Daily Current Affairs in Telugu -23-11-2019

daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -23-11-2019:

rrb ntpc online exams in telugu

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడనవిస్:

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాక గత నెల రోజులుగా సాగుతున్న అధికార రాజకీయ వైకుంటపాళిలో నవంబర్ 22 అర్దరాత్రి దాటాక పతాక ఘట్టానికి తెరలేచింది. ముఖ్యమంత్రి పదవి కోసం సాగిన ఆటలో విజయం ఒకరిదని అనుకుంటే నవంబర్ 23 తెల్లవారుజాము కల్లా పరిస్థితి మారిపోయింది. అనూహ్య పరిమాణాల మధ్య భాజాపా నేత దేవేంద్ర ఫడనవిస్ నవంబర్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. సొంత పార్టి వీడి దేవేంద్ర ఫడనవిస్ కు మద్దతుగా నిలిచిన ఎన్సిపి శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి:  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడనవిస్

ఎవరు: దేవేంద్ర ఫడనవిస్

ఎక్కడ: మహారాష్ట్ర

ఎప్పడు: నవంబర్ 23

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ప్రపంచ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ జాబితాలో ప్రత్యూష:

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ టాప్ -500 జాబితా విడుదలైంది. రెండేళ్లకొకసారి విడుదలయ్యే ఈ జాబితాలో తాజాగా భారత్ నుంచి 2 సూపర్ కంప్యూటర్ లు చోటు దక్కించుకున్నాయి. జాబితాలో ప్రత్యూష సూపర్ కంప్యూటర్ 57వ స్థానంలో, మిహిర్ సూపర్ కంప్యూటర్ 100వ స్థానంలో నిలిచాయి. ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ టాప్-500 జాబితాలో ఎక్కువ భాగం అమెరికా,చైనా కంప్యూటర్లే ఉన్నాయి. పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేటిరియోలాజిలో ప్రత్యూష కంప్యూటర్ ను, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ సంస్తలో మిహిర్ కంప్యుటర్ ను ఉపయోగిస్తున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి:  ప్రపంచ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ జాబితాలో ప్రత్యూష

ఎప్పడు: నవంబర్ 23

పట్టణాల్లో నిరుద్యోగం తగ్గింది : ఎన్.ఎస్.ఓ సర్వే:

అధిక నిరుద్యోగ రేటుపై వస్తున్న విమర్శల మధ్య ఉరట కలిగించే వార్త వెలువడింది. పట్టణ నిరుద్యోగ రేటు 4 త్రైమాసికాల్లోనే అతి తక్కువ స్థాయి అయిన 9.3 శాతానికి చేరిందని జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్.ఎస్.ఓ) పేర్కొంది. జనవరి – మార్చి 2019కి సంబంధించిన ఈ గణాంకాలను పోల్చడానికి జనవరి-మర్చి 2018  ఆ సర్వే వెల్లడించలేదు. ఎన్.ఎస్.ఓ విడుదల చేసిన పిరియాడిక్ లేజర్ ఫోర్స్ సర్వే త్రైమాసిక బులిటెన్ ప్రకారం..

  • 2018 ఏప్రిల్ – జూన్ పట్టణ నిరుద్యోగ రేటు (యూఆర్) 9.9 % కాగా.. జులై – సెప్టెంబర్ లో 9.7%. అక్టోబర్ – డిసెంబర్ లో 9.9% గా నమోదైంది.
  • 2019 జనవరి – మార్చిలో పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగ రేటు 8.7 % నమోదు అయింది. మహిళల నిరుద్యోగ రేటు 2019 జనవరి-మార్చి 11.6% గా నమోదైంది.
  • మొత్తం కార్మికుల్లో 37.7% మంది స్వయం ఉపాది కలిగిన వారు కాగా 50% వేతన జీవులు లేదా రెగ్యులర్ సిబ్బంది, 12.4% మంది సాధారణ కార్మికులు.

క్విక్ రివ్యూ :

ఏమిటి:  పట్టణాల్లో నిరుద్యోగం తగ్గింది : ఎన్.ఎస్.ఓ సర్వే

ఎవరు: ఎన్.ఎస్.ఓ

ఎక్కడ: ఇండియా

ఎప్పడు: నవంబర్ 23

ఎపి లో ఘనంగా నిడ్జమ్ పోటీలు ప్రారంభం:

జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్ (నిడ్జమ్) పోటీలు తిరుపతిలో నవంబర్ 23న ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి లోని తారకరామమైదానంలో 3 రోజుల పాటు సాగే ఈ పోటీలను రాష్ట్ర మంత్రులు నారాయణ స్వామి,అవంతి శ్రీనివాస్, పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. దేశంలోని 500 జిల్లాల నుంచి 2,713 మంది బాలురు, 1,736 మంది బాలికలతో పాటు మొత్తం 5,255 మంది ఈ టోర్నిలో పాల్గొనబోతున్నారు. 14 ఏళ్ల లోపు విభాగంలో 5 క్రిడంశాలు, 16 ఏళ్ల లోపు విభాగంలో 12 క్రిడంశాల్లో అథ్లెట్లు పోటిపడుతున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి:  ఘనంగా నిడ్జమ్ పోటీలు ప్రారంభం

ఎక్కడ: తిరుపతి, ఆంధ్రప్రదేశ్

ఎప్పడు: నవంబర్ 23

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *