Daily Current Affairs in Telugu -11-12-2019

Daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu -11-12-2019

tsspdcl jlm Online exams

కొత్త దేశంగా “బాగాన్ వీల్”:

మరో కొత్త దేశంగా ఆవిర్బవిన్చబోతోంది.దీని పేరు “బోగాన్ వీల్ “పుపువా న్యు గినియా నుంచి  ఈ దక్షిణ  పసిఫిక్  ప్రాంతం స్వాతంత్ర్య  సాదన  దిశగా నిర్వహించిన రెఫరెండం లో ఘనవిజయం సాధించింది అంటూ డిసెంబర్ 11 న సంబంధిత కమిషన్ చైర్మన్ బెర్జి ఆహ్రెన్ ప్రకటించారు.దీంతో ప్రజలంతా ఆనందంలో మునిగిపోయారు.అయితే ,పుపువా న్యూగినియా  పార్లిమెంటు  ఇందుకు ఆమోద ముద్ర వేయాల్సి వుంది. బోగాన్ వీల్ జనాభా  దాదాపు 3 లక్షలు ఉంటుంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి:

ఎవరు:

ఎక్కడ:

ఎప్పుడు:

టైం” ఈ ఏటి మేటిగా గ్రేటాతేన్ బెర్గ్:

వాతావరణ  మార్పులపై  చర్యలను డిమాండ్ చేస్తూ  ప్రపంచ దేశాదినేతనేతలనే  “మీకెంత ధైర్యం”  అంటూ  ప్రశ్నిచిన పర్యావరణ ఉద్యమకారిణి  గ్రేటా తేన్బెర్గ్ (16) ను ఈ ఏటిమేటి  వ్యక్తిగా టైం మాగజిన్ ప్రకటించింది.2019వ సంవత్సరానికి గాను ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు టైం మాగజిన్  డిసెంబర్ 11న తెలిపింది. ఇప్పటిదాకా ఈ పురస్కారానికి  ఎంపికైన అత్యంత  పిన్న వయస్కురాలు  గ్రేట తెన్ బెర్గ్ అని పేర్కొంది.మరోవైపు భారత్ లోని మణిపూర్ కి చెందిన ఎనిమిదేళ్ళ బాలిక లిం ప్రియ కంగు జామ్ బదికేల్లడం మానేసి మరీ వాతావరణ మార్పులపై  యుద్దానికి సన్నద్దమైంది. ఇదేవిషయాన్నీ  డిసెంబర్ 10న మాడ్రిడ్ లో జరిగిన సదస్సులో వెల్లడించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: “టైం” ఈ ఏటి మేటిగా గ్రేతాతేన్ బెర్గ్

ఎవరు: గ్రేట టెన్బెర్గ్

ఎప్పుడు: డిసెంబర్ 11

భారత్ క్రీడల్లో డోపింగ్ కలకలం:

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతున్న వేల భారత క్రీడా రంగానికి మరోషాక్ !ఒలింపిక్స్ లో పతకాలు సాధించగల అవకాశాలున్న ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారులు డొప్ పరీక్షలో దొరికిపోయారు.బాక్సర్ సుమీర్ సంగ్వాన్ తో పాటు షూటర్ రవికుమార్ నిషేదిత  ఉత్ప్రేరకాలు  వాడినట్లు పరీక్షల్లో తేలింది.2017ఆసియా బాక్సింగ్లో రజతం సాధించడం తో పాటు ఈ ఏడాది జాతీయ చాంపియన్ షిప్ కూడా నిలిచిన 26ఏల్ల సుమీత్ ఒలింపిక్స్ లో కూడా పోటి పడ్డారు. అతను ఎసేటజోలమిడ్ ,అనే నిషేదిత  ఉత్ప్రేరకాన్ని వాడినట్లు తేలింది. 29ఏల్ల రవికుమార్ నిరుడు షూటింగ్  ప్రపంచకప్ లో కామన్ వెళ్త క్రీడల్లో ,2017 లో ఆసియా షూటింగ్ కాంస్యాలు నెగ్గాడు. అతను జూన్ లో ఓ టోర్నీ సందర్త్బంగా  నిర్వహించిన పరీక్షల్లో  ప్రోపనోలాల్ అనే ఉత్ప్రేరకం వాడినట్లు వెల్లడైంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత్ క్రీడల్లో డోపింగ్ కలకలం

ఎవరు:  షూటర్ రవికుమార్, .బాక్సర్  సుమీర్ సంగ్వాన్

ఎక్కడ:: డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 11

పిఎస్ఎల్వి-సి48 ప్రయోగం విజయవంతం:

అంతరిక్ద్ష  ప్రయోగాల్లో మన దేశం మరో మారు సత్తా చాటింది. భారత అంతరిక్ష  పరిశోదన  సంస్థ (ఇస్రో ) పిఎస్ఎల్వి-సి 48 రాకెట్ ద్వారా 10 ఉపగ్రహాలను కక్ష్యలో విజయవంతంగా  ప్రవేశపెట్టింది. ఇస్రో నమ్మిన బంటు  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి) సిరీస్ లో ఇది 50వ ప్రయోగం కావడం గమనార్హం.నేల్ల్లుర్ జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో డిసెంబర్ 11 న సాయంత్రం  ౩.25గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి –సి48 వాహక నౌక నిప్ప్పులు చిమ్ముతూ  నిగికేగిసింది.అనతరం మనదేశానికి చెందిన  రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్సేర్వేషణ్ (రీశాట్ -2బిఆర్1) ఉపగ్రహం తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలకు నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇందులో  అమెరికాకు చెందిన 4,ఇజ్రాయిల్ ,ఇటలి ,జపాన్ లకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి.రీశాట్ -2బీఆర్1 బరువు 628 కిలోలు .ఇది వ్యవసాయం ,అటవీ ,విపత్తు నిర్వహణ  వంటి రంగాల్లో సేవలందించనుంది. దీని జీవిత కాలం ఐదేళ్ళు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఫైఎస్ఎల్వి-సి48 ప్రయోగం విజయవంతం

ఎవరు: ఇస్రో

ఎక్కడ: నెల్లూర్(శ్రీహరి కోట)

ఎప్పుడు: డిసెంబర్ 11

మహబూబ్ నగర్ కలెక్టర్ కు జీపైల్స్ గవర్నన్స్ అవార్డ్ :

వినూత్న పాలనకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ “జి పైల్స్ గవర్నన్స్ 2019” అవార్డును ఎంపికయ్యారు.డిల్లి నుంచి వేలువేదే జిపైల్స్ మాగజిన్ నిర్వాహకులు పాలనలో వినూత్నంగా  సాగుతున్న  అధికారులకు ఏటా ఈ అవార్డు అందజేస్తారు. కాగిత రహిత పాలన దివ్యాన్గుల సంక్షేమానికి చర్యలు ,స్వచ్చ భారత్  ఇంకుడు గంతల  నిర్మాణం ,హరితహారం  తదితర  అంశాల్లో ఆయన  కృషిని గుర్తించి  ఈ అవార్డును ఈ అవార్డుకు ఎంపిక చేశారు.డిసెంబర్ 12 న డిల్లీలో కేంద్ర మంత్రి  గడ్కరి గారి చేతుల మీదుగా  ఆయన అవార్డు అందుకున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: మహబూబ్ నగర్ కలెక్టర్ కు జీపైల్స్ గవర్నన్స్ అవార్డ్

ఎవరు: రోనాల్డ్ రాస్

ఎక్కడ: డిల్లిలో

ఎప్పుడు: డిసెంబర్ 11

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

తెలంగాణ ప్రబుత్వంతో స్విట్జర్లాండ్  ఒప్పందం :

హైదరాబాద్లో జరగనున్న బయో ఏసియ 2020 సదస్సు నిర్వహణలో బాగస్వామ్యం వహించేదుకు స్విట్జర్లాండ్  ముందుకు వచ్చింది.దీనికి సంబంధించి డిసెంబర్ 10 న తెలంగాణ ప్రబుత్వంతో  స్విట్జర్ లాండ్  ప్రబుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బాగస్వామ్య ఒప్పందంపై తెలంగాణా ఐటి ,పరిశ్రమల శాఖ  మంత్రి కే.తారక రామారావు సమక్షంలో స్విట్జర్ లాండ్ కాన్సులేట్ జనరల్ అధికారులు ,రాష్ట్ర ప్రబుత్వ  అధికారులు సంతకం చేశారు. స్విట్జర్లాండ్ డిప్యూటి  కాన్సుల్  జనరల్ సిల్వాన రెంగ్లి ప్రీ ,రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ  ముక్య కార్యదర్శి  జయేష్ రంజన్ ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.ఈ ఒప్పందం సందర్బంగా కేటిఆర్  మాట్లాడుతూ సుమారు  వంద దేశాల నుంచి లైఫ్ సైన్సెస్ దిగ్గజాలను ఆకర్షించడం లో బయో ఆసియా 2020 సదస్సు నిర్వహణలో  స్విట్జర్లాండ్  బాగస్వామ్యం ద్వారా అక్కడి కంపెనీలు ,ప్రబుత్వం తో  బహుముక సంబందాలు  ఏర్పడతాయని వ్యాక్యానించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: తెలంగాణ ప్రబుత్వంతో స్విట్జర్లాండ్  ఒప్పందం

ఎవరు: స్విట్జర్ ల్యాండ్ ప్రబుత్వం

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు:డిసెంబర్ 10

వృద్ది రేటు 5.1శాతమే  :ఎడిబి :

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ది రేటు 5.1 శాతానికి  పరిమితం అవుతుందని  ఏషియన్  డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి) తాజా గా అంచనా వేసింది. తొలుత 7 శాతం వృద్ది రేటు లబిస్తుందని అంచనా వేసిన బ్యాంక్ ,గత సెప్టెంబర్ లో 6.5 శాతానికి తగ్గించింది.ఉద్యోగ నియామకాలు ,గ్రామిన ప్రాంతాల్లో ఒత్తిడి ,సాగు బాగా లేక పోవడం ,రుణ లబ్యత తక్కువగా ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ,వృద్ది రేటు  అంచన ను తాజా గా 5.1 శాతానికి కుదించింది. అయితే  ప్రబుత్వ ప్రోత్సాహక విదానాల వాళ్ళ వచ్చె ఆర్ధిక సంవత్సరంలో వృద్ది రేటు 6.5 శాతఃనికి చేరుతుందని  ఎడిబి అంచనా వేసింది.2020 భారత  వృద్ది రేటు 7.2 శాతం ఉంటుందని  బ్యాంక్  గతంలో  అంచనా వేసింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: వృద్ది రేటు 5.1శాతమే  :ఎడిబి

ఎవరు: ఎడిబి

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 11

ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం :

ఆయుధ సవరణ బిల్లు 2019 కు డిసెంబర్ 10న రాజ్యసభ ఆమోదం తెలిపింది డిసెంబర్ 09న లోక్ సభ ఆమోదించింది.ఈ బిల్లు ప్రకారం నిర్లక్ష్యంగా మనుషులకు ప్రాణహాని కలిగేల ఆయుధాన్ని ఉపయోగిస్తే  రెండేళ్ళ జైలు ,లక్ష జరీమాన విధిస్తారు. ఒక వ్యక్తి  ఇప్పటివరకు  అత్యదికంగా  మూడు తుపాకులు ,లేదా సంబంధిత  ఆయుధాలను కలిగి ఉండే అవకాశం ఉండగా ,ఇకపై అత్యధికంగా  రెండు మాత్రమె కలిగే ప్రతిపాదనను ఈ బిల్లు లో చేర్చారు.ఈ బిల్లు పై చర్చ సందర్బంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన ప్రాచిన ఆయుధాలను నిరుపయోగం చేసే ఎన్నైనా బద్రపరుచుకోవచ్చని తెలిపారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఎవరు: రాజ్యసభ

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 10

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *