
Daily Current Affairs in Telugu -18-12-2019
అనంత రచయితకు కేంద్ర సాహిత్య పురస్కారం అవార్డు:

అనంతపురం సాహితివేత్త బండి నారాయణస్వామి రచించిన నవల “శప్తబూమి” కి 2019వ సంవత్సరానికి గాను కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం లబించింది. రాయలసీమ వెనుకబాటుతనం,రైతుల అగచాట్లు,రాష్ట్ర విబజన ఉద్యమం నేపద్యంగా ఈ రచన సాగుతుంది.2017లో తానా నవల పోటిలలో ఉత్తమ బహుమతి లబించింది.తానా 40వ వార్షికోత్సవాల సందర్బంగా అదే ఏడాది మే26నుంచి మూడు రోజుల పాటు సెయింట్ లుయిస్ నగరంలో దీనిపై విస్తృతమైన చర్చ సాగింది.అయన రచనలు ఇందులో పెద్దకథ ,అంకె ,వీరగల్లు బాగా ప్రాచుర్యం పొందాయి.గద్దేలాడ తనదయి,మీ రాజ్యం మీరేలండి,రెండు కలలదేశం ,నిసర్గం తదితర నవలలు రచించారు. ఈయనతో పాటు కన్నడ రచయిత్రి డాక్టర్ విజయకు అవార్డు లబించింది.కన్నడ రచయిత్రి,పాత్రికేయురాలు డాక్టర్ విజయ రచించిన “కృతి కుది ఎసరు” కు కేంద్ర సాహిత్య పురాస్కారం లబించింది. డాక్టర్ విజయ తన ఆత్మకథకు ఇచ్చిన అక్షర రూపం కుది ఎసరు .విజయ అనేక కన్నడ మాస, వారపత్రిక లకు సంపాదకులుగా వ్యవహరించారు. నాటకం ,విమర్శ రంగాల్లోనూ తన ప్రతిబను చాటారు. రాజకీయ నాయకుడు,రచయిత శశితరుర్కు ఈ ఏడాది (2019)కి గాను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమి పురస్కారం లబించింది.శశితరుర్ ఆంగ్లంలో రాసిన “యెన్ ఏరా ఆఫ్ డార్క్నెస్” కు కాల్పనిక సాహిత్యం విబాగంలో ఈ అవార్డు ను ప్రకటించారు. ఫిబ్రవరి 25న నివహించే కార్యక్రమంలో విజేతలకు రూ.లక్ష నగదుతో పాటు తామ్రపత్రం బహుకరిస్తారు,
కవితలవిబాగంలోరచయితనందకిషోర్(హింది),వెన్నమధుసూదన్(సంస్కృతం),అనురాధపాటిల్(మరాటి),వి.మదుసుధన్ నాయర్(మలయాళం) సహా ఏడుగురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
చిన్నకథల కేటగిరిలో తరుణ్ కాంతి మిశ్ర (ఒడియ),కృపాల్ కాక(పంజాబీ),అబ్దుల్ అహ్మద్ హజిని(కాశ్మీరీ)సహా ఆరుగురు పురస్కారానికి ఎంపికయ్యారు..స్వీయ జీవిత చరిత్ర విభాగంలో విజయ (కన్నడ)జీవిత చరిత్ర ల కేటగిరిలో షఫే కిద్వాయ్ (ఉర్దూ) లకు అవార్డులు లబించాయి.వ్యాస సంకలనలకి విషయానికి వస్తే చిన్మయ గుహ (బెంగాలి),ఓంశర్మ జండ్రియారి(దొంగ్రి),రటిలాల్ బోరిసాగర్ (గుజరాత్) లకు పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అనంత రచయితకు కేంద్ర సాహిత్య పురస్కారం అవార్డు
ఎవరు: బండి నారాయణస్వామి
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్18
క్లిమాం సంస్థకు అంతర్జాతీయ పురస్కారం :

రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌లో కేంద్రంగా గత ఐదేళ్లుగా స్వచ్చమైన ఆవు పాలు,వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతో పాటు ఇతర ఆరోగ్య సేవలు అందిస్తున్న క్లిమాం వేల్నేస్స్,పారమ్స్ సంస్థకు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వేదిక (ఐఎఫ్ఎహెచ్)పురస్కారం లబించింది.డిసెంబర్17న దుబాయిలో సంస్థ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యరెడ్డి దీనిని స్వీకరించారు.ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్ లీడర్ ) విబాగంలో ప్రపంచ దేశాల నుంచి పలు సంస్థలు పోటి పడగా క్లిమాం మొదటి 100స్థానాల్లో చోటు దక్కిన్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: క్లిమాం సంస్థకు అంతర్జాతీయ పురస్కారం
ఎవరు: అల్లోల దివ్యరెడ్డి
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 18
శాస్త్రీయ వ్యాసాల ప్రచురణలో భారత్ ది 3వ స్థానం:

భారత్ కు చెందిన పరిశోదనలకు ఆనందం కలిగించే వార్త ఇంజనీరింగ్ ,సైన్స్ రంగాల్లో శాస్త్రీయ వ్యాసాల ప్రచురణలో భారత్ ప్రపంచంలో మూడో స్థానం లోనిలిచింది. ఈ రంగాల్లో 2018లో భారత్ లో 135788 శాస్త్రీయ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.అమెరికాకు చెందిన నేషనల్ సైన్ పౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్)తాజాగా గనాంకాలను ప్రకటించింది.చైనా అగ్రస్థానంలో ఉండగా ,అమెరికా రెండో స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: శాస్త్రీయ వ్యాసాల ప్రచురణలో భారత్ ధీ 3వ స్థానం:
ఎక్కడ: వాషింగ్టన్
ఎప్పుడు: డిసెంబర్ 18
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సలహాదారుడిగా కలిస్:

సంక్షోబంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ ను కాపాడేందుకు ఆ దేశం క్రికెట్ బోర్డు మాజిలనే నమ్ముకుంది.ఇప్పటికే క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న గ్రేమ్ స్మిత్ ను ,ప్రధాన కోచ్ గా మార్క్ బౌచర్ ను నియమించిన క్రికెట్ దక్షిణాఫ్రికా తాజాగా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వస్ కలిస్ ను దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ సలహాదారుడిగా నియమించింది. డిసెంబర్ 17 కలిస్ బాద్యతలు స్వీకరించాడు.ఐపిఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కు ప్రదాన కోచ్ గా ,బ్యాటింగ్ సలహాదారుడిగా సేవలు అందించిన అనుబవం అతడికి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సలహాదారుడిగా కలిస్
ఎవరు: జాక్వాస్ కలిస్
ఎక్కడ: దక్షిణాఫ్రికా
ఎప్పుడు: డిసెంబర్ 18
జాతీయ పోలీస్ అకడమి డైరెక్టర్ గా అతుల్ నియామకం :

జాతీయ పోలీస్ అకాడమి డైరెక్టర్ గా అతుల్ కరవల్ నియమితులయ్యారు.ఈ మేరకు హోశాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి అపాయిట్మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది గుజరాత్ క్యాడర్‌కు చెందిన 1988బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన అతుల్ ప్రస్తుతం సిఅర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.ఇంతవరకు పోలీస్ అకాడమి డైరెక్టర్ గాఉన్న అభయ్ ఓడిశా డిజిపి గా వెళ్ళడంతో ఆయన స్థానంలో అతుల్ నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ పోలీస్ అకడమి డైరెక్టర్ గా అతుల్ నియామకం
ఎవరు: అతుల్ కరవల్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 18
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
సంపద సృష్టిలో రిలయన్స్ దే మొదటి స్థానం :

ముకేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు రికార్డులు కొత్తేం కాదు.తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.అదేమిటంటే సంపద సృష్టిలో అగ్ర స్థానం.2014-19వరకు అంటే ఐదేల్ల కాలంలో రూ.5.6లక్షల కోట్ల సంపదను సృష్టించింది. 2019 సంవత్సరానికి గాను వార్షిక సంపదను సృష్టిపై మోతిలాల్ ఒస్వాల్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.జాబితాలోని సంపద సృష్టిలో తొలి 100స్థానాల్లో నిలిచిన కంపెనీలు గతంలో ఎన్నడు లేని విధంగా 2014-19 మద్య కాలంలో రూ .49 లక్షల కోట్ల సంపదను సృష్టించాయి. ఏడేళ్ళ తర్వాత మల్లి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2014-19 మద్య కాలంలో అత్యధిక సంపదను సృష్టించిన కంపెనీగా నిలిచింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ సృష్టించిన సంపద ఇప్పటి వరకు అత్యధికంగా కాగా తన తర్వాతి స్థానంలో ఉన్న కంపెనీకి దీనికి మద్య సంపద సృష్టిలో వ్యత్యాసం బారి గానే ఉంది అని నివేదిక లో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సంపద సృష్టిలో రిలయన్స్ దే మొదటి స్థానం
ఎవరు: రిలయన్స్
ఎక్కడ: డిల్లీ
ఎప్పుడు: డిసెంబర్ 18
జాతీయ బ్రాడ్ బాండ్ మిషన్ ప్రారంబం ;

దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 సంవత్సరానికల్ల నాణ్యమైన బ్రాడ్ బాండ్ సౌకర్యం అందించేదుకు ఉద్దేశించిన జాతీయ బ్రాడ్ బాండ్ మిషన్ ప్రారంబమైంది.న్యూడిల్లిలో డిసెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మిషన్ ను ప్రారంబించారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గా ఎదిగేందుకు ఈ మిషన్ సాదనంగా ఉపయోగపడుతుందని మంత్రి రవిశంకర్ అబిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ బ్రాడ్ బాండ్ మిషన్ ప్రారంబం
ఎవరు: రవిశంకర్ ప్రసాద్
ఎక్కడ: న్యూడిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 18
చైనాలో రెండో విమానవాహక నౌక ప్రారంబం :

దేశీయ పరిజ్ఞానంతో చైనా రూపొందించిన రెండో విమాన వాహక నౌక “షాన్ జాంగ్” సేవలు ప్రారంబంయ్యాయి. డిసెంబర్ 17న నిర్వహించిన కార్యక్రమంలో చైనా అద్యక్షుడు జిన్ పింగ్ షాన్ జాంగ్ ను చైనా నౌకాదళానికి అప్పగించారు. దక్షిణ చైనా సముద్ర తీరంలో ఈ వియన వాహక నౌక ను మొహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనాలో రెండో విమానవాహక నౌక ప్రారంబం
ఎవరు: చైనా ప్రబుత్వం
ఎక్కడ: చైనా
ఎప్పుడు: డిసెంబర్ 18
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |