
Daily Current Affairs in Telugu -03-12-2019
విక్రం జాడను కనిపెట్టిన చెన్నై కుర్రాడు -షన్ముగ సుబ్రహ్మణ్యన్ :

జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో గల్లంతైన చంద్రయాన్-2 లోని విక్రం ల్యాందర్ ఆచూకి ఎట్టకేలకు దొరికింది. అది చంద్రుడి ఉపరితలాన్ని బలంగా డీ కొట్టి విచ్చిన్నమైంది. చెన్నైకి చెందిన ఒక మెకానికల్ ఇంజనీర్ సాయంతో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) దాన్ని గుర్తించింది. రోదసి రంగంతో సంబంధం లేని ఆయన ల్యాండింగ్ ప్రయత్నానికి ముందు, ఆ తర్వాత సదరు ప్రదేశానికి సందంధించి తీసిన పోటోలను గంటల తరబడి విశ్లేషించడం ద్వారా దాన్ని కనుగొన్నాడు. సీనియర్ శాస్త్రవేత్తలకు సాద్యం కాని అంశాన్ని సాధించి చూపారు.సెప్టెంబర్ 17 న తొలిసారిగా విక్రం ల్యాండింగ్ ప్రదేశాన్ని నాసా చిత్రీకరించింది. విక్రం ల్యాండింగ్ కు ముందు ఆ ప్రాంతంలో తీసిన చిత్రాలకు వెలువరించింది ల్యాండింగ్ ముందు తర్వాతా తీసిన చిత్రాలను పోల్చి చూసి,విక్రంజాడను కనుగొనాలని ఔత్సాహికులకు పిలుపినిచ్సింది.చెన్నై కి చెందిన 33 ఎల్ల ఐటి నిపుణుడు షన్ముగ సుబ్రహ్మణ్యన్ వెంటనే రంగంలోకి దిగారు.తన ల్యాప్టాప్ సాయంతో నాసా చిత్రాలను చూడడం మొదలుపెట్టారు.ల్యాండింగ్ తర్వాతి చిత్రాలను ఒక బుల్లి చుక్క సుబ్రహ్మణ్యన్ దృష్టిని ఆకర్షించింది.అంతకముందు తీసిన చిత్రాల్లో అది కనిపించలేదు.దీంతో అది విక్రం కూలిన ప్రదేశమన్న అంచనాకు వచ్చారు.ఇదే విషయాన్ని నాసాకు ఇమెయిల్ ద్వారా తెలియచేసారు
క్విక్ రివ్యూ:
ఏమిటి: విక్రం జాడను కనిపెట్టిన చెన్నై కుర్రాడు -షన్ముగ సుబ్రహ్మణ్యన్
ఎవరు: షన్ముగ సుబ్రహ్మణ్యన్
ఎక్కడ: వాషింగ్టన్
ఎప్పుడు: డిసెంబర్ 03
హైదరాబాద్ లో భారత్ –అమెరికా రక్షణ సంబందాల సదస్సు :

రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని భారత్ –అమెరికా దేశాలు నిర్ణయించాయి. అందులో బాగంగా ఈ నెల 18,19 తేదిల్లో రెండు దేశాల రక్షణ అధికారులు ,పరిశోదకులు, రక్షణ వ్యాపార దిగ్గాజాలు సదస్సు ను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం డిసెంబర్ 03 న ఒక ప్రకటనలో పేర్కొంది.ది బిజినెస్ కౌన్సిల్ పర్ ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ (బిసీయు),కన్సేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రిస్ (సిఐఐ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. రెండు దేశాల రక్షణ రంగంలో అనుసరిస్తున్న ద్వైపాక్షిక విధానాలు,అమెరకా రక్షణ పరిశ్రమల సహకారం ,బాగాస్వానులతో తయారి విధానాలు తదితరాలపై సదస్సులో సమీక్ష జరుగుతుందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హైదరాబాద్ లో భారత్ –అమెరికా రక్షణ సంబందాల సదస్సు
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 18,19
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
.
పోష్టికాహార గీతాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి:

పౌష్టికాహార లోప రహితంగా మన దేశాన్ని 2022 నాటికి తీర్చిదిద్దాలని సందేశంతో రూపొందించిన బారతీయ పోషణ గీతాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు డిసెంబర్ 02 న డిల్లి లో ఆవిష్కరించారు. ప్రముక గీత రచయిత ప్రసూన్ జోషి ఈ గీతాన్ని రాశారు.ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహాదేవ ఈ గీతాన్నిఆలపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పోష్టికాహార గీతాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
ఎవరు: వెంకయ్యనాయుడు గారు
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 03
దక్షినాసియా క్రీడల్లో పసిడి సాధించిన మొహోలి:

దక్షిణాసియ క్రీడల్లో భారత్ పసిడి వేట కొనసాగుతోంది. డిసెంబర్02 న మహిళల 10 మీటర్ల ఎయిర్ రైపిల్ లో 19ఎల్ల మొహోలి గోష్ పసిడి పథకం సాధించింది. పైనల్లో 253.3 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. మహోలి స్కోర్ ప్రస్తుత ప్రపంచ రికార్డ్ (అపూర్వ చండేలా ,252.9) కంటే ౦.4 పాయింట్ల ఎక్కువ కావడం విశేషం. అయితే ఈ క్రీడల్లో సాధించిన రికార్డులను ప్రపంచ షూటింగ్ సమాఖ్య పరిగణలోకి తీసుకోదు.ఇదే విభాగంలో భారత షూటర్లు శ్ర్రేయాంక రజతం ,శేయ అగర్వాల్ కాంస్యం గెలిచి పథకాల స్వీప్ చేసారు.పోటిల రెండో రోజు భారత్ 11 స్వర్ణాలు సహా 27 పతకాలు గెలుచుకుంది.అర్చన సుశీన్ద్రన్ (మహిళల 100మీ) జశ్నా (మహిళల హైజంప్),సరోజ్ అనిల్(పురుషుల హైజంప్),సర్వేశ్ అనిల్ (పురుషుల హైజంప్),సరోజ్ (పురుషుల 1500మీ)లో పసిడి పతకాలు సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షినాసియా క్రీడల్లో పసిడి సాధించిన మొహోలి
ఎవరు: మొహోలి గోష్
ఎక్కడ: ఖాట్మండు
ఎప్పుడు: డిసెంబర్ 03
లియోనల్ మెస్సి రికార్డ్ “సిక్సర్”:

సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సి అరుదైన ఘనత సాధించారు.పుట్ బాల్ చరిత్రలో ఎవరికీ సాద్యం కాని విధంగా ప్రతిష్టాత్మకంగా గోల్డెన్ బాల్ పురస్కారాన్ని ఆరో సారి అందుకున్నాడు. ఏడాదిలో అత్యత్తమ ప్రదర్శన చేసిన పుట్ బాల్ కు అందించే ఈ పురస్కారాన్ని ఆరోసారి అందుకున్నాడు. ఏడాదిలో అత్యత్తమ ప్రదర్శన చేసిన పుట్ బాలర్ కు అందించే ఈ పురస్కారాన్ని ఇన్ని సార్లు ఏ ఆటగాడు దక్కిన్చుకోలేదు. గత ఏడాది వరకు రోనాల్డో తో సమానంగా అయిదు గోల్డెన్ బాల్ పురస్కారాలు ఉన్న మెస్సి ,2019 లో44 మ్యాచ్లో 41 గోల్స్ సాధించి రికార్డ్ స్థాయిలో ఆరోసారి ఈఅవార్డును గెలుచుకున్నాడు. ఇంతక ముదు 2019,2010,2011,2012,2015 సంవత్సరాల్లో అతని ఈ పురస్కారం సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: లియోనల్ మెస్సి రికార్డ్ “సిక్సర్
ఎవరు: : లియోనల్ మెస్సి
ఎక్కడ: :డిసెంబర్ 03
ఎప్పుడు: డిసెంబర్ 03
న్యూజిలాండ్ జాట్టు కు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ :

వివాదాస్పద రీతిలో ముగిసిన ఐసిసి ప్రపంచకప్ పైనల్లో అసాదారణ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించిన న్యూజిలాండ్ జట్టు కు ఎంసిసి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ పురస్కారమ్ లభించింది. ఈ అవార్డ్ ను గెలుచుకోవడానికి న్యూజిలాండ్ సంపూర్ణ అర్హురాలు . ఉత్కంట పరిస్థితుల్లో ఆ జట్టు ఎంతో క్రీడా స్పూర్తిని ప్రదర్శించింది.”అని ఎంసిసి అద్యక్షుడు సంగక్కర అన్నాడు. తప్పుడు అంపైరింగ్ కారనంగా ప్రపంచ కప్ పైనల్లో న్యూజిలాండ్ నష్టపోయింది. సూపర్ ఓవర్ కూడా టై కాగా బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: న్యూజిలాండ్ జాట్టు కు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్
ఎక్కడ: న్యూజిలాండ్
ఎప్పుడు : డిసెంబర్ 03
బిడబ్లూఎఫ్ ర్యాంకింగ్లో టాప్-30 లో సౌరభ్ వర్మ :

సయ్యద్ మోది టోర్నిలో రన్నర్ అప్ గా నిలిచిన సౌరభ్ వర్మ కెరీర్లో తన అత్యుత్తమ ర్యాంకును అందుకున్నాడు. బీ.డబ్లు.ఎఫ్ తాజా ర్యాంకింగ్లో అతనికి 29 వ స్థానం లబించింది. దీంతో ర్యాంకింగ్ టాప్ -30 లో అత్యధికంగా ఆరు మంది షట్లర్లు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. సాయి ప్రనీత్ (11),కిధాంబి శ్రీకాంత్(12) ,కశ్యప్(27),టాప్-30లో ఉన్నారు. చైనా నుంచి ఐదుగురు షట్లర్లు టాప్ -30 లో ఉన్నారు. మహిళల ర్యాంకింగ్ స్థానంలో పివి సింధు ఆరో స్థానంలో, సైనా నెహ్వాల్ పదో స్థానంలో కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బిడబ్లూ ఎఫ్ ర్యాంకింగ్లో టాప -30 లో సౌరభ్ వర్మ
ఎవరు: సౌరబ్ వర్మ
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 03
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |