Daily Current Affairs in Telugu 29-01-2020
సింగరేణి సిఎండి శ్రీదర్ కి “ది లీడర్” అవార్డు:
సింగరేణి ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆ సంస్థ సిఎండి ఎన్.శ్రీదర్ కు మరో అంతర్జాతీయ అవార్డు లబించింది.థాయ్ ల్యాండ్ కేంద్రంగా నడుస్తున్న ఏషియా వన్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూప్ 2019-20 సంవత్సరానికి గాను వాణిజ్య వ్యాపార పరిశ్రమల విభాగంలో అత్యంత ప్రతిభా వంతులకు ఇచ్చే భారతియ మహంతం వికాస్ పురస్కార్ కు ఆయన్న ఎంపిక చేసింది.సింగరేణి అభివృద్ధి చేస్తూ వృద్ది రేటుతో నడిపిస్తున్నందున “ది లీడర్” పేరిట ఆ సంస్థ శ్రీదర్కు అవార్డు ను బహుకరించింద్.బ్యాంకాక్ లో వచ్చే ఫిబ్రవరీ 07న జరిగే ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.6న జరిగే థాయ్లాండ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏషియా వన్ సంయుక్త నిర్వహణలో జరిగే ఇండియా ,థాయ్ ల్యాండ్ ద్వైపాక్షిక చర్చల్లో ను శ్రీదర్ పాల్గొంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సింగరేణి సిఎండి శ్రీదర్ కి ది లీడర్ అవార్డు
ఎవరు: సిఎండి శ్రీదర్
ఎక్కడ:తెలంగాణ
ఎప్పుడు:జనవరి29
ఇంటర్నేషనల్ క్రికెట్ కు సోతాఫ్రికా క్రికెటర్ వేర్నోన్ ఫిలాండర్ వీడ్కోలు :
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గా ప్రాతినిత్యం వహించిన వేర్నోన్ ఫిలాందర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించాడు.దక్షిణాఫ్రికా లో ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టు ముగిసిన తరువాత జనవరి 24 న అతడు క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు చెప్పాడు.ఫిలండర్ దక్షిణాఫ్రికా తరపున 64టెస్టులు ,30వన్డేలు ,7 టి 20లు ఆడాడు,టెస్టుల్లో 224 వికెట్లు ,వన్డేల్లో 41 ,పోట్టి ఫార్మాట్లలో నాలుగు వికెట్లు తీశాడు.డెయిల్ స్టెయిన్ ,మొర్నీ మోర్కెల్ తో పాటు దక్షిణాఫ్రికా ఫేస్ బౌలింగ్ విభాగంలో కీలక బౌలర్గా సేవలందించిన పిలాందర్ తన తొలి ఏడు టెస్టుల్లోనే 51వికెట్లు తీసి సత్తా చాటాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఫిలాందర్ వీడ్కోలు
ఎవరు: ఫిలాందర్
ఎక్కడ:సోతఫ్రికా
ఎప్పుడు:జనవరి 29
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఇస్రో భువన పంచాయత్ అనే నూతన వెబ్ సైట్ ప్రారంబం :
గ్రామ పంచాయతి అబివృద్ది కోసం భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) రూపొందించిన “భూవన్ పంచయత్ జియో -3.0” అనే నూతన వెబ్ సైట్ ప్రారంబమయింది.బెంగళూర్ లోని ఇస్రో కార్యాలయంలో పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇస్రో అద్యక్షుడు డా.శివన్ జనవరి 28న ఈ వెబ్ సైట్ ను ప్రారంబించారు.ఈ సందర్బంగా మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ భువన పంచాయత్ ద్వారా భూగర్బ జలాలు విద్య మరియు సామాజిక ,వైద్య ,బౌగోళిక అంశాలపై అందించే సమాచారం గ్రామ పంచాయితి ల అభివృద్దికి దోహద పడుతుంది అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇస్రో భువన పంచాయత్ అనే నూతన వెబ్ సైట్ ప్రారంబం
ఎవరు:భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో)
ఎక్కడ:బెంగళూర్
ఎప్పుడు:జనవరి 29
మాతృ వందన సప్త్ పథకం అమలులో ఆంద్ర ప్రదేశ్ కు మొదటి స్థానం :
ప్రదాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవై) పథకం అమలులో భాగంగా 2019 డిసెంబర్ 02 నుంఛి డిసెంబర్ 08 వరకు నిర్వహించిన మాతృ వందన సప్త్ లో ఆంద్ర ప్రదేశ్ కు మొదటి ర్యాంకు దక్కింది.అలాగే పీఎంఎంవై ప్రారంబమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశావ్యాప్తంగా 2వ స్థానం ను ఆంద్ర ప్రదేశ్ దక్కించు కుంది.దీనితో పాటు దేశ వ్యాప్తంగా జిల్లాల వారి ప్రతిభలో కర్నూల్ జిల్లా కు 02 వ స్థానం దక్కింది.కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ జనవరి 28న ప్రకటించిన పీఎంఎంపీవై ర్యాంకుల్లో ఈ విషయం ప్రకటించింది.గ్రామిన ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్తూ సక్రమంగా వైద్య పరీక్షలకు రాని గర్బినులను ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా పఎం ఎంపీ వై పథకం ను ప్రవేశ పెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాతృ వందన సప్త్ పథకం అమలులో ఆంద్ర ప్రదేశ్ కు మొదటి స్థానం
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు:జనవరి 29
మలేరియా పోరుకు కొత్త టీకా రూపకల్పన :
మకలేరియా నుంచి రక్షణ కల్పించే రెండో తరం టీకాను అమెరికా శాస్త్రవేతలు రూపొందించారు.ఈ బృందానికి భారత సంతతి శాస్త్ర వేత్తలు శెట్టి దత్తా నాయకత్వం వహించారు.మొదటితరం మలేరియా టీకాను ఆర్టిఎస్ఎస్ “(మస్క్యురిక్స్ )ను ఇప్పటకే తయారు చేశారు.పరాన్న జీవిలో ని సర్కం స్పోరోజేయింట్ ప్రోటీన్ (సిపిఎస్)ను లక్ష్యంగా చేసుకుని ఇది పని చేస్తుంది.ప్రయోగాల్లో ఈ టికా సమర్థంగా రక్షణ కల్పించినప్ప్పటికి వాస్తవంగా ఇన్ఫెక్షన్ సోకినపుడు మాత్రం దీని సమర్థత ,రక్షణ కల్పించే కాలం ఇంకా పెరగాల్సిన ఆవాసం ఉంది ఈ నేపద్యంలో రెండో రకం టీకాను తయారు చేసేందుకు దత్త బృందం టొబాకో మొజాయిక్ వైరస్ (టీఎంవీ ) లోని చక్రం , ఆకారంలో ఉన్న రేణువులను ఉపయోగించింది.సిఎస్ పీ లోని అత్యంత బలహీనమైన ఎఫితోప్ లను లక్ష్యంగా చేస్కునేలా రోగ నిరోధక వ్యవస్థ ఈ టీకా ని తీర్చి దిద్డ్డింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలేరియా పోరుకు కొత్త టీకా రూపకల్పన
ఎవరు: అమెరికా శాస్త్రవేతలు
ఎక్కడ: అమెరికా(వాషిగ్టన్)
ఎప్పుడు:జనవరి 29