Daily Current Affairs in Telugu -04-12-2019

Daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -04-12-2019

rrb ntpc online exams in telugu

గూగుల్ కు మాతృ సంస్థ అల్ఫబేట్  సిఈఓ గా సుందర్ పిచాయ్ నియామకం:

గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ అద్బుత అవకాశం దక్కింది.మాతృ సంస్థ  ఆల్ఫబేట్ కు సైతం ఆయనే సిఈఓ గా వ్యవహరించనున్నారు. ఈ సాంకేతిక దిగ్గజం సహా  వ్యవస్థాపకుడు లారీ పేజ్,సెర్గీ బ్రిన్ లు తమ పాత్ర ల నుంచి  తప్పుకోవడంలో  భారత సంతతికి  చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పరేట్ దిగ్గజం గా మారనున్నారు. పేజ్ తన సిఈఓ స్థానం నుంచి,బ్రిన్ తన ప్రెసిడెంట్ హోదా నుంచి వైదొలుగుతున్నట్లు కంపెని డిసెంబర్ 03 న ప్రకటించింది.ప్రస్స్తుత గూగుల్ సిఏఒ బాద్యతలతో పాటు అల్ఫబేట్ సిఈఓ పగ్గాలను పిచాయ్ చేపట్టనున్నారు.తాజా పరినామంలో అత్యంత  శక్తివంతమైన సాంకేతిక దిగ్గజాలలో  ఒకరుగా పిచాయ్ నే మారనున్నారని న్యూయార్క్ టైమ్స్ వ్యాక్యానించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: గూగుల్ కు మాత్రు సంస్థ అల్ఫబేట్ సిఈఓ గా నియామకం

ఎవరు: సుందర్ పిచాయ్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: డిసెంబర్ 04

అత్యత్తమ ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా జిఎంఆర్ ఏవియేషన్  అకాడమి:

జిఎంఆర్ గ్రూపునకు చెందిన విమాన నైపుణ్యాల  శిక్షణ సంస్థ  జిఎంఆర్ ఏవియేషన్  అకాడమి కి (జిఎంఆర్ ఏఏ)అత్యత్తమ ప్రాంతీయ  శిక్షణా కేంద్రం  హోదా లబించింది. ఇక్కడ ప్రారంబమైన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసిఎఓ) 6 వ విడత  శిక్షణ (ట్రైన్ ఎయిర్ ప్లస్) కార్యక్రమం లో జిఎంఆర్ ఏఏ లకు  రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపు నకు ఐసిఓ ఇచ్చ్సింది .భారత్లో ఈ హోదా పొందిన  మొట్టమొదటి విమాన యాన శిక్షణ సంస్థ  జిఎంఆర్ కావడం విశేషం.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అత్యత్తమ ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా జిఎంఆర్ ఏవియేషన్  అకాడమి

ఎవరు: జిఎంఆర్ ఏవియేషన్  అకాడమి

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 04

దక్షిణాసియ క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణా క్రీడాకారిణి శ్రీజ :

దక్షిణాసియ క్రీడల్లో భారత అథ్లెట్లు పథకాల పంట  పండిస్తున్నారు. డిసెంబర్ 03న  ఒక్క రోజే మన క్రీడాకారులు 16 స్వర్ణాలు తో సహా మొత్తం 27 పతకాలు గెలిచారు.అథ్లెటిక్స్  టిటి(టేబుల్ టెన్నిస్) ,ఖోఖో  లో పూర్తి ఆధిపత్యం  భారత ఆటగాల్లదే. .తెలంగాన క్రీడాకారిణి  శ్రీజ  టిటి మహిళల డబుల్స్ లో పసిడి నెగ్గింది. మొత్తం 34 స్వర్నాలతో సహా మొత్తం 70 పథకాలతో బారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మాధురిక తో కలిసి  మహిళల డబుల్స్ బరిలో దిగిన  శ్రీజ పసిడి సొంతం చేసుకుంది. ఈ విభాగంలో పాటు పురుషుల డబుల్స్ ,మిక్స్ ద్  డబుల్స్ లోను స్వర్నాలు ,రజతాలు  భారత ఖాతాలో చేరడం విశేషం. మదురిక జోడి 4-2తేడాతో,  సుతీర్థ – ఐహిక పై గెలిచింది. తైక్వాందో లో బారత్ కు  మూడు స్వర్నాలతో పాటు ఆరు పతకాలు  దక్కాయి. 

క్విక్ రివ్యూ:

ఏమిటి: దక్షిణాసియ క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణా క్రీడాకారిణి శ్రీజ

ఎవరు:  శ్రీజ

ఎక్కడ: ఖాట్మండు

ఎప్పుడు: డిసెంబర్ 04

జయేష్ రంజన్ కు స్వీడన్ పురస్కారం :

రాష్ట్ర ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు స్వీడన్ చెందిన ది రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారం స్వీకరించారు. డిల్లి లోని స్వీడన్ రాయబార కార్యాలయంలో స్వీడన్ రాజు గుస్తాన్ -16 రాణి సిల్వియ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని  అందుకున్నారు. ఐకియ షోరూం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి కృషి చేయడంతో పాటు స్వీడన్ పెట్టు బదులు రాష్ట్రంలో పెట్టేందుకు సహకరించినదుకు గాను  అయన ఈ అవార్ద్ ను బహుకరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: జయేష్ రంజన్ కు స్వీడన్ పురస్కారం

ఎవరు: జయేష్ రంజన్

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు:డిసెంబర్ 04

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

    డిల్లీలో  భారత్- స్వీడన్ వ్యాపార సదస్సు:

దేశ రాజధాని నగరం దిల్లిలో డిసెంబర్ 03న భారత్ స్వీడన్ వ్యాపార సదస్సు జరిగింది. సదస్సు కు హాజరైన కేంద్రఆర్ధిక మంత్రి  నిర్మల సీతారామన్ మాట్లాడుతూ భారత్ లో తయారి కోసం  పెట్టుబడులకు బారత్ ను ఆకర్శినీయ గమ్య స్థానంగా మార్చేందుకు మరిన్ని  సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రబుత్వం సిద్దంగా ఉందని  పేర్కొన్నారు. కార్పోరేట్ పన్ను తగ్గింపు సహా ప్రబుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. భారత్లో లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో  పెట్టుబడులు పెట్టాలంటూ  స్వీడన్ కు చెందిన కంపెనీలను  మంత్రి ఆహ్వానించారు. కార్పోరే పన్నును 30 శాతం నుంచి 22 శాతమ్ కు తగ్గిస్తూ 2019.సెప్టెంబర్ లో కేంద్ర ప్రబుత్వ నిర్ణయం  తీసుకున్న విషయం తెలిసిందే .గడిచిన 28 ఏళ్లలో  పన్నుల పరంగా ఇది అతిపెద్ద సంస్కరణ .

క్విక్ రివ్యూ:

ఏమిటి: డిల్లీలో  భారత్– స్వీడన్ వ్యాపార సదస్సు

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 04

శ్రీచైతన్య విద్యాసంస్థల ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డ్ :

శ్రీచైతన్య విద్యాసంస్థలు డిసెంబర్ 03 న రెండు ప్రపంచ రికార్డ్ లను నెలకొల్పాయి. ఫిట్ ఇండియా ఉద్యమంలో బాగంగా ఏడూ రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో  ఒకటి  నుంచి అయిదో తరగతి వరకు సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు 214 వేదికలపై ఏక కాలంలో ఏడు నిమిషాల పాటు స్పోర్ట్స్ డ్రిల్ ను నిర్వహించారు. ఈ విభాగంలో రికార్డును నమోదు చేశారు. మూడు నుంచి అయిదో తరగతి విద్యార్థులు సుమారు 76 వేల మంది విద్యార్థులు 214 వేదికలపై విరామం లేకుండ 15 నిమిషాల పాటు 45 యోగాసనాలు ప్రదర్శించి మరో కొత్త రికార్డును సృష్టించారు. ఎలైట్ వరల్డ్  రికార్డ్ (యుఎస్ఎ),ఏసియన్ రికార్డ్స్ అకాడమి(యుఎస్ఎ), ఇండియా రికార్డ్స్ అకాడమి  (భారత్) వీటిని దృవీకరించాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  శ్రీచైతన్య విద్యాసంస్థల ఫిట్ ఇండియా  ప్రపంచ రికార్డ్

ఎక్కడ: విజయవాడ

ఎప్పుడు: డిసెంబర్ 04

స్వచ్చత ర్యాంకింగ్ లో కేఎల్ డీమ్డ్ వర్శిటీ గా నం.1 :

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో నిర్వహించిన  స్వచ్చత అవార్డుల్లో కే.ఎల్.డీమ్డ్. వర్శిటీ మొదటి స్థానం దక్కించుకుందని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎల్.ఎస్.ఎస్. రెడ్డి  తెలిపారు.  డిసెంబర్ 03 న విశ్వవిద్యాలయాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.డిల్లి లో నిర్వహించిన ఉన్నత విద్యాసంస్థల స్వచ్చ క్యాంపస్  ర్యాంకింగ్ -2019అవార్డుల కార్యక్రమలో కేంద్ర  మంత్రి  రమేష్ పోక్రియాల్ నిశాంక్  చేతుల మీదుగా కేఎల్ఎడ్యుకేషన్ పౌండేషన్ కార్యదర్శి కోనేరు శివ  కాంచన లతా ఈ అవార్డు అందుకున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: స్వచ్చత ర్యాంకింగ్ లో కేఎల్ డీమ్డ్ వర్శిటీ గా నం.1

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 04

ఎస్పిజి సవరణ  బిల్లుకు రాజ్యసభ  ఆమోదం :

దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పిజి ) చట్టానికి చేసిన సవరణకు గాను రాజ్యసభ డిసెంబర్ 03న ఆమోదం తెలిపింది.ఈ బిల్లును లోక్ సభ నవంబర్  27న ఆమోదించింది. ఈ బిల్లు -2019ప్రకారం ఇకపై దేశ ప్రదాని  అధికార నివాసంలో ఉండే కుటుంబ సబ్యులకు మాత్రమే ఎస్పిజి రక్షణ  వ్యవస్థ సేవలు అందుతాయి. బిల్లు పై జరిగిన చర్చలో హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రదాని కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సబ్యులకు  ఐదేళ్ళ పాటు ఎస్పిజి రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన  రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు అని వివరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  ఎస్పిజి సవరణ  బిల్లుకు రాజ్యసభ  ఆమోదం

ఎక్కడ: డిల్ల్లి

ఎప్పుడు:డిసెంబర్ 04

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *