
Daily Current Affairs in Telugu -24-12-2019

రోహతంగ్ కు వాజ్ పేయి పేరు :
హిమాచల్ ప్రదేశ్ లోని అత్యంత వ్యూహాత్మక సోరంగా మార్గంగా పరిగణించే రోహతంగ్ కు ప్రబుత్వం దివంగత మాజీ ప్రదాని పేరు పెట్టనుంది. డిసెంబర్25న ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాజ్ పేయి ప్రదనిగా ఉన్నపుడు 2000 సంవత్సరంలో జూన్ మూడో తేదీన రోహతంగ్ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: రోహతంగ్ కు వాజ్ పేయి పేరు
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 24
మిగ్ -27కు వీడ్కోలు పలకనున్న ఐఎఎఫ్:

భారత వైమానిక దళంలో (ఐఎఎఫ్) ని శక్తివంతమైన మిగ్ -27 యుద్ద విమానం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. 1999 నాటి కార్గిల్ యుద్దంలోతన సత్తాను చాటిన ఈ లోహ విహన్గాలకు వాయుసేన్న ,డిసెంబర్ 26న వీడ్కోలు పలకనుంది.ఆ రోజున జోద్ పూర్ వైమానిక స్తావరం నుంచి ఏడ మిగ్-27లు చివరిసారిగా గగన విహారం చేస్తాయి.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ద విమానాల ప్రస్థానానికి ముగింపు పడుతుంది .ప్రస్తుతం ఎ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు.భారత వైమానిక దళంలో దీన్ని “బహదూర్” గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: మిగ్ -27కు వీడ్కోలు పలకనున్న ఐఎఎఫ్
ఎక్కడ: జోద్ పూర్
ఎప్పుడు: డిసెంబర్ 24
జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్లో మనుబాకర్,అనీష్ బన్వల కు స్వర్ణం :

జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ లో కామన్ వెల్త్ చాంపియన్లు మను బాకర్ ,అనీష్ బల్వాల్ సత్తా చాటారు. హరియాణకు ప్రాతినిత్యం వహిస్తున్న 17ఏళ్ళు మను సీనియర్ ,జూనియర్ విబగాల్లో నాలుగు స్వర్ణ పతకాలు సొంతంచేసుకుంది.డిసెంబర్ 24న జరిగిన 10మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ సీనియర్ విభాగం పైనల్లో మను (243)అగ్రస్థానంలో నిలిచింది. టీం విభాగంలో పసిడి గెలిచిన ఆమె జునియర్ కేటగిరిలో వ్యక్తిగత టీం విబాగాల్లో స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.హరియాణకు చెందిన 17 ఎల్ల అనీష్ కూడా సీనియర్ ,జూనియర్ విబగాల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గాడు.సీనియర్ 25 మీటర్ల ర్యాపిడ్ వ్యక్తిగత విబాగాల్లో పసిడి గెలిచిన అనీష్ జూనియర్ విబాగాల్లో ను అగ్రస్థానం లో నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్లో మనుబాకర్,అనీష్ బన్వల కు స్వర్ణం
ఎక్కడ: భోపాల్
ఎవరు : మనుబాకర్,అనీష్ బన్వల్
ఎప్పుడు: డిసెంబర్ 24
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్లో విరాట్ కోహ్లికి నంబర్ వన్ ర్యాంకు :

టీం ఇండియా కెప్టెన్ విర్రాట్ కోహ్లి నంబెర్ వన్ టెస్ట్ బ్యాట్స్ మన్ గా ఈ ఏడాది ని ముగిస్తున్నాడు.తాజా ర్యాంకింగ్ లో 928 పాయింట్ల లో అతడు అగ్రస్థానంను నిలబెట్టుకున్నాడు.రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మత్ (911) కంటే అతడు 17 పాయింట్లతో అత్యధిక తో ఉన్నాడు.కెన్ విలియమ్సన్ (864) మూడో స్థానంలో ఉన్నాడు.పూజార నాలుగో స్థానాన్నినిలబెట్టుకోగా,రహనే ఓ ర్యాంకు ను కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు.రోహిత్ శర్మ 15వ స్థానంలో ఉన్నాడు.బౌలర్ల ర్యాంకింగ్ లో బుమ్ర ఆరో స్థానాన్నినిలబెట్టుకున్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భారత్ 360 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఆస్ట్రేలియా (216 )రెండో స్థానంలో,పాకిస్తాన్ (80) మూడో స్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్లో విరాట్ కోహ్లికి నంబర్ వన్ ర్యాంకు :
ఎక్కడ:దుబాయ్
ఎవరు : విరాట్ కోహ్లి
ఎప్పుడు:డిసెంబర్ 24
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
భారత్ లో ఆర్ధిక మందగమనం :ఐఎంఎఫ్

భారత్లో ఆర్ధిక మండగామన పరిస్థితులు తీవంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అబిప్రాయపడింది. దీర్గ కాల ఈ ధోరణికి అరికట్టడానికి ప్రబుత్వం తక్షణ విదానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.ఈ మేరకు భారత్ ఆర్ధిక రంగానికి సంబంధించి ఐఎంఎఫ్ ఒక నివేదికను రూపొందింది. ఈ నివేదికలో అంశాలను ఐఎంఎఫ్ ఆసియా ,పసిఫిక్ శాఖలో భారత్ వ్యహారాల చెఫ్ రానిల్ సల్గాడో డిసెంబర్ 24న వెల్లడించారు
క్విక్ రివ్యూ :
ఏమిటి: భారత్లో ఆర్ధిక మందగమనం :ఐఎంఎఫ్
ఎక్కడ: భారత్
ఎవరు : ఐఎంఎఫ్
ఎప్పుడు:డిసెంబర్ 24
.ఐబిసి చట్ట సవరణలు కేబినేట్ ఆమోదం :

దివాలా పరిష్కార ప్రక్రియ సాపీగా సాగేందుకు వీలుగా కేంద్ర ప్రబుత్వ దివాలా అండ్ బ్యాంక్రప్తసి (ఐబిసి) లో సవరణలను తీసుకొచ్చింది.ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కేంద్ర కేబినేట్ డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది. తాజా సవరణలతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్ర్రరంబానికి ముందుగా కార్పోరేట్ రుణగ్రస్తులు ఏవైనా నేరాలకు పాల్పడి ఉంటె ఆయా కంపెంలకు కొనుగోలు చేసి నూతన ప్రమోటర్లపై అందుకు సంబంధించి ఎటువంటి బాద్యత ఉండదు. అలగీ కార్పోరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను అడ్జుదికేటింగ్ అథారిటీ ఆమోదం తెలిపిన తేది తర్వాత కార్పోరేట్ రుణగ్రస్తులను విచారించడానికి లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఐబిసి చట్ట సవరణలు కేబినేట్ ఆమోదం
ఎవరు :కేంద్ర కేబినేట్
ఎప్పుడు:డిసెంబర్ 24
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |