
Daily Current Affairs in Telugu -14-12-2019
ప్రపంచ సుందరిగా జమైకా యువతీ టోని:

ప్రపంచ సుందరి -2019గా జమైకా యువతీ టోని యాన్ సింగ్ ఎంపికయ్యారు. డిసెంబర్13న లండన్ లో జరిగిన పోటిలలో ఆమెకు 2018 ప్రపంచ సుందరిగా వనేస్సా పొంసే (మెక్సికో) కిరీటం అలంకరించారు.మొదటి రన్నరప్ గా ఒపేలే మేజినో (ప్రాన్స్),రెండో రన్నరప్ గా సుమన్ రావు (భారత్ )నిలిచారు.రెండో రన్నరప్ గా సుమన్ రావుది రాజస్తాన్.ఈ ఏడాది లో జూన్ లో జరిగిన మిస్ ఇండియా పోటిలలో ఆమె విజేతగా నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ సుందరిగా జమైకా యువతీ టోని
ఎవరు: టోని యాన్ సింగ్
ఎక్కడ: లండన్
ఎప్పుడు”: డిసెంబర్ 14
బార్క్ శాస్త్రవేత్తలకు పిఆర్ఎస్ఐ పురస్కారం :

బాబా అణు పరిశోదన సంస్థ (బార్క్ ) సీనియర్ శాస్త్రవేత్త డేనియల్ చెల్లప్పకు భారతీయ ప్రజా సంబందాల సొసైటి(పీఆర్ఎస్ఐ) నాయకత్వ పురస్కారం లబించింది. డిసెంబర్ 13న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమ్మూద్ అలీ ఈ పురస్కారాన్ని అందజేశారు. వృత్తి పరంగానే కాకుండా ,భారత్ లో తయారీ ,స్వచ్చ భరత్ ,పారిశ్రామిక అబివృద్ది ,రైతులు ,మహిళా .గిరిజనులు అభ్యున్నతి తదితరుల కేంద్ర పబుత్వ కార్యక్రమాల్లో ఆయన సేవలు అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బార్క్ శాస్త్రవేత్తలకు పిఆర్ఎస్ఐ పురస్కారం :
ఎవరు: డేనియల్ చెల్లప్ప
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు”: డిసెంబర్ 14
సింధు తాయి ,రామకృష్ణ లకు పిన్నమనేని పౌండేషన్ పురస్కారాలు :

డాక్టర్ పిన్నమనేని ,సీతాదేవి పౌండేషన్ 29 వార్షిక పురస్కారాలను ఈ ఏడాదికి గాను సామజిక కార్య కర్త సింధు తాయి సప్కాల్ ,డాక్టర్ డి .రామకృష్ణ కు ఇవ్వనున్నట్లు పౌండేషన్ మేనజింగ్ ట్రస్టీ డాక్టర్ సి.నాగేశ్వర్ రావు తెలిపారు. డిసెంబర్ 13న విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక .కళారంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సహించాలనే లక్ష్యంతో 28 ఏళ్ళు గా పలువురికి జాతియ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలను అందిస్తున్నాయి అని అన్నారు.ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవానికి ఈ నెల 16 న విజయ వాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సింధు తాయి ,రామకృష్ణ లకు పిన్నమనేని పౌండేషన్ పురస్కారాలు
ఎవరు: సింధు తాయి ,రామకృష్ణ
ఎక్కడ:విజయవాడ(ఏపి)
ఎప్పుడు”: డిసెంబర్ 14
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ పొడుపు అవార్డులు :

2019 జాతీయ విద్యుత్ పొడుపు అవార్డులను తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలు అందుకున్నాయి.ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ విబాగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ తొలి బహుమతిని అందుకుంది. తయారీ విభాగంలో విశాఖ పట్నంలో గ్రాన్యుల్స్ ఒమిని కం. ప్రైవేటే లిమిటెడ్ రెండో బహమతి చేజిక్కించుకుంది.ఇంజీనీరింగ్ ఇన్స్టిట్యూట్/యునివర్సిటి విబాగంలో విజయవాడలోని దక్షిణ మద్య రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ మూడో బహుమతి అందుకుంది. దక్షిణ మద్య రైల్వే కి చెందిన సికిందరాబాద్ లేఖాబవన్ ,కాచిగూడ రైల్వే స్టేషన్ హెరిటేజ్ బిల్డింగ్ కు విద్యుత్ పొడుపు అవార్డులు దక్కాయి. ఆర్డినెన్స్ ప్యాక్టరీల విహాగంలో తెలంగాణలో ని సంగారెడ్డి ఆర్డినెన్స్ ప్యాక్టరీ ప్రథమ బహుమతి గెలుచుకుంది. పాటశాల విద్యార్థుల పెయింటింగ్స్ పోటిలలో తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాధ్యమిక పాటశాల విద్యార్థి బాగా సాయికుమార్ ప్రోత్సాహక బహుమతి గెలుచుకున్నాఋ.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ పొడుపు అవార్డులు
ఎవరు: ఏపి,తెలంగాణా
ఎప్పుడు:డిసెంబర్ 14
డాక్టర్ ప్రత్యూష సుబ్బారావుకు పూలే జీవిత సాపల్య పురస్కారం :

సావిత్రి బాయి పూలే 189 వ జయంతి సందర్బంగా నిస్వార్థ సమాజ సేవకులకు ఆమె పేరిట విశిష్ట సేవా పురస్కారాలను అందించనున్నట్లు సావిత్రి బాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గుదోరు సీత మహాలక్ష్మి తెలిపారు.సావిత్రి బాయి జీవిత సాపల్య పురస్కారానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యుశా సుబ్బారావు ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.కే.ఉమాదేవి.వడ్డీ ఉషారాణి,సి.రేణుకలకు విశిష్ట మహిళా పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు.డాక్టర్ సంపత్ కుమార్ (204సార్లు రక్తదానం ) ,టంగుటూరు రెహమాన్ (82సార్లు రక్తదానం ),యు.వినోద్ బాలు (600 పైగా రక్తదానాల శిబిరాల నిర్వహణ ) కూడా అవార్డుకు ఎంపిక చేశారు. ఇక సావిత్రి బాయి పూలే విశిష్ట సేవా సంస్థ పురస్కారాలను 8 సంస్థలను ఎంపిక చేసినట్లు చెప్పారు.పూలే జయంతి సందర్బంగా జనవరి3న విశాఖ పట్నంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దాక్టర్ ప్రత్యూష సుబ్బారావుకు పూలే జీవిత సాపల్య పురస్కారం
ఎవరు: దాక్టర్ ప్రత్యూష సుబ్బా రావు
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు”: డిసెంబర్ 14
అమెరికన్ చట్టసభ సబ్ కమిటీ చైర్మన్ గా ఆమి బేరా :

అమెరికా చట్టసభల్లో ఒకటైన కాంగ్రెస్ కు చెందిన ఆసియా ది పసిఫిక్ అండ్ నాన్ ప్రోలిపరేషణ్ సబ్ కమిటీ కి భారత సంతతికి చెందిన అమీ బేర చైర్మన్ గా నియమితులయ్యారు.ఇంతకు ముందు ఈ పదవిలో బ్రాండ్ షెర్మాన్ కొనసాగారు.ఈ కమిటీ భారత్ సహా ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని దేశాలతో అమెరికా తరపున రాజకీయ, రక్షణ తదితరుల సంబందాల మెరుగుకు కృషి చేస్తుంది.డెమోక్రటిక్ పార్టికి చెందిన ఆమిబెరా కాలిపోర్నియా నుంచి నాలుగు దపాలుగా అమరికా కు కాంగ్రెస్స్ ప్రాతినిత్యం వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అమెరికన్ చట్టసభ సబ్ కమిటీ చైర్మన్ గా ఆమి బేరా
ఎవరు: ఆమి బేరా
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు”: డిసెంబర్ 14
సింగరేణి సిఎండి శ్రీధర్ కి “ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ “ అవార్డ్ :

సింగరేణి అబివృద్ది రేటుతో నడుపుతూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన సంస్థ సిఎండి .ఎం.శ్రీదర్ గారికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లబించింది.పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఆర్ఎస్ఐ) వారు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లో డిసెంబర్ 13న జరిగిన 41వ ఆలిండియా పిఆర్ఎస్ఐ కాన్ఫరెన్స్ -2019 కార్యక్రమానికి హోమ్ మంత్రి మహమూద్ అలీ ఈ అవార్డును సి.ఎం.డి శ్రీదర్ గారికి ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సింగరేణి సిఎండి శ్రీధర్ కి “ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ “ అవార్డ్ :
ఎవరు: సి.ఎం.డి. శ్రీధర్
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు”: డిసెంబర్ 14
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |