
Daily Current Affairs in Telugu -01-12-2019
ఆమె పేరు దిశ గా మార్పు

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద దారుణ హత్యాచారానికి గురైన యువ వైద్యురాలి పేరును దిశగా మారుస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు. ఇక మీడియా, సామాజిక మాధ్యమాలు, దస్త్రాల్లో ఆమె అసలు పేరును కాకుండా “జస్టిస్ ఫర్ దిశ” గా అని నమోదు చేయనున్న్నట్లు సైబరాబాద్ కమిషనర్ వి.సజ్జనార్ డిసెంబర్ 01 న ఒక ప్రకటనలో పేర్కొన్న్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆమె పేరు దిశ గా మార్పు
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 01
“నాడు –నేడు“ కార్యక్రమం పిఎంయూ అధిపతిగా పీటర్

ప్రబుత్వ పాటశాల ఆసుపత్రులలో “నాడు-నేడు“ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు కార్యక్రమ పర్యవేక్షణ విభాగం (పిఎంయూ) ను ప్రబుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఎన్.ఎ.సి మాజీ డిజి, అర్.అండ్.బి విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ ను అధిపతిగా నియమించింది. ఈ విభాగం నాడు-నేడు కార్యక్రమం కింద ఆరోగ్య పాటశాల విద్య , ఉన్నత, నైపున్యాబివ్రుద్ధి శాఖలు చేపట్టే పనుల్లో టెండర్లు ప్రక్రియ సేకరణ తీరు, పనుల విభజన, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. పనుల్లో పారదర్శకత ఉండేలా చూడడంతో పాటు సకాలంలో పూర్తి సహకారం అందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: “నాడు –నేడు“ పిఎంయూ అధిపతిగా పీటర్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎవరు: ఎఫ్.సి.ఎస్ పీటర్
ఎప్పుడు: డిసెంబర్ 01
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కప్ విజేత-కర్నాటక జట్టు:

దేశవాళి టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపికి ఈ సీజన్లో సిసలైన ముగింపు లబించింది. హోరాహోరిగా సాగుతూ తీవ్ర ఉత్కంట రేపిన పైనల్ మ్యాచ్ లో కర్నాటక విజయం సాధించింది. డిసెంబర్ 01 జరిగిన మ్యాచ్లో చివరి బంతికి పలితం తేలిన తుది పోరులో కర్నాటక ఒక్క పరుగు తేడాతో తమిళనాడు పై విజయం సాధించింది. మొదట బాటింగ్ చేసిన కర్నాటక 20 ఓవర్లలో5 వికెట్లకు గాను 180 పరుగులు చేసింది. అనంతరం తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్లకు గాను 179 పరుగులు చేసి ఒక్క పరుగు తేడా తో ఓటమి పాలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కప్ కర్నాటక జట్టుదే
ఎక్కడ: సూరత్
ఎవరు: కర్నాటక జట్టు
“ప్రతి చెరువుకు స్వరం ఉంటుంది “లఘు చిత్రానికి జాతీయ పురస్కారం :

ఎప్పుడు: డిసెంబర్ 01
కాలుష్య అంశంపై కేంద్ర పర్యావరన అటవీ ,వాతావరణ మార్పులు శాఖ సి.ఎం.ఎస్ వాతావరనణ సంయుక్తంగా నిర్వహించిన పోటిలలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకు;లు రూపొందించిన లఘు చిత్రానికి ద్వితీయ స్థానం దక్కింది. నిర్మాత సునిల్ సత్యవోలు, దర్శకుడు అన్షుల్ సిన్హా లకు కేంద్ర పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్ ఈ ట్రోపి ,రూ.లక్ష నగదు, దృవపత్రంను అందచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రతి చెరువుకు స్వరం ఉంటుంది లఘు చిత్రానికి జాతీయ పురస్కారం
ఎక్కడ: డిల్లి
ఎవరు: నిర్మాత సునీల్ సత్యవోలు , దర్శకుడు అన్షుల్ సిన్హా
ఎప్పుడు:డిసెంబర్ 01
2019 జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత మలయాళీ కవి అక్కితం

భారత దేశం లోనే సాహిత్య రంఘం లో ఇచ్చే అత్యన్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ పురస్కారం 2019 గాను మలయాళీ కవి అక్కితమ్ ను ఎంపిక చేసినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డ్ చైర్మన్ ప్రతిభా నవంబర్ 29న ప్రకటించారు. మళయాళ సాహితీ వేత్తలలో ప్రముకుడైన అక్కితమ్ కేరళలోని పాలక్కద్ జిల్లాలోని కుమారనేల్లోర్ లో 1926,మార్చ్ 18న జన్మించారు.అక్కితం కవితలతో పాటు విప్లవాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యాలు, కథలు అనువాదాల్లోను తనదైన ముద్రవేశారు. ఇప్పటి వరకు అక్కితం 55 వరకు పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించి ప్రబుత్వం 2017 లో ఆయనకు పద్మశ్రీ అవార్డ్ అందించింది. సాహిత్య అకాడమి అవార్డ్, కబీర్ సమ్మాన్ అవార్డ్ వంటి పురస్కరాలను అక్కితం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2019 జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత మలయాళీ కవి అక్కితం
ఎక్కడ: కేరళ
ఎవరు: అక్కితం
ఎప్పుడు: నవంబర్ 29
4.5 శాతం గా దేశ వృద్ది రేటు :ఎన్ఎస్ఓ

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2019-2020) రెండవ త్త్రైమాసికంలో (జులై –సెప్టెంబర్) దేశ స్తూల దేశీయోత్పత్తి (జిడిపి)వృద్ది రేటు కేవలం 4.5 శాతం గా నమోదయింది. గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) నవంబర్ 29 న విడుదల చేసిన గణాంకాలలో ఈ విషయం వెల్లడైనది గడిచిన ఆరు సంవత్సరాల్లో వృద్ది వేగం ఇంత తక్కువ స్థాయి కి పడిపోవడం ఇదే తొలి సారి 2012-13 జనవరి మార్చి త్రైమాసికంలో 4.3 శాతం నమోదయ్యింది
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
క్విక్ రివ్యూ:
ఏమిటి4.5 శాతం గా దేశ వృద్ది రేటు :ఎన్ఎస్ఓ
ఎవరు: ఎన్ఎస్ఓ
ఎప్పుడు: నవంబర్ 29
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |