
Daily Current Affairs in Telugu -23-12-2019
విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా హర్షవర్దన్ :

భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా హర్షవర్దన్ శ్రింగ్లా నియమితులయ్యారు.కేంద్ర సిబ్బంది శాఖ డిసెంబర్ 23న ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపింది, శ్రింగ్లా ప్రస్తుతం అమెరికాలోని భారత రాయబారిగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన నియామకానికి కేబినేట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది.1984 ఐఎఫ్ఎస్ అధికారుల బ్యాచ్ కు చెందిన శ్రింగ్లా జనవరి 29న తేదిన నూతన బాద్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఇదే బాద్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ కేశవ్ గోఖలే రెండేళ్ళ పదవీకాలం జనవరి 28న తేదిలో ముగుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా హర్షవర్దన్ :
ఎవరు: హర్షవర్దన్ శ్రింగ్లా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 23
పిక్కి అధ్యక్షురాలిగా సంగీత రెడ్డి :

అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండి సంగీత రెడ్డి పిక్కి పెడరేషణ్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ) అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.ఇప్పటి వరకు అద్యక్ష పదవిలో హెచ్ ఎస్ఐఎల్ సిఎండి సందీప్ సోమని ఉన్నారు. ఆయన స్థానంలో సంగీత రెడ్డి బాద్యతలు చేపట్టారు.ఆమె ఒక ఏడాది కాలం పాటు ఈ పదవిలో ఉంటారు. డిస్నీ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ పిక్కి సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు.హెచ్ యూఎల్ సిఎండి సంజీవ్ మెహతా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పిక్కి అధ్యక్షురాలిగా సంగీత రెడ్డి :
ఎవరు: సంగీత రెడ్డి
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 23
బోయింగ్ కొత్త సియిఓ గా చైర్ డేవిడ్ :

విమాన తయారీ సంస్థ బోయింగ్ చీఫ్ ఎగ్సిక్యుటివ్ గా ,ప్రెసిడెంట్ గా బోర్డ్ చైర్మన్ చైర్ డేవిడ్ కాల్హౌస్ నియమితులయ్యారు.737 మ్యాక్స్ సంక్షోబంలో నుంచి బయట పడేందుకు చీఫ్ ఎగ్సిక్యుటివ్ పదవి నుంచి డెన్నిస్ ములేన్ బర్గ్ ను తొలగించినట్లు సంస్థ ప్రకటించింది. ములేన్ బర్గ్ తన బాద్యతలు నుంచి ఇప్పుడే తప్పుకుంటున్న కాల్హౌస్ మాత్రం 2020 జనవరి 13 న బద్యతాలు చేపడతారు. ఈ మద్య కాలంలో ముఖ్య ఆర్ధిక అధికారి గ్రెగ్ స్మిత్ తాత్కాలిక సియివో గా వ్యవహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బోయింగ్ కొత్త సియిఓ గా చైర్ డేవిడ్
ఎవరు: చైర్ డేవిడ్
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు: డిసెంబర్ 23
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఇద్దరు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులకు జాతీయ ఎంఐసిటి అవార్డులు:

విద్యా బోదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా ప్రతిబా వంతంగా వినియోగించడంలో విశేష కృషి చేసిన 43 మంది ఉపాద్యాయులకు కేంద్రప్రబుత్వం జాతీయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ (ఎన్ఐసిటి) -2017 అవార్డులను అందజేసింది. డిల్లీలో డిసెంబర్ 23న ఏర్పాటు చేసిన కార్యక్రమంలోకేంద్రమానవ వనరుల అబివృద్ది శాఖ సహాయమంత్రి సంజయ్ దోత్రే పురస్కారాలను ప్రదానం చేశారు.రాష్ట్రానికి సంబంధించి చిలుక ఉమా రాణి ,దేవునపల్లి నాగరాజు కు కేంద్ర సహాయ మంత్రి నుంచి అవార్డులు స్వీకరించారు.పురస్కార గ్రహీతలకు ల్యాప్ టప్ ,రజత పథకం ,ఐసిటి కిట్ ప్రశంశా పత్రం అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇద్దరు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులకు జాతీయ ఎంఐసిటి అవార్డులు:
ఎవరు: చిలుక ఉమా రాణి ,దేవునపల్లి నాగరాజు
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 23
మహారాష్ట్ర లో మహాత్మా జ్యోతిరావు పూలే పథకం:

మహారాష్ట్ర ప్రబుత్వం ఆ రాష్ట్ర రైతులాకు తీపి కబురు అందించిది. లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ తాక్రే డిసెంబర్ 21న ప్రకటించారు.2019 సెప్టెంబర్ 30 వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు చెప్పారు.ఈ రుణ మాఫీ కి మహాత్మా జ్యోతి రావు పూలే రైతు రుణ మాఫీ పతకంగా పేరు పెట్టారు. దీని వల్ల రూ.40 వేల కోట్ల భారం ప్రబుత్వం పై పడే అవకశం ఉందని అంచనా వేస్తున్నారు. 2017 లో అప్పటి బిజేపి –శివసేన ప్రబుత్వం 50లక్షల మంది రైతులకు చెందిన రూ.19వేల కోట్ల రుణాలను చెల్లించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మహారాష్ట్ర లో మహాత్మా జ్యోతిరావు పూలే పథకం:
ఎక్కడ: మహారాష్ట్ర
ఎప్పుడు: డిసెంబర్ 23
పోలీస్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో సి.పి ఆనంద్:

ఆలిండియ పోలీస్ టెన్నిస్ చాంపియన్ షిప్లో తెలంగాణ సీనియర్ ఐపిఎస్ అధికారి ,సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) సిపి ఆనంద్ కు టైటిల్ లబించింది.విశాఖ పట్నంలో డిసెంబర్ 22 న ముగిసిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విబాగం పైనల్లో సిఐఎస్ఎఫ్ తరపున దిగిన ఆనంద్ 8-4 తో సత్యనరాయణ (ఆంద్ర ప్రదేశ్ )పై విజయం సాధించారు.గత 20ఏళ్లలో ఆలిండియ పోలీస్ టెన్నిస్ చాంపియన్ షిప్లో సెంట్రల్ ఇండస్త్రియల్ సెక్యూరిటీ పోర్స్ (సిఐఎస్ఎఫ్)కు ఒక విభాగం లో టైటిల్ లబించడం ఇదే ప్రథమం , ఈ టోర్నిలో టీం చాంపియన్ షిప్ విబాగంలో సిఆర్పిఎఫ్ జట్టు విజేతగా నిలిచింది. పైనల్లో ఐటిబిపి పై సిఆర్పిఎఫ్ గెలిచింది.నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పోటిలలో 19 జట్ల నుంచి 103 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా వచ్చి విజేతలను ట్రోపిలు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పోలీస్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో సి.పి ఆనంద్:
ఎవరు: సి.పి ఆనంద్:
ఎక్కడ: విశాఖ పట్నం (ఎపి)
ఎప్పుడు: డిసెంబర్ 23
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |