Daily Current Affairs in Telugu 20-05-2020
డబ్ల్యుహెచ్వో అసెంబ్లీలో 2 బిలియన్ డాలర్ల సహాయం ప్రకటించిన చైనా :

WHO అసెంబ్లీ లో కరోనా వైరస్ మహమ్మారి పై పోరాడటానికి రెండు సంవత్సరాల్లో 2 బిలియన్ డాలర్ల ను అందిస్తున్నట్లు చైనా ప్రకటించంది.ముఖ్యంగా అబివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిద్-19 ప్రతిస్పందన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం కోసం. ప్రస్తుత కొన్ని దేశాలలో ఉన్న లాక్ డౌన్ వలన చైనా పై పెరుతున్న ప్రపంచ ఒత్తిడి ని ఎదుర్కొంటున్న నేపద్యం లో మరణాల సంఖ్య మరియు కరోన వైరస్ కేసులలో భారీ పెరుగుదల ప్రపంచాన్ని నిలిపివేసిన తరువాత ఈనిర్ణయం చైనా నుంచి వచ్చింది. కరోన వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్త ఆరోగ్య అత్యవసరమని జనవరి 30న WHO ప్రకటించింది. ఇది వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని చంపిన తరువాత మార్చి 11 మహమ్మారి వైరస్ గా ప్రకటించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి; డబ్ల్యుహెచ్ వో అసెంబ్లీలో 2 బిలియన్ డాలర్ల సహాయం ప్రకటించిన చైనా
ఎవరు: చైనా
ఎప్పుడు: మే 20
2019 అలెక్సాండర్ దాల్రింపిల్ అవార్డును గెలుచుకున్న వైస్ అడ్మిరల్ వినయ్ బాద్వార్ :

భారత ప్రభుత్వానికి జాతీయ హైడ్రో గ్రాఫర్ వైస్ అడ్మిరల్ అయిన వినయ్ బాద్వార్ కు భారత హైడ్రోగ్రఫీకి మరియు విస్తృత హిందు మహాసముద్రం ప్రాంతానికి చేసిన కృషికి 2019 అలేక్సండర్ దాల్రింపిల్ అవార్డుతో సత్కరించారు . ఈ అవార్డును యుకె రక్షణ మంత్రిత్వ శాఖ అందజేసింది. ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోగ్రఫి కార్డో గ్రాఫి మరియు నావిగేషన్ ప్రమాణాలను పెంచడంలో గాను ఆయన చేసిన కృషికి యుకె హైడ్రోగ్రఫిక్ ఆఫీస్ (యుకేహెచ్ ఓ) యొక్క చీఫ్ కమిటీ ఈ అవార్డు గ్రహేతలను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి; 2019 అలెక్సాందర్ దాల్రింపిల్ అవార్డును గెలుచుకున్న వైస్ అడ్మిరల్ వినయ్ బాద్వార్
ఎక్కడ: న్యుడిల్లి
ఎవరు: వైస్ అడ్మిరల్ వినయ్ బాద్వార్
ఎప్పుడు: మే 20
పాలస్తీనా శరణార్థులసంక్షేమం కోసం యుఎన్ ఏజన్సీకి 2మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించిన భారత్ :

పాలస్తీనా శారనార్తుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి రిలీఫ్ ఫండ్ వర్క్స్ ఏజన్సికి భారత్ 2 మిలియన్ డాలర్ల సహయం ను అందించింది. కరోనా వైరస్ సంక్షోభం మద్య విద్య మరియు ఆరోగ్యంతో సహా UNRWA కోర్ కార్యక్రమాలు మరియు సేవలకు ఈ సహాయం ఇవ్వబడుతుంది. 2019 లో భారతదేశం యుఎన్ ఆర్.డబ్ల్యు.ఏ కు వార్షిక సహకారాన్ని 1.25 మిలియన్ డాలర్లకు (రూ.37కోట్లు ) పెంచింది. ఈ సహకారాన్ని ఐక్యరాజ్యసమితి ఏజెన్సి కి భారత ప్రతినిధి (ఆర్ఓఐ) అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి; పాలస్తీనా శరణార్థుల సంక్షేమం కోసం యుఎన్ ఏజన్సీ కి 2మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించిన భారతదేశం
ఎవరు: భారతదేశం
ఎప్పుడు: మే 20
లెసోతో ప్రదాన మంత్రి అయిన థామస్ తబానే రాజీనామా:

థామస్ తబానే అధికారంగా లెసోతో ప్రదాని పదవికి రాజీనామా చేశారు. తబానే మరియు అతని ప్రస్తుత బార్య దాదాపు మూడు సంవత్సరాల క్రితం తన మాజీ భార్యను హత్య చేయడానికి కుట్ర పన్నారని అనుమానిస్తున్నారు. తన మాజీ భార్య హత్య కేసులో నిందితుడిగా పేరు పొందడంతో థామస్ తబానే నెల రోజుల ఒత్తడి తరువాత అధికారంగా లెసోతో ప్రదాని పదవి నుంచి వైదొలిగారు.లెసోతో ఆర్ధికమంత్రి అయిన మొకేత్సి మజరోను పార్లమెంటు దేశ తాత్కాలిక ప్రధాన మంత్రిగా పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి; లెసోతో ప్రదాన మంత్రి అయిన థామస్ తబానే రాజీనామా
ఎక్కడ: లెసోతో
ఎవరు: థామస్ తబానే
ఎప్పుడు: మే 20
కరోనా టీకా అబివృద్ధి కోసం థామస్ జేపర్సన్ వర్శిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం :

కోవిద్ -19 వ్యాధికి టీకా అబివృద్ది చేయటంలో హైదరబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ యుఎస్ఎ లోని ఫిలడేల్పియా లో ఉన్న థామస్ జేపర్సన్ యునివర్సిటితో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ ఇక్కడ వెల్లడించింది. ఇనాక్టివేటేడ్ రేబిస్ వెక్టార్ ఫ్లాట్ ఫాం ను ఉపయోగించి కోవిద్-19 టీకా అబివృద్ది చేయడానికి యునివర్సిటీతో చేతులు కలిపినట్లు భారత్ బయోటెక్ సియివో డాక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం టీకాను అబివృద్ది చేయటమే కాకుండా యుఎస్,ఐరోపా,జపాన్, తదితర దేశాల్లో విక్రయించే హక్కులు లబిస్తాయి. టీకాల తయారీ విభాగం లో అగ్రగామిగా ఉన్నందున భారత్ భారత్ బయోటెక్ తో భాగస్వామ్యానికి తాము సిద్దపడినట్లు జెఫర్సన్ ఇన్నోవేషన్ ప్రతినిధి డాక్టర్ రోస్ రిత్స్ వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి; కరోనా టీకా అబివృద్ధి కోసం థామస్ జేపర్సన్ వర్శిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం
ఎవరు: భారత్ బయోటెక్
ఎప్పుడు: మే 20
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |