Daily Current Affairs in Telugu -02-12-2019

daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -02-12-2019

rrb ntpc online exams in telugu

నౌక దళంలో చేరిన తొలి మహిళా పైలట్ శివాంగి:

భారత నౌకా దళంలో చేరిన తొలి మహిళ  పైలట్ గా  సబ్ లేఫ్టినెంట్ గా శివాంగి చరిత్ర  సృష్టించారు. కోచిలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె డిసెంబర్ 02న నౌకాదళంలో చేరారని రక్షణ శాఖ అధికార  ప్రతినిధి చెప్పారు. ఆమె దొర్నియర్ నిఘా విమానాన్ని నడుపుతారు. శివాంగి స్వస్థలం బిహార్ లోని ముజఫర్పూర్.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  నౌక దళంలో చేరిన తొలి మహిళా పైలట్ శివంగి

ఎవరు: శివంగి

ఎప్పుడు: డిసెంబర్ 02

విజయవాడ  రైవే స్టేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు:

విజయవాడ రైల్వే స్టేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది. రైల్వే స్టేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది. రైల్వే స్టేషన్ ను పర్యావరణ  హితంగా,ప్రయాణికులకు మెరుగైన  సేవలు అందిస్తున్నందుకు  రైల్వే స్టేషన్ కు  ఐఎస్ఓ  14001:2015 దృవపత్రం వచ్చింది. నేషనల్ అక్రిడిటెషన్ బోర్డ్ ఫర్ సర్తిఫికేట్ వెరిఫికేషన్  బాడీస్ (ఎస్ఎబిసిబీ) గుర్తింపు పొందిన వెక్సిల్ బిపీస్ సంస్థ ఈ ధ్రువ పత్రాన్ని డిసెంబర్ 02 న జారీ చేసింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: విజయవాడ  రైవే స్టేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు

ఎక్కడ: విజయవాడ

ఎవరు: ఐఎస్ఓ

ఎప్పుడు: డిసెంబర్ 02

దక్షిణాసియ క్రీడల్లో భారత్ కు 3 స్వర్ణాలు :

దక్షిణ ఆసియా క్రీడలు (సాగ్)లో భారత్ ఆదరగోట్టింది.డిసెంబర్ 02న ఒక్క బ్యాడ్మింటన్ లోనే రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది బ్యాడ్మింటన్ పురుషుల టీం విభాగంలో కిధాంబి శ్రీకాంత్ నేతృత్వంలో భారత్  పైనల్లో 3-1 తో శ్రీలంక కు ఓడించి పసిడి గెలిచింది. మహిళల టీం తుది సమరంలో భారత్ 3-0 తో లంకను చిత్తు చేసింది. పురషుల ట్రయత్లాన్ వ్యక్తిగత విభాగంలో ఆదర్శ సినిమోల్  స్వర్ణం గెలిచాడు. భారత్ రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. సరోజినీ రజతం ,ప్రజ్ఞ కాంస్యం  నెగ్గారు

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత్ కు 3 స్వర్ణాలు :

ఎక్కడ: నేపాల్

ఎప్పుడు: డిసెంబర్ 02

అంజలి (6/0) బౌలింగ్ తో మహిళల టి20 లలో ప్రపంచ రికార్డ్:

నేపాలి మహిళా పేసర్ అంజలి చాంద్ (6/0) సంచలన బౌలింగ్ తో చరిత్ర సృష్టించాడు.మహిళల టి20 క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఆమె మలేసియ బౌలర్ ఎలిసా (6/3) రేకార్డ్ ను బద్దలు కొట్టింది. ఒక్క పరుగు ఇవ్వకుండానే ఆరు వికెట్లు పడగొట్టిన అంజలి అంతర్జాతియ క్రికెట్లో (మహిళల, పురుషుల) ఆ ఘనత  సాధించిన ఏకైక బౌలర్ గాను నిలిచింది. ఆ ఆరు వికెట్లులో చివరి మూడు హాట్రిక్ రూపంలో దక్కాయి. డిసెంబర్02 న జరిగిన దక్షిణాసియా క్రీడల్లో బాగంగా  నేపాల్, మాల్దీవులు  జట్ల మద్య  జరిగిన టి 20 మ్యాచ్లో ఈ అద్బుతం చోటు చేసుకుంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అంజలి (6/0) బౌలింగ్ తో మహిళల టి20 లలో ప్రపంచ రికార్డ్

ఎక్కడ: నేపాల్

ఎవరు: అంజలి చాంద్

ఎప్పుడు: డిసెంబర్ 02

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

డ్రీంవర్శిటీ గా వరంగల్ చైతన్య కళాశాల :

వరంగల్ జిల్లా హన్మకొండ లోని చైతన్య  గ్రూపు విద్యాసంస్థలకు డ్రీమ్డ్ విశ్వవిద్యాలయం  హోదా దక్కింది. ఈ మేరకు కేంద్ర మనవ వనరుల శాఖ  నోటిఫికేషన్ జారి చేసింది. యు.జి.సి స్వయం ప్రతిపత్తి గల  హోదా సాధించడమే  కాకుండా  న్యాక్ “ఎ” గ్రేడ్  పొందిన ఈ కళాశాల 2017 మార్చిలో డీమ్డ్ వర్శిటీ  స్థాయి కోసం  యు.జి.సి  నియమించిన  నిపుణుల కమిటీ  2018 డిసెంబర్ లో కళాశాలను సందర్శంచి  కేంద్ర మానవ వనరుల శాఖకు  సిపారసు చేసింది. ఈ క్రమలోనే  డీమ్డ్ హోదాను  కేంద్రం ప్రకటించింది.దేశంలో 2010  తర్వాత డీమ్డ్ విశ్వ విద్యాలయం  హోదాను దక్కిచుకున్న మూడు నాలుగు  విద్యాసంస్థల్లో  ఇదొకటి కాగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు  తర్వాత ఏర్పటవనున్న మొదటిది .

క్విక్ రివ్యూ:

ఏమిటి: డ్రీంవర్శిటీ గా వరంగల్ చైతన్య కళాశాల

ఎక్కడ: వరంగల్

ఎప్పుడు: డిసెంబర్ 02

సయ్యద్ మోధీ ఓపెన్ టోర్నీ రన్నరప్ గా సౌరబ్:

సయ్యద్ మోది ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ -300 టోర్నిలో భారత షట్లర్ సౌరబ్ వర్మ రన్నరప్ గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్  రాజదాని లక్నో లో దేసెంబెర్ 01 న జరిగిన పురుషుల సింగిల్స్ పైనల్లో ప్రపంచ 36 వ ర్యాంకర్ ఓఊఱాః (మద్యప్రద్దేశ్ ) 15-21,17-21 తో ప్రపంచ 22 వ ర్యాంకర్ వాంగ్ జువేకి 11,250 డాలర్లు (రూ.8లక్షలు ),రన్నర్ అప్  సౌరభ్ వర్మ కు 5700 డాలర్లు (రూ.4 లక్షలు ) ప్రైజ్ మని గా లబిచాయి.2019 ఏడాది సౌరబ్ హైదరాబాద్ ఓపెన్ ,వియత్నాం  ఓపెన్ టోర్నిలో టైటిల్ ను సాధించాడు. వాంగ్ జు నెగ్గడంతో 2014 తర్వాత సయ్యద్ మోది ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విదేశీ ఆటగాడికి టైటిల్ లభించినట్లయింది.2014 లో జాయ్ సాంగ్(చైనా)విజేతగా నిలువగా 2015 లో పారుపల్లి కశ్యప్(భారత్),2016 లో కిదాంభి శ్రీకాంత్ (భారత్ ),2017,2018 లలో సమీర్ వర్మ (బారత్ ) చాంపియన్స్ గా నిలిచారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: సయ్యద్ మోధీ ఓపెన్ టోర్నీ రన్నరప్ గా సౌరబ్:

ఎక్కడ: ఉత్తరప్రదేశ్

ఎవరు: సౌరభ్ వర్మ

ఎప్పుడు: డిసెంబర్ 01

ఖాట్మండులో దక్షిణాసియాలో క్రీడలు ప్రారంభం:

నేపాల్ రాజధాని ఖాట్మండులో 13వ దక్షినాసియ క్రీడలుప్రారంభమయ్యాయి. నేపాల్ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి బండారి డిసెంబర్01న ఈ క్రీడలను ప్రారంబించారు. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో భారత్ ,నేపాల్,శ్రీలంక,బంగ్లాదేశ్ ,పాకిస్తాన్,భూటాన్, మాల్దేవులు  దేశాలనుంచి 2715 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 26 క్రీదాంశాల్లో 1119 పథకాల కోసం క్రేడాకారుల పోటిపడుతున్నారు. భారత్ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. 2016దక్షిణాసియ క్రీడల్లో భారత్ 188 స్వర్ణాలు ,90 రజతాలు ,30 కాంస్యాలు కలిపి మొత్తం 308  పతకాలు సాధించింది. ఇందులో బాగంగా ఈ క్రీడల ప్రారంబోత్సవంలో భారత బృందానికి పతాకదారిగా షాట్పుట్ క్రేడాకారుడు  తేజేందర్ సింగ్ పాల్ తూర్ వ్యవహరించనున్నారు. 2018 జకర్త ఆసియా క్రీడల్లో 25ఎల్ల  తేజేందర్ స్వర్ణం సాధించాడు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఖాట్మండులో దక్షిణాసియాలో క్రీడలు ప్రారంభం:

ఎక్కడ: నేపాల్

ఎవరు: తేజేందర్ సింగ్ పాల్

ఎప్పుడు:డిసెంబర్ 01

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *