
Daily Current Affairs in Telugu -28-12-2019
అంగారకుడి పై యాత్ర –మార్స్ 2020 రోవర్‌ను ఆవిష్కరించిన నాసా:

వచ్చె ఏడాది అంగారకుడిపై పంపే మార్స్ 2020 రోవర్‌ను అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఆ గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది ఇది తెలుస్తుందని చెప్పారు,.అంతే కాకుండా బవిష్యత్ లో అక్కడికి చేపట్టే మానవరహిత యాత్రలకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. ఈ రోవర్‌ను లాస్ ఏంజిల్స్ లో జెట్ ప్రోపల్షణ్ లాబరేటరీలో నిర్మించారు.గతవారం దీన్నీ విజయవంతంగా నడిపి చూసారు.ఈ రోవర్ ను వచ్చే ఏడాది జులై లో ప్రయోగిస్తారు. ఏడు నెలల తర్వాత అది అంగారకుడిపై దిగుతుంది. అరుణ గ్రహంపై వందల కోట్ల ఎల్ల కిందట జీవులు నివసిన్చాయని అన్నది పరిశీలిస్తుంది.ఒక వేల నివసించి ఉంటె వాటి అవశేశాలను పట్టుకోవడానికి అనేక పరికరాలను ఈ వ్యోమ నౌకలో ఉంచుతున్నారు. అవి అరుణ గ్రహ ఉపరితలం ,రసాయన తీరు తెన్నులను విశ్లేషిస్తాయి. రోవర్లో 23కెమరాలు ఉంటాయి.అక్కడి గాలుల శబ్దానికి వినడానికి రెండు సాధనాలను అమర్చారు.రసాయన విశ్లేషణ కోసం ఈ రోవర్ లేజర్లను ప్రయోగిస్తుంది.ఈ వ్యోమ నౌక ఒక కారు పరిణామం లో ఉంటుంది.ప్రత్యేకంగా రూపొందించిన ఆరు చక్రాలతో కదులుతుంది.
క్విక్ రివ్యూ
ఏమిటి: అంగారకుడి పై యాత్ర –మార్స్ 2020 రోవర్‌ను ఆవిష్కరించిన నాసా
ఎక్కడ: వాషింగ్టన్
ఎవరు: నాసా
ఎప్పుడు: డిసెంబర్ 28
రష్యా సైన్యంలో కి అవన్ గార్డ్ క్షిపణి :

ద్వని కన్నా 20రెట్లు ఎక్కువ వేగంతో దుసుకేల్లి అత్యంత అధునాతన హైపవర్ సోనిక్ ఖండార్గత క్షిపణి అవన్ గార్డ్ ని డిసెంబర్ 27రష్యా తన సైన్యంలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఈ సామర్త్యాన్ని సాధించిన తొలి దేశంగా రష్యా అవతరించింది. గంటకు దాదాపు 33వేల కి.మీల వేగంత్జ్హో దుసుకేల్లె అవన్గార్డ్ ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా 30 నిమిషాల్లో తుత్తునియలు చేయగలదు. దీనిలో అమర్చిన గ్లైడర్ కారణంగా ప్రస్తుతం ప్రపంచ దేశాల వద్ద ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థలను చిక్కకుండా దుసుకుపోగలదు. అన్వస్ట్ర సామర్త్యమున్న అవన్ గార్డు ను 2018 ,డిసెంబర్ 26న రష్యా విజయవంతంగా పరీక్షించింది
క్విక్ రివ్యూ
ఏమిటి: రష్యా సైన్యంలో కి అవన్ గార్డ్ క్షిపణి
ఎవరు: రష్యా దేశం
ఎప్పుడు : డిసెంబర్ 28
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టాటా ముంబై మారథాన్ అబాసిదర్గా షానాస్ :

టాటా ముంబై మారథాన్ 17వ ఎడిషన్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏడు సార్లు ఒలింపిక్ పతక విజేత .తొమ్మిదిసార్లు ప్రపంచ చాంపియన్ అయిన అమెరికా జిమ్నాస్టిక్స్ షానాస్ మిల్లర్ (42) ఎంపికయ్యారు.ఈ విషయాన్ని మారథాన్ నిర్వాహకులు డిసెంబర్ 27న వెల్లడించారు.ఈ మారథాన్ 2020 జనవరి 19న ముంబై నగరంలో జరగనుంది.యుఎస్ ఒలింపిక్ హాల్ ఆఫ్ ఫేం లోరెండు సార్లు (2006లో వ్యక్తిగత,2008 లో టీం విబాగం ) చోటు దక్కించుకున్న ఏకైక మహియా క్రీదాకారిగా మిల్లర్ షానాస్ గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ
ఏమిటి: టాటా ముంబై మారథాన్ అబాసిదర్గా షానాస్
ఎవరు: షానాస్ మిల్లర్
ఎప్పుడు డిసెంబర్ 28
సమగ్ర సమాచారానికి రైల్ సువిధ యాప్ :

రైల్వే ప్రయానికులకు రైల్ సువిధ యాప్ అందుబాటులోకి రానుంది. దక్షిణ మద్య రైల్వే డివిజన్లో అన్ని స్టేషన్లో ఈ యాప్ సేవలను ప్రయాణికులు విన్యోగించుకోవచ్చు.రైల్వే వాణిజ్య (కమర్షియల్) విభాగం అధికారులు ,సిబ్బందికి సైతం ఈ యాప్ ఎంతోప్రయోజననకారిగా ఉంటుంది. త్వరలోని గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి రానుంది.ఈ యాప్ ను దక్షిణ మద్య రైల్వే జిఎం గజానన్ మలయ,డిఆర్ఎం సితారంప్రసాద్ ప్రారంబించారు. రైల్వే స్టేషన్లో ఏసీ,సాధారణ విశ్రాంతి గదులు, పలహారశాలలు ,టి స్టాల్లు తదితర సమాచారన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు.దివ్యాన్గులకు అవసరమైన వీల్ చీరలు తదితరాలు వసతుల సమాచారం ఉంటుంది. రైల్వే వారు జారీ చేసిన ఉత్తర్వులు ,విధాన నిర్ణయాలు సమాచారన్ని సైతం తెలుసుకోవచ్చు.
క్విక్ రివ్యూ
ఏమిటి: సమగ్ర సమాచారానికి రైల్ సువిధ యాప్
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: దక్షిణ మద్య రైల్వే
ఎప్పుడు: డిసెంబర్ 28
ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో హంపికి స్వర్ణం :

పునరాగమనంలో కోనేరు హంపి నుంచి అద్బుత ప్రదర్శన. ఇటీవల మొనాకో గ్రాండ్ ఫ్రీ చెస్ టైటిల్ గెలుచుకున్న హంపి మరో మేగా టైటిల్ ఖాతాలో వేసుకుంది.. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆమె పసిడి పథకం సొంతం చేసుకుంది. 12రౌండ్ల ఈ టోర్నీలో ఆఖరి రౌండ్ తర్వాత హంపి 9పాయింట్లతో చైనా గ్రాండ్ మాస్టర్ లి టింగ్ జి ఎకర్తిన (టర్కి) తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన త్రైబ్రేక్ స్కోర్ ఆధారంగా స్వర్ణం కోసం పోరాడే అవకాశం హంపి ,లీ టింగ్ జిలకు దక్కింది. ప్లే ఆఫ్ కూడా అంత త్వరగా తేలలేదు హంపి ,లి టింగ్ జి హోరాహోరి పోరాడడంతో తొలి ప్లే ఆఫ్ కూడా డ్రా గా ముగిసింది. దీంతో రెండో ప్లే ఆఫ్స్ అనివార్యమైంది. రెండో ప్లే ఆఫ్ లో తప్పలు చేయకుండా పావులు కదిపింది.దీంతో టి లింగ్ జి ఓటమి పాలైంది.పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో నిఅవగా ,నకమురా (10 అమెరికా ) వ్లాదివ్స్లావ్ (10 రష్యా ) జత ,కాంస్య పతకాలను సాధించారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో హంపికి స్వర్ణం
ఎక్కడ: మాస్కో
ఎవరు: కోనేరు హంపి
ఎప్పుడు: డిసెంబర్ 28