Daily Current Affairs in Telugu 02-03-2021
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ గా జై దీప్ భట్నగర్ నియామకం :
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ గా డైరెక్టర్ గా జైదీప్ భట్నగర్ భాద్యతలు స్వీకరించారు. ఈయన శ్రీ కుల్దీప్ సింగ్ దత్వలియ నుంచి బాద్యతలు స్వీకరించారు. భట్నగర్ 1986 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫీసర్ గా అతను ఇంతకు ముందు దూరదర్శన్ న్యూస్ లో మరియు దూరదర్శన్ యొక్క వాణిజ్య అమ్మకాలు మరియు మార్కెటింగ్ విభాగం లో అధిపతిగా పని చేసారు. అంతేకాకుండా పశ్చిమ ఆసియా లో ఇరవై దేశాలకు చెందిన ప్రసార భారతి స్పెషల్ కరస్పాండెంట్ గా ఆయన పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ గా జైడీప్ భట్నగర్ నియామకం
ఎవరు : జైధీప్ భట్నగర్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : మార్చ్ 02
అమెరికా అద్యక్షుడు బైడెన్ పాలనవిభాగం లో మరో భారతీయునికి దక్కిన చోటు :
అమెరికా అద్యక్షుడు జో బైడెన్ తన పాలన విభాగంలో మరో భారతీయ అమెరికన్ కు కీలక బాద్యతలు అప్పగించారు. స్వయంగా బైడెన్ కు ఉప సహాయకుడిగా శ్వేత సౌద సైనిక కార్యాలయ డైరెక్టర్ గా మజూ వర్గీస్ ను నియమించారు. వృత్తి రిత్యా న్యాయ వాది అయిన వర్గీస్ గత ఏడాది బైడెన్ మరయు హ్యారిస్ ఎన్నికల ప్రచారం లో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా సీనియర్ సలహాదారునిగా సేవలు అందించారు. ఇపుడు మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్ గా తనను నియమించినట్టు వర్గీస్ సామజిక మాద్యమం లో పోస్ట్ చేసారు. కాగా గత అద్యక్షునిగా ఉన్న బరాక్ ఒబామా కు ఆయన సహయక అధికారిగా వర్గీస్ పలు విభాగాలలో కీలక బాద్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా అద్యక్షుడు బైడెన్ పాలనవిభాగం లో మరో భారతీయునికి దక్కిన చోటు
ఎవరు : మజూ వర్గీస్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు : మార్చ్ 02
హురుణ్ గ్లోబల్ఇండియా రిచ్ లిస్టు 2021 లో పది మంది హైదరాబాదీలు :
కరోనా మహమ్మారి సంక్షోబ ఏడాది 2020 లొనూ దేశంలో 40 మంది పైగా బియనీర్ లు జత చేరడంతో భారత కుబేరుల సంఖ్య 177 కు చేరిందని హురుణ్ ఇండియా రిచ్ లిస్టు 2021 వెల్లడించింది .రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగారు. ఈయన సంపద గత ఏడాదిలో 24శాతం పెరిగి 8300 కోట్ల డాలర్ల కు చేరింది. అంతర్జాతీయంగా ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా గౌతమ్ అదాని సంపద కూడా పెరుగుతుందనే ఉంది. 2020 లో అయితే ఏకంగా రెండింతలై 3200 కోట్లు డాలర్లకు చేరింది. అంతర్జ్తియంగా ఆయన 20స్థానాలు ఎగబాకి 48స్థానం లో నిలబడ్డారు. దేశంలో రెండో స్థానం లో నిలిచారు .ఆయన సోదరుడు వినోద్ సంపద కూడా 128శాతం వృద్ది తో 860 కోట్లకు డాలర్లకు చేరింది.2700 కోట్ల డాలర్ల హెచ్ పి ఎల్ శివ నాడార్ భారతీయులల్లో మూడో స్థానానికి నిలిచారు. జెడ్ కాలర్ కు చెందిన జె చౌదరి సంపద 274శాతం పెరిగి 1300కోట్ల డాలర్ల కు చేరింది. మహీంద్రా గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రా గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రా కుటుంబ సంపద 100శాతం అధికమై 240 కోట్ల డాలర్లకు చేరింది. కాగ అతి పిన్న వయసులో భారత కుబేరుల జాబితాలో జేరోదా కు చెందిన నిఖిల్ కామత్ (34) ,ఇంస్టా కార్టా కు చెందిన అపూర్వ మెహతా (34) నిలిచారు. కాగా అంతర్జాతీయంగా చూస్తె గత ఏడాదిలో మొత్తం 414 మంది జత చేరడం తో మొత్తం బిలియనీర్ ల సంఖ్య 32228మందికి చేరింది . 1058మంది తో చైనా దేశం అగ్ర స్థానం లో ఉంది. రెండవ స్థానం లో అమెరికా ఉండగా ప్రపంచ మొత్తం జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ 19700 కోట్ల డాలర్ల తో అగ్రస్థానాన్ని చేరుకున్నారు. అమెజాన్ కు చెందిన జెఫ్ బెజోస్ 18900 కోట్ల డాలర్లతో రెండో స్థానం లో నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : హురుణ్ గ్లోబల్ఇండియా రిచ్ లిస్టు 2021 లో చోటు సాధించిన పది మంది హైదరాబాదీలు:
ఎప్పుడు : మార్చ్ 02
హీరో ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2021 కి ఆథిత్యం ఇవ్వనున్న ఓడిశా రాష్ట్రం :
భారతదేశంలోని టాప్ డివిజన్ ఉమెన్స్ లీగ్ ఐడబ్ల్యుఎల్ ఐదవ ఎడిషన్ ఇది. ప్రారంభ ఎడిషన్ 2016 లో ఒడిశాలోని కటక్‌లో కూడా జరిగింది కాగా 2020-21 సంవత్సరానికి గాను ఇండియన్ వుమెన్స్ లీగ్ కు ఓడిశా రాష్ట్రం ఆథిత్యం ఇవ్వనున్నట్లు అఖిల భారత పుట్ బాల్ సమాఖ్య తెలిపింది. 2022 లో భారత దేశం AFC వుమెన్స్ ఆసియా కప్ కు కూడా ఇది ఆథిత్యం ఇవ్వనుంది. ఆ తర్వాత ఫిఫా అండర్ 17 మహిళా ప్రపంచ కప్ 2022లో జరగనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : హీరో ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2021 కి ఆథిత్యం ఇవ్వనున్న ఓడిశా రాష్ట్రం
ఎవరు : ఓడిశా రాష్ట్రం
ఎక్కడ: ఓడిశా
ఎప్పుడు : మార్చ్ 02
తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించిన జాతీయ రికార్డు :
భారత ఆర్చరి సంఘం ఏఏఐ అద్వర్యం లో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు పి ఎస్పిబి కి ప్రాతినిత్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ కొత్త జాతీయ రికార్డ్ నెలకొల్పింది. మహిళల కాంపౌండ్ విభాగం ర్యాంకింగ్ రౌండ్ లో జ్యోతి సరేఖ 720పాయింట్లకు గాను 710 పాయింట్లు స్కోరు చేసింది. గత ఏడాది 709పాయింట్ల లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును సురేఖ సవరించింది. ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్ లో మొత్తం 2808 పాయింట్లు స్కోరు చేసిన అగ్ర స్థానంలో నిలిచిన సురేఖ వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించిన జాతీయ రికార్డు
ఎవరు : జ్యోతి సురేఖ
ఎక్కడ:హర్యానా
ఎప్పుడు : మార్చ్ 02
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |