Daily Current Affairs in Telugu 01-03-2021
సెంట్రల్ బ్యాంక్ ఎండి గా వెంకటరావు భాద్యతలు స్వీకరణ:
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ముఖ్య కార్యనిర్వహణ అధికారి గా (సియివో ) భాద్యతలను తెలుగు వాడైన మాతంగి వెంకట రావు మర్చి 01 చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన కెనర బ్యాంకు ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా పని చేసారు. పదోన్నతి పైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి సియివో అయ్యారు. మూడేళ్ళ పాటు ఈ పదవిలో ఉంటారు. వెంకట రావు తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుంచి ఏజీ బిఎస్సి పట్టా పుచ్చుకున్నారు. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫిసర్ గా 1988 లో అలహాబాద్ బ్యాంక్ లో చేరారు. ఆ బ్యాంకులో ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా కేనెర బ్యాంకు సిండికేట్ బ్యాంక్ విలీన వ్యవహారాల్లో అయన కీలక పాత్ర పోషించారు
క్విక్ రివ్యు :
ఏమిటి : సెంట్రల్ బ్యాంక్ ఎండి గా వెంకటరావు భాద్యతలు స్వీకరణ
ఎవరు : వెంకటరావు
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: మార్చ్ 01
సిఐఐ -ఏపి చైర్మన్ గా దాట్ల తిరుపతి నియామకం :
భారత ప్రరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం నూతన చైర్మన్ గా దాట్ల తిరుపతి రాజ్ వైస్ చైర్మన్ గా జి.వెంకటేశ్వర్ రావు ఎన్నిక అయ్యారు. 2021-22 సంవత్సరానికి గాను వీరు ఈ పదవుల్లో ఉంటారు. తిరుపతి రాజు విజయనగరంలో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా ఉండగా వెంకటేశ్వర్ కే.సిసి షుగర్ అండ్ ఇందస్త్రేస్ కార్పోరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు..
క్విక్ రివ్యు :
ఏమిటి : సిఐఐ -ఏపి చైర్మన్ గా దాట్ల తిరుపతి నియామకం
ఎవరు : దాట్ల తిరుపతి
ఎప్పుడు: మార్చ్ 01
దేశంలోనే తొలి సారి టాయ్ వార్ ఫేర్ 2021 ను ప్రారంబించిన నరేంద్ర మోడి :
దేశంలోనే మొదటి సారిగా నిర్వహించే టాయ్ ఫెయిర్ 2021 ను ప్రదాని నరేంద్ర మోడి గారు ఫిబ్రవరి 27న ప్రారంబం చేసారు. వర్చువల్ విధానం లో మార్చి 2వరకు జరగనున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా ఎగ్సిబిటార్ లు పాల్గొనబోతున్నారు. ఈ టాయ్ వార్ ఫేర్ ను ప్రఖ్యాత టాయ్ సంస్థ అయిన హమ్లి టైటిల్ స్పాన్సర్ గా ఉంది.టాయ్ వార్ ఫేర్ లో ప్రదాని నరేంద్ర మోడి గారు మాట్లాడుతూ బొమ్మల రంగం లో అత్మనిర్భార్ భారత్ స్వయం సమృద్ది ని సాదించాలని పిలిపునిచ్చారు. భారత్ లోని బొమ్మాల్లో 85శాతం బొమ్మలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే తొలి సారి టాయ్ వార్ ఫేర్ 2021 ను ప్రారంబించిన నరేంద్ర మోడి
ఎవరు : నరేంద్ర మోడి
ఎప్పుడు: మార్చ్ 01
ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీ లో స్వర్ణ పథకం గెలుచుకున్న భారత క్రీడాకారిణి వినేష్ ఫోగాట్:
ఇటీవల జరిగిన ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీ లో అండ్ కోచేస్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్న మెంట్ లో భారత క్రీడాకారిణి అయిన వినేష్ ఫోగాట్ స్వర్ణ పథకం గెలుచుకుంది. రాజదాని కీవ్ లో ఫిబ్రవరి 26న జరిగిన 53కేజీల విభాగం ఫైనల్లో వినేష్ ఫోగాట్ ప్రస్తుత యురోపియన్ చాంపియన్ అయిన ,2017వరల్డ్ చాంపియన్ వనేస్సా కలాద్ జీన్ స్కాయ్ (బెలారస్ ) ను బై పాల్ పద్దతిలో ఓడించి చాంపియన్ గా అవతరించింది. కాగ ప్రస్తుతం ఆమె పై విజయం సాధించి స్వర్ణ పతకం ను వినేష్ పోగాట్ సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీ లో స్వర్ణ పథకం గెలుచుకున్న భారత క్రీడాకారిణి వినేష్ ఫోగాట్
ఎవరు : భారత క్రీడాకారిణి వినేష్ ఫోగాట్
ఎక్కడ: ఉక్రెయిన్
ఎప్పుడు: మార్చ్ 01
ఫ్రాన్స్ దేశ మాజీ అద్యక్షుడు అయిన సర్కోజి కి జైలు శిక్ష :
ఇటీవల ఫ్రాన్స్ దేశంలో అవినీతికి పాల్పడినట్టు ఋజువు కావడంతో ఫ్రాన్స్ మాజీ అద్యక్షుడు నికోలస్ సర్కోజి కి పారిస్ లోని ఒక న్యాయస్థానం మూడేళ్ళ పాటూ జైలు శిక్ష ను విధించింది. 2007నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అద్యక్షుడిగా పని చేసిన సర్కోజి 2014 లో ఒక కేసుకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించేందుకు సీనియర్ మేజిస్ట్రేట్ కు లంచం ఇవ్వజూపాడు. అన్న ఆరోపణలతో ఎదుర్కొంటున్నారు.. సాక్ష్యాదారాల ఆదారంగా న్యాయ స్థానం ఒక ఏడాది జైలు శిక్ష రెండేళ్ళ పటు ప్రోబెషనారి శిక్ష విదిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే సర్కోజి ఈ శిక్షకాలన్ని తన నివాసం నుంచే పూర్తి చేసే అవకాశం ఉంది. కాగా జాక్ షిరాక్ తర్వాత జైలు శిక్ష పడిన రెండో అద్యక్షుడు సర్కోజి అవనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫ్రాన్స్ దేశ మాజీ అద్యక్షుడు అయిన సర్కోజి పైన జైలు శిక్ష
ఎవరు : నికోలస్ సర్కోజి
ఎక్కడ: : ఫ్రాన్స్ దేశ౦
ఎప్పుడు: మార్చ్ 01
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |