశాలకు అర్హులే అనే అభిప్రాయం కలిగి ఉండడమే సామాజిక న్యాయం ఉద్దేశ్యం.సామాజిక న్యాయం సమాజంలోని అనేక అంశాలలో న్యాయంగా మరియు సమానత్వంను ప్రోత్సహిస్తుంది. ఇది సమాన ఆర్థిక, విద్యా మరియు కార్యాలయ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. వ్యక్తులు మరియు సంఘాల భద్రత మరియు భద్రతకు ఇది చాలా ముఖ్యం వ్యక్తులు మరియు సంఘాల భద్రత మరియు భద్రతకు ఇది చాలా ముఖ్యం సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా తమ గొంతెత్తి తెలపడం మరియు లింగ, వయస్సు, జాతి, జాతి, మతం, సంస్కృతి లేదా వైకల్యానికి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంను జరుపుకుంటారు. సామాజిక న్యాయం 2020 ప్రపంచ దినోత్సవం యొక్క ఇతివృత్తం సామాజిక న్యాయం సాధించడానికి అసమానతల అంతరాన్ని మూసివేయడం .
క్విక్ రివ్యు:
ఏమిటి : అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం గా ఫిబ్రవరి 20
ఎప్పుడు : ఫిబ్రవరి 19
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |