Daily Current Affairs in Telugu -19-12-2019
లోకాయుక్తగా జస్టిస్ చిన్తపట్టి వెంకట రాములు:

తెలంగాణా లోకాయుక్తగా హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చిన్తపట్టి వెంకట రాములు,ఉపలోకయుక్త గా విశ్రాంత జిల్లా ,సెషన్స్ న్యాయమూర్తి ,రాష్ట్ర న్యాయ శాఖ మాజీ కార్యదర్శి వోలిమినేని నిరంజన్ రావులు నియమితులయ్యారు.మనవ హక్కుల కమిషన్ చైర్మన్ గా హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గండ చంద్రయ్య ,సబ్యులుగా విశ్రాంత జిల్లా ,సెషన్స్ న్యాయమూర్తి నడిపల్లి ఆనందరావు (జుడిషియల్) మహమ్మద్ ఇర్ఫాన్ మోయునిద్దిన్ (నాన్ జ్యుడిషియల్) నియమిస్తూ ప్రబుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జరీ చేసింది. డిసెంబర్ 18న జరిగిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఆద్వర్యంలో జరిగిన కమిటీ సమావేశమై లోకాయుక్త ,ఉపలోకాయుక్త లను ఎంపిక చేసింది. వీరితో పాటు అదనంగా హోమ మంత్రి మహమ్మూద్ ఆలితో కూడిన కమిటీ మానవ హక్కుల సంఘం చైర్మన్ ,సబ్యులను ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: లోకాయుక్తగా జస్టిస్ చిన్తపట్టి వెంకట రాములు
ఎక్కడ: తెలంగాణ
:ఎవరు: చిన్తపట్టి వెంకట రాములు
ఎప్పుడు: డిసెంబర్ 19
అపోలో సిఈఓకు హెల్త్ కేర్ లీడర్ పురస్కారం :

ఆరోగ్య సంరక్షణ చేసిన కృషికి గాను గుర్తింపు గా ఇంటర్నేషనల్ పోరం ఆన్ అడ్వాన్స్మెంట్ ఇన్ హెల్త్ కేర్ (ఐఎఫ్ఎహెచ్) టాప్1000 హెల్త్ కేర్ లీడర్స్ అవార్డు అపోలో హాస్పిటల్స్ సిఈఓ వై.సుబ్రహ్మణ్యం ను వరించింది. దుబాయ్ లోని మిరిడియన్ లో డిసెంబర్ 19న రాత్రి నిర్వహించిన సదస్సులో సిఈఓ వై.సుబ్రహ్మణ్యం ఐఎఫ్ఎహెచ్ నిర్వాహకుల నుంచి ఈ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అపోలో సిఈఓ కు హెల్త్ కేర్ లీడర్ పురస్కారం
:ఎవరు: సిఈఓ వై.సుబ్రహ్మణ్యం
ఎప్పుడు: డిసెంబర్ 19
పి.ఎం.జి.ఎస్.వై మూడో దశ ప్రారంబం :

ప్రదానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజిఎస్.వై) మూడో దశ ప్రారంబమైంది.న్యుడిల్లిలో డిసెంబర్ 18న కేంద్ర గ్రమీనాబివృద్ది ,పంచాయితి రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ పతాకాన్ని ప్రారంబించారు.గ్రామిణ ఆవాస ప్రాంతాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డులు ,ఉన్నత పాటశాలలు ఆసుపత్రులను కలుపుతూ 1.25 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మించాలని ఈ పథకం లక్ష్యం .ఇందుకోసం మొత్తంరూ.80.250 కోట్లు ఖర్చు చేయనున్నారు.ఇందులో కేంద్ర ప్రబుత్వం రూ.53,800 కోట్లు సమకూర్చనుంది.మిగిలింది రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ గా సమకూర్చవలసి ఉంటుది. పథకం కాలపరిమితి 2019-20 నుంచి 2024-25 వరకు ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పిఎంజిఎస్వై మూడో దశ ప్రారంబం
ఎక్కడ :న్యూదడిల్లి
:ఎవరు: నరేంద్ర సింగ్ తోమర్
ఎప్పుడు: డిసెంబర్ 19
దక్షిణ మద్య రైల్వేకు 3 ఇందన పొడుపు అవార్డులు :

తెలంగాణ ప్రబుత్వం 2019 సంవత్సరానికి ప్రకటించే ఇందన పొడుపు అవార్డుల్లో మూడింటిని సాధించినట్లు దక్షిణ మద్య రైల్వే డిసెంబర్ 19 ఓ ప్రకటనలో తెలిపింది.ప్రబుత్వ భవనాలు విభాగంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ప్రథమ బహుమతి ,సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం సంచాలన్ భవన్ ద్వితీయ బహుమతి ,ఇతర విబాగంలో లలాగూడ క్యారేజ్ వర్క్ షాప్ ప్రథమ బహుమతి లబించినట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇందన అబివృద్ది సంస్థ ఈ నెల 20న హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమలో అవార్డ్ లను అందజేస్తుందని దక్షిణ మద్య రైల్వే వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షిణ మద్య రైవేకు 3 ఇందన పొడుపు అవార్డులు
ఎక్కడ: తెలంగాణా
:ఎవరు: దక్షిణ మద్య రైల్వే
ఎప్పుడు: డిసెంబర్ 19
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
2019 సంవత్సరానికి పోర్బ్స్ జాబితాలో విరాట్ కోహ్లి కి మొదటి స్థానం:

బారత్ లో 2019కి సంబంధించి అత్యధిక ఆర్జన ఉన్న వందమంది సెలబ్రిటీల జాబితాను పోర్బ్స్ ఇండియా విడదల చేసింది.ఇందులో భారత క్రికెట్ కెప్టన్ విరాట్ కోహ్లి అగ్ర స్థానంలో ఉన్నారు.తర్వాతి స్థానాలను బాలివుడ్ నటులు అక్షయ్ కుమార్ ,సల్మాన్ ఖాన్ దక్కించుకున్నారు.టాలివుడ్ నటులు ప్రబాస్ కు 44,మహేశ్ బాబు కు 54వ స్థానం లబించాయి.2018 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు వృత్తి పరంగాను ఇతర ఎండార్స్మెంట్ ద్వారా సెలబ్రిటీలు ఆర్జించిన ఆదాయం పై అంచనాలతో పాటు వారి పేరు ప్రఖ్యాతలను ప్రామాణికంగా తీసుకొని ర్యాంకింగ్ కేటాయించారు. దీని ప్రకారం మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి ఆర్జన 252.72 కోట్లుగా ఉంది. రెండో స్థానంలో ఉన్న అక్షయ్ కుమార్ రూ.293.25 కోట్లు గా ఉంది మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ ,4వ స్థానంలో బాలివుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ,5వ స్థానంలో క్రికెటర్ ఎం.ఎస్ ధోని ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2019 సంవత్సరానికి పోర్బ్స్ జాబితాలో విరాట్ కోహ్లి కి మొదటి స్థానం
:ఎవరు: విరాట్ కోహ్లి
ఎప్పుడు: డిసెంబర్ 19
భారత్–అమెరికా 2+2 చర్చలు ప్రారంబం:

భారత్ –అమెరికా మద్య 2+2 ఉన్నత స్థాయి సమావేశాలు ప్రారంబంయ్యాయి. అమెరికా రాజదాని వాషింగ్టన్ లో డిసెంబర్ 18న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పామ్పియ ,డిఫెన్స్ సెక్రటరీ మార్క్స్ ఎస్సార్ లతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బేటి అయ్యారు. వీరు ద్వైపాక్షిక ,జాతీయ ,అంతర్జాతీయ పరినణామాలపై చర్చించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భరత్ –అమెరికా 2+2 చర్చలు ప్రారంబం:
ఎక్కడ వాషింగ్టన్,(అమెరికా)
ఎప్పుడు: డిసెంబర్ 19
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |