Daily Current Affairs in Telugu 05-03-2021
ఉదయ పూర్ సైన్స్ సెంటర్ ను ప్రారంబించిన త్రిపుర రాష్ట్రం :
త్రిపుర రాష్ట్ర గవర్నర్ బైన్ ఉదయ్ పూర్ సైన్స్ సెంటర్ ను ఇటీవల త్రిపుర రాష్ట్రం లోని ఉదయ పూర్ లో ప్రారంబించారు.ఈ కేంద్రాన్ని 6 కోట్ల వ్యయం తో అబివృద్ది చేసారు.దీనికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం మరియు త్రిపుర ప్రభుత్వం సైన్స్ టెక్నాలజీ మరియు పర్యావరణ శాఖ సంయుక్తంగా నిధులు సమకూర్చాయి.నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యుజియం ఇపుడు అన్ని ఈశాన్యం రాష్ట్రం లో సైన్స్ సెంటర్ లను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉదయ పూర్ సైన్స్ సెంటర్ ను ప్రారంబించిన త్రిపుర రాష్ట్రం
ఎవరు : త్రిపుర రాష్ట్రం
ఎప్పుడు : మార్చి 05
అఫ్రాకా చైర్మన్ గా చింతల గోవింద రాజులు నియామకం :
ఆఫ్రికా ఫసిఫిక్ గ్రామిణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ అధ్యక్షనిగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ నాబార్డ్ చైర్మన్ అయిన చింతల గోవింద రాజులు మార్చి 04న బాద్యతలు స్వీకరించారు. AP RA CA అనేది 88 దేశాల సభ్యులలో 24దేశాల తో కూడిన సంస్థ .ఇది ఒక అంతర్జాతీయంగా సంస్థ. ఇది చాలా సమాచార మార్పిడి చేస్తుంది. సామర్ద్యం పెంపో౦ది౦చే కార్యక్రమాలు తీసుకుంటుంది మరియు కొత్త సంస్థలను దీని ద్వారా సృష్టిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అఫ్రాకా చైర్మన్ గా చింతల గోవింద రాజులు నియామకం
ఎవరు : చింతల గోవింద రాజులు
ఎప్పుడు : మార్చి 05
గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ :
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయిన తమిలసై సౌందర రాజన్ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ -2021 పురస్కారానికి ఎంపిక అయ్యారు. సమాజ హితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకు గాను తమిలసై ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డనికే డేవిస్ నేతృత్వంలో మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును ప్రకటించింది.తమిలసై తో పాటు అమెరికా దేశ ఉపాద్యక్షురాలు కమలా హ్యారిస్ ను , వివిధ దేశాలకు చెందిన మరో 18మందికి ఈ గౌరవ పురస్కారం దక్కింది.9వ వార్షిక కంగ్రేషనల్ ఇంటర్ నేషనల్ ఉమెన్స్ డే సందర్బంగా 2021 మర్చి 07 అమెరికా నుంచి వర్చువల్ పద్దతిలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్
ఎవరు : తమిలసై సౌందర రాజన్
ఎప్పుడు : మార్చి 05
2023 ను అంతర్జాతీయ చిరు దాన్యాల సంవత్సరంగా ప్రకటింపు :
2023 వ సంవత్సరానికి ఇంటర్ నేషనల్ మిల్లెత్స్ ఇయర్ (అంతర్జాతీయ చిరు దాన్యాల సంవత్సరంగా)గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. చిరు దాన్యాల తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం మరియు మారుతున్న వాతావరణ పరిస్తితులకు అనుగుణంగా చిరు దాన్యాల సాగునీ ప్రోత్సహించడం వంటివి 2023 ని ఏడాది చేపడతారు. భారత్ నుంచి వచ్చిన తీర్మానం ప్రకారం 2023 అంతర్జాతీయ చిరు దాన్యాల సంవత్సరంగా ఐ.రా.స ప్రకటించింది. కాగా ఇందులో బంగ్లాదేశ్ ,కెన్యా నేపాల్ నైజీరియ రష్యా సెనెగల్ దేశాలతో కలిపి భారత్ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 73 పైగా దేశాలు మద్దతు తెలిపాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2023 ను అంతర్జాతీయ చిరు దాన్యాల సంవత్సరంగా ప్రకటింపు
ఎవరు : ప్రపంచ వ్యాప్తంగా
ఎక్కడ: ఐరాసా
ఎప్పుడు : మార్చి 05
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన 3వ ప్లేయర్ గా నిలిచిన కీరోన్ పొలార్డ్ :
కీరోన్ పొలార్డ్ ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. వెస్టిండీస్ వారి మూడు మ్యాచ్ల టి 20 సిరీస్ యొక్క మొదటి ఆటలో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టి 20 క్రికెట్‌లో ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పొలార్డ్ భారత మాజీ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తరువాత ఈ జాబితా లో చేరాడు మరియు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మూడవ వ్యక్తి, కాగ మొదట ఉన్న వారు హెర్షెల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా) మరియు యువరాజ్ సింగ్ (ఇండియా) . ఆంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ మైదానంలో జరిగిన తొలి టీ 20 లో వెస్టిండీస్ 6 వ ఓవర్లో విజయవంతమైన ఛేజ్‌లో శ్రీలంక అకిలా దనంజయ బౌలింగ్ లో 6 సిక్స్ లుకొట్టి పొలార్డ్ ఈ ఘనతను సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన 3వ ప్లేయర్ గా నిలిచిన కీరోన్ పొలార్డ్
ఎవరు : కీరోన్ పొలార్డ్
ఎక్కడ: ఆంటిగ్వాలోని కూలిడ్జ్
ఎప్పుడు : మార్చి 05
స్టార్‌షిప్ ఎస్ఎన్ 10 ప్రోటోటైప్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షి౦చిన స్పేస్‌ఎక్స్ :
ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ప్రైవేట్ రాకెట్ సంస్థ అయిన స్పేస్‌ఎక్స్ ఇటీవలి రెండు విఫల ప్రయత్నాల తర్వాత ఆ సంస్థ స్టార్‌షిప్ ప్రోటోటైప్ అనే రాకెట్ “ఎస్ఎన్ 10” ను విజయవంతంగా పరీక్షించింది. స్పేస్‌ఎక్స్ 10,000 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ ప్రోటోటైప్‌ను ప్రయోగించగా తిరిగి భూమిపైకి వచ్చింది. అయితే, ల్యాండింగ్ అయిన ఆరు నిమిషాల తరువాత రాకెట్ పేలింది. SN10 అనేది స్పేస్ఎక్స్ యొక్క స్టార్ షిప్ మార్స్ రాకెట్ యొక్క ప్రారంభ నమూనా, ఇది చంద్రుడు, మార్స్ మరియు ఇతర సుదూర గమ్యస్థానాలకు ప్రజలను మరియు పేలోడ్లను చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రాకెట్ ఫాల్కన్ 9 మరియు ఫాల్కన్ హెవీ రాకెట్లు మరియు డ్రాగన్ కార్గో మరియు సిబ్బంది యొక్క గుళికలతో సహా దాని ఇతర విమాన హార్డ్‌వేర్‌లను దశలవారీగా తొలగించే సంస్థ యొక్క వ్యూహంలో ఒక భాగంగ ఉంటుంది..
క్విక్ రివ్యు :
ఏమిటి : స్టార్‌షిప్ ఎస్ఎన్ 10 ప్రోటోటైప్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షి౦చిన స్పేస్‌ఎక్స్
ఎవరు : స్పేస్‌ఎక్స్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు : మార్చి 05
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |