
Daily Current Affairs in Telugu 30-12-2019
ఆర్థిక అబివ్రుద్దిలో,అసమానతల తొలగింపులో దేశంలో తొలి స్థానం తెలంగాణ:

ఆర్ధిక వృద్ది,అసమానతల తగ్గింపులో దేశంలోనే తెలంగాణా అగ్ర స్థానంలో నిలిచింది. లింగ వివక్ష మాత్రం తీవ్రంగా ఉంది.ఆహార బద్రత లోను రాష్ట్రం వెనుకబాటు లో ఉంది.నీతి అయోగ్ డిసెంబర్ 30న విడుదల చేసిన సుస్థిర అబివృద్ధి లక్ష్యాల సూచిక -2019-20 లో అన్నివిభాగాల్లో కలిపి తెలంగాణా దేశంలోనే అయిదో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు కంటే మెరుగైన స్థానంలో ఉంది.జాతీయ సగటు 60పాయింట్లు కాగా తెలంగాణా 67పాయింట్లు ను సాధించింది.జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పనా పెరిగింది.ప్రసూతి మరణాల రేటు తగ్గింది.
- ఆర్ధిక వృద్దిలో అగ్రస్థానంలో తెలంగాణ (82 పాయింట్లు)
- అసమానతల తగ్గింపులో (94 పాయింట్లు) ప్రథమస్థానం
- చౌక ,శుద్ధ ఇందనం (కిలిన్ ఏనార్గి )లో మూడో స్థానం(93 పాయింట్లు)
- మంచి ఆరోగ్యం శ్రేయస్సులో (66పాయింట్లు) తో 10వ స్థానం
- నాణ్యమైన వ్బిద్యలో 11వ స్థానం(61 పాయిట్లు)
- పేదరక నిర్మూలన లో 13వ స్థానం (52వ స్థానం ) స్వచ్చమైన నీరు, పరిశుబ్రతలో 13వ స్థానం (84 పాయింట్లు)
- ఆహార బద్రత లో 18వ స్థానం (37వ స్థానం )
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆర్థక అబివ్రుద్దిలో ,అసమానతల తొలగింపులో దేశంలో తొలి స్థానం తెలంగాణ
ఎవరు: తెలంగాణ
ఎప్పుడు: డిసెంబర్30
దేశ తొలి సిడిఎస్ గా బిపిన్ రావత్ నియామకం:

దశాబ్దాల నిరీక్షణ తర్వాత దేశ రక్షణ రంగంలో కీలక సంస్కరణ చోటుచేసుకుంది. దేశ తొలి త్రిదళాదిపతిగా (సిడిఎస్) గా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు.డిసెంబర్ 31నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది ఈ మేరకు డిసెంబర్ 30న ఒక నోటిఫికేషన్ వెలువడింది సిడిఎస్ హోదాలో ఆయన కొత్తగా ఏర్పాటు అయ్యే సైనిక వ్యవహారాల విబాగానికి నాయకత్వం వహించారు.మూడేళ్ళ పాటు ఈ పదవిలో ఉంటారు.గరిష్టంగా 65ఏళ్ళు వచ్చే వరకు సిడిఎస్ తన పదవిలో కొనసాగే వీలు కలిగింది.1999 లో కార్గిల్ యుద్ధం అనంతరం దేశ రక్షణ విధానాల్లో లోపాలను పరిశీలించేందుకు ఏర్పడ్డ అత్యున్నత స్థాయి కమిటీ సూచనల మేఅకు సిడిఎస్ పదవి తేర మీదకు వచ్చింది.సిడిఎస్ పదవిని సృష్టించేదుకు బద్రత వ్యవహారాలను కేబినేట్ కమిటీ (సిసిఎస్) ఇటీవల ఆమోదం తెలిపింది.రావత్ స్థానంలో సైన్యం లో సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జజరాల్ మనోజ్ ముకుంద్ సవరనే డిసెంబర్ 31న బాద్తలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన సైనిక దళాల ఉపదలదిపతిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దేశ తొలి సిడిఎస్ గా బిపిన్ రావత్ నియామకం
ఎవరు: బిపిన్ రావత్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: : డిసెంబర్30
ప్రపంచ బ్లిట్జ్ చెస్ పురుషుల టోర్నీ టైటిల్ విజేత మాగ్నస్ కార్ల్ సన్:

మాగ్నస్ కార్ల్ సన్ హ్యాట్రిక్ కొట్టాడు ఇప్పటికే ప్రపంచ క్లాసిక్ విజేతగా నిలిచిన అతను తాజాగా ర్యాపిడ్తో పాటు బ్లిట్జ్ టోర్నీలో ను టైటిల్ కైవసం చేసుకుంది. బ్లిట్జ్ లో 21రౌండ్లలో 14.5పాయింట్లతో కార్ల్ సన్ అగ్ర స్థానంలో నిలిచాడు. అమ్మాయిల విభాగంలో ప్రపంచ బ్లిట్జ్ చెస్ టోర్నీ విజేత గా లాగ్ నో కేతరినా (రష్యా ,12.5) చాంపియన్ గా నిలిచింది.భారత్ తరపున ఆడిన కోనేరు హంపి నాలుగో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ బ్లిట్జ్ చెస్ పురుషుల టోర్నీ టైటిల్ విజేత మాగ్నస్ కార్ల్ సన్
ఎవరు: మాగ్నస్ కార్ల్ సన్
ఎక్కడ: మాస్కో
ఎప్పుడు: డిసెంబర్30
సుస్థిర అబివృద్ది లక్ష్యాల సాధనలో కేరళ మొదటి స్థానం :

సుస్థిర అబివృద్ది లక్ష్యాల (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్ డిజి ) సాధనలో కలిసి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మూడో స్థానంలో నిలిచాయి.కేరళ ప్రథమ స్థానాన్ని హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానాన్ని పొందాయి.ఎస్ డి జి భారత సూఛికలు -2019 పేరుతో నీతి అయోగ్ డిసెంబర్ 30న విడుదల చేసిన నివేదికలో ఈ విషయమ వెల్లడించింది. లక్ష్య సాధనలో కేరళకు 70మార్కులు ,హిమాచల్ ప్రదేశ్ 69,ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణా,తమిళనాడు లకు 67 మార్కులు వంతున వచ్చాయి. బిహార్ ,జార్కండ్,అరుణాచల్ ప్రదేశ్ లు అట్టడుగున నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సుస్థిర అబివృద్ది లక్ష్యాల సాధనలో కేరళ మొదటి స్థానం
ఎవరు: నీతి అయోగ్
ఎక్కడ:
ఎప్పుడు: డిసెంబర్30
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో మొదటి స్థానం కర్ణాటక రాష్ట్రం:

అటవీ విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే మొదటి స్థానంలో కర్నాటక రాష్ట్రం , ఆంద్ర ప్రదేశ్ రెండో స్థానంలో,మూడో స్థానలో కేరళ రాష్ట్రం నిలిచింది. అయితే ఓ మాదిరి దట్టమైన అటవీ విస్తీర్ణం తగ్గింది 2017తో పోలిస్తే 2019 లో ఈ తరహా అటవీ విస్తీర్ణం 113చ.కిమీ మేర తగ్గింది. అత్యంత దట్టమైన (70% కు మించి చెట్ల సాంద్రత) ఓ మాదిరి దట్టమైన (40%-70% చెట్ల సాంద్రత ) అటవీ విస్తేర్ణం పెరగాలి.కాని 2015-17 మద్య అత్యంత దట్టమైన అటవీ విస్తీర్ణం 1536 చ.కి.మీ. పెరగ్గా 2017-19 మద్య 37 చ.కి.మీ. మాత్రమె వృద్ది చెందింది. అత్యధిక వృక్షజాతులు కలిగిన రాష్ట్రా;ల జాబితాలో ఆంద్ర ప్రదేశ్ మూడో స్థానం లో ఉంది .2019సంవత్సరానికి సంబంధించి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల గణాంకాలు చెపుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అటవీ విస్తీర్ణం పెరుగుదలలో మొదటి స్థానం కర్ణాటక రాష్ట్రం
ఎవరు: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా
ఎప్పుడు: డిసెంబర్30
క్లైవ్ లాడ్ కు నైట్ హుడ్ పురస్కారం :

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ను బ్రిటిష్ అత్యత్తమ పురస్కారం నైట్ హుడ్ వరించింది.లాయిడ్ కు ఈ అవార్డును అందజేయనున్నట్లు న్యు ఇయర్ ఆనర్స్ సర్ బిరుదును సొంతం చేసుకున్న విండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్ ,ఎవర్తీస్ వీక్స్ ,వివి ఎస్ రిచర్డ్ సన్ సరసన క్లైవ్ లాయిడ్ నిలవ బోతున్నాడు.క్లైవ్ హ్యుబర్తో లాయిడ్ 1994 లో గయాన లో జన్మించాడు. 22ఎల్ల వయస్సులో భారత లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్ లోకి అరంగ్రేటం చేసాడు. మొత్తం 110టెస్టుల్లో 46పైగా సగటుతో 7515 పరుగులు చేశాడు. అలాగే 87 వన్డే మాచ్లో 1977 పరుగులు సాధించాడు. 1975,1979 లో వన్డే ప్రపంచ కప్ ను గెలిచినా వెస్టిండీస్ జట్టుకు సారద్యం వహించాడు. 1985చివరి మ్యాచ్ ఆడాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: క్లైవ్ లాడ్ కు నైట్ హుడ్ పురస్కారం
ఎవరు: క్లైవ్ లాయిడ్
ఎక్కడ: వెస్టిండీస్
ఎప్పుడు: డిసెంబర్30