
Daily Current Affairs in Telugu -06-12-2019
సైబర్ మిత్ర కు కేంద్ర ప్రబుత్వ అవార్డ్ :

ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం తీసుకొచ్చిన సైబర్ మిత్ర కార్యక్రమం కేంద్ర ప్రబుత్వ అవార్డును గెలుచుకుంది. కేంద్ర ఐటి శాఖ ఆద్వర్యంలోని డేట సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డ్ -2019 దక్కించుకుంది. డిసెంబర్ 06 న డిల్లి లో జరిగిన కార్యక్రమంలో డిఐజి (సాంకేతిక సేవలు ) పాలరాజు ఈ అవార్డును అందుకున్నారు. మహిళలు ,విద్యార్థినులు ను సైబర్ నేరాల నుంచి రక్షించేదుకు ఎపి పోలీస్ విభాగం సైబర్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంబించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సైబర్ మిత్ర కు కేంద్ర ప్రబుత్వ అవార్డ్
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 06
దక్షిణాసియ క్రీడల్లో భారత ఆటగాళ్ళు సిరిల్,ఇషా లకు స్వర్ణాలు:

దక్షిణాసియ క్రీడల్లో భారత అథ్లెట్ల ఆధిపత్యం కొనసాగుతుంది. ఐదో రోజు బ్యాడ్మింటన్లో ఎనిమిది పతకాలు దక్కాయి.తెలుగు షట్లర్ సిరిల్ వర్మ పురుషుల సింగల్స్ స్వర్ణం గెలిచాడు.పైనల్లో అతను17-21,23-21,21-13 తేడాతో మనదేశానికి చెందిన ఆర్యమన్ పై గెలిచాడు. మహిళల సింగల్స్ లో ఆశ్మిత 21-18,25-23 తో గాయత్రి గోపీచంద్ పై ఎగేలిచి స్వర్ణం గెలిచింది. పురుషుల డబుల్స్ లో ద్రువ్ –కృశన ప్రసాద్ ,మిక్సడ్డబుల్స్ లలో ద్రువ్ –మేఘ జోడిలు బంగారు పతకాలు నేగ్గారు. షూటింగ్ మహిళల 10మీ టీం విభాగంలో ఇషా సింగ్ ,నివేత ,అన్నురాజ్ తో కూడిన జట్టు పసిడి గెలుచుకుంది. టిటి పురుషుల,మహిళల సింగిల్స్ లో తొలి రెండు స్థానాల్లో మనవాళ్ళే నిలిచారు.పురుషుల షాట్ పుట్ లో తేజేందర్ క్రీడల రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణం నెగ్గాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షిణాసియ క్రీడల్లో భారత ఆటగాళ్ళు సిరిల్,ఇషా లకు స్వర్ణాలు
ఎక్కడ: ఖాట్మండు
ఎవరు:సిరిల్ వర్మ,ఇషా సింగ్
ఎప్పుడు:డిసెంబర్ 06
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టీమిండియా మాజీ కెప్టన్ అజహరుద్దీన్ పేరిట స్టాండ్ ఏర్పాటు :

టీమిండియ మాజీ కెప్టెన్ ,హైదాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సిఎ) అద్యక్షుడు మహమ్మాద్ అజహరుద్దీన్ ను హెచ్ సిఎ గౌరవించింది. ఉప్పల్ స్టేడియం లోని నార్త్ పెవిలియన్ స్టాండును అజహార్ అని పేరు పెట్టింది. డిసెంబర్ 06 న జరిగిన టీమిండియ,వెస్టిండీస్ జట్ల మద్య మ్యాచ్ కు ముందు అజ్జు స్టాండును ఆవిష్కరిచారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నుంచి ప్రాతినిత్యం వహించిన ఆటగాళ్లకు అజహర్ సన్మానించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: టీమిండియ మాజీ కెప్టన్ అజహరుద్దీన్ పేరిట స్టాండ్ ఏర్పాటు
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: అజహరుద్దీన్
ఎప్పుడు: డిసెంబర్ 06
ఎన్.ఎస్.ఈ చైర్మన్ గా గిరీష్ చంద్ర చతుర్వేది :

అగ్రగామి స్టాక్ ఎక్స్చేజ్ ఎస్.ఎస్.ఈ కొత్త చైర్మన్ గా గిరీష్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి ఆమోదం తెలపడంతో ఈ నియామకం అమల్లోకి వచ్చింది.జనవరిలో ఎస్.ఎస్.ఈ. చైర్మన్ గా అశోక్ చావ్లా రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాలీగానే ఉంది మాజీ ఐ.ఏ.ఎస్. అధకారి అయిన గిరీష్ చంద్ర చతుర్వేది పెట్రోలియం,సహజవాయువు శాఖ కార్యదర్శిగా సైతం పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎంఎస్ఈ చైర్మన్ గా గిరీష్ చంద్ర చతుర్వేది
ఎక్కడ: డిల్లి
ఎవరు: గిరేష్ చంద్ర చతుర్వేది
ఎప్పుడు: డిసెంబర్ 06
జాతీయ స్థాయిలో వీఐటి కి రెండు అవార్డులు :

అఖిల భారత స్థాయిలో విద్యాసంస్థ లలో పరిశుబ్రత ,స్వచ్చతకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఏటా పురస్కారం అందజేస్తుంది.దీనిలో భాగంగా ఈ ఏడాది స్వచ్చత అవార్డుతో పాటు పరిశుబ్రమైన ప్రాంగణం -2019 పురస్కారం వేలూర్ విఐటికి సంబంధించిన అవార్డులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి ప్రదాన కార్యక్రమలో సంబంధించిన అవార్డులను కేంద్ర మానవ వనరుల అబివృద్ది శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం ,విశ్వవిద్యాలయం నిధుల కమిటీ చైర్మన్ డీపి సింగ్ తదితరుల నుంచి వీఐటి ఉపకులపతి శంకర్ విశ్వనాథన్ అందుకున్నట్లు వర్శిటీ వర్గాలు డిసెంబర్ 06న ఒక ప్రకటనలో తెలిపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ స్థాయిలో వీఐటి కి రెండు అవార్డులు
ఎక్కడ: వేలూర్
ఎప్పుడు: డిసెంబర్ 06
శ్రీలంక జట్టు హెడ్ కోచ్ గా మైక్ఆర్థర్ నియామకం:

శ్రీలంక జట్టు హెడ్ కోచ్ దక్షిణాప్రికా కు చెందిన మైక్క్ ఆర్థర్ ను శ్రీలంక బోర్డ్ డిసెంబర్ 05 వ తేదిన నియమించింది.అతనితో పాటు జింబాబ్వే ఆటగాడు గ్రాంటి ప్లవర్ ను బ్యాటింగ్ కోచ్ గా ,ఆస్ట్రేలియా కు చెందిన డేవిడ్ సకేర్ ను బౌలింగ్ కోచ్ గా ,షేక్ మేక్దర్మేట్ ను ఫీల్డింగ్ కోచ్ గా నియమించింది. ఆర్థర్ గతంలో దక్షిణాఫ్రికా ,ఆస్ట్రేలియా ,పాకిస్తాన్ జట్లకు కోచ్ గా వ్యవహరించాడు
క్విక్ రివ్యూ:
ఏమిటి: శ్రీలంక జట్టు హెడ్ కోచ్ గా ఆర్థర్ నియామకం
ఎక్కడ: శ్రీలంక
ఎవరు: మిక్ ఆర్థర్
ఎప్పుడు:డిసెంబర్ 06
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అద్యక్షుడిగా జస్టిస్ రమణ బాద్యతలు:

సుప్రీం కోర్ట్ లో రెండో రోజు అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయియా జస్టిస్ ఎం.వి. రమణ జాతీయ న్యాయ సేవల ప్రాదికార సంస్థ (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ)-నల్సా కార్యనిర్వాహక అద్యక్షుడిగా డిసెంబర్ 06 న బాద్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాల మేరకు కేంద్ర న్యాయ శాఖ జస్టిస్ రమణ నియామకంపై నవంబర్ 27 న తేదిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపద్యంలో ఆయన డిల్లి జాం నగర్ హౌస్ లోని న్యాయ సేవల ప్రాధికార సంస్థ ప్రదాన కార్యాలయాన్న డిసెంబర్ 06 న సందర్శించారు. సమజంలొని నిరుపేదల ,అట్టడుగు వర్గాల ప్రజలకు అవసరమైన న్యాయసాయం అందించడానికి వీలుగా 1987 లో ఈ సంస్థ ఏర్పడింధీ. ఈ సంస్థ కార్య నిర్వాహక అద్యక్షుడిగా నియమితులు కాక ముందు జస్టిస్ రమణ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పెర్సన్ గా సేవలు అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అద్యక్షుడిగా జస్టిస్ రమణ బాద్యతలు
ఎక్కడ: డిల్లి
ఎవరు: జస్టిస్ రమణ
ఎప్పుడు: డిసెంబర్ 06
ఐఎండిబి టాప్ 10 ర్యాంకింగ్ లో ప్రియాంక చోప్రా కు స్థానం:

ఐఎండిబి ర్యాంకింగ్ టాప్ 10లో స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా టేలివిసన్ జాబితాలో ప్రియాంక చోప్రా తొలి స్థానం లో నిలిచారు. ఐఎండిబి ప్రో స్టార్ మీటర్ ర్యాంకింగ్లోనుంచి వచ్చిన డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. నెలకు 200 మిలియన్ల పైగా వీక్షణల డేటాను విశ్లేషించి ఆయా నటులకు సంభందించి సంవత్సరం పొడవున సాధించిన వీక్షణాల ద్వారా ర్యాంకులు ప్రకటిస్తారు.సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భరత్ సినిమాలో నటించిన నటి దిశా పటాని జాబితాలో రెండవ స్థానంలో ఉండగా,వార్ నటుడు హృతిక్ రోషన్ మూడవ స్థానంలో ఉన్నారు. కియారి అద్వాని నాల్గవ స్థానం సాధించగా ,సూపర్ స్టార్ అక్షి కుమార్ ,సల్మాన్ ఖాన్ వరుసగా ఐదు ,ఆరవ స్థానాల్లో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐఎండిబి టాప్ 10 ర్యాంకింగ్ లో ప్రియాంక చోప్రా కు స్థానం
ఎవరు: ప్రియాంక చోప్రా
ఎప్పుడు; డిసెంబర్ 06
తొలి సారిగా పురుషులకు కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్ :

కుటుంబ నియంత్రణ కోసం పురుషులు ఇక పై శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం తప్పనుంది .ఇందుకోసం ప్రపంచంలోనే తోలిసారిగా ఒక ఇంజెక్షన్ సిద్దమైంది .ఈ మందును భారత వైద్య పరిశోదన మండలి (ఐసిఎంఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. విజయవంతంగా క్లినిక్ పరీక్షలు కూడా నిర్వహించారు. దీన్ని ఆమోదం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డిజిసిఐ) కు పంపారు.రేవర్సిబుల్ ఇన్హిబుషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్ఐఎస్యుజి) అనే ఈ ఇంజక్షన్ ను స్త్రేరీన్ మేలియాక్ అన్ హైద్రేడ్ అనే పదార్థంతో తయారుచేశారు. ఇది 13 ఏళ్ళు పనిచేస్తుంది.ఆ తర్వాత దాని సమర్ధత తగ్గిపోయింది. పురుషులలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స (వేసేక్టమి) కు ఇది మేలైన ప్రత్యామ్నాయమని పరిశోధకులు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పురుషులకు కుటుంబ నియంత్రన ఇంజెక్షన్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 06
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |