Daily Current Affairs in Telugu -19-11-2019

daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -19-11-2019

rrb ntpc online exams in telugu

తెలంగాణ కు స్వచ్చ సర్వేక్షన్ గ్రామీన్ పురస్కారం:

తెలంగాణాకు స్వచ్చ కిరీటం వరించింది.త్రాగునీరు,పరిశుబ్రత విభాగంలో  ప్రథమ స్థానం తో స్వచ్చ సర్వేక్షన్ గ్రామిన్ -2019 పురస్కారన్ని  దక్కించుకుంది. డిల్లీలో కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి  డి.వి. సదానంద గౌడ  చేతుల మీదుగా  రాష్ట్ర పంచాయితి రాజ్  గ్రామీణ అభివృద్ధి  శాఖ  మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  సంబంధిత  అవార్డును  స్వీకరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్  రావు మాట్లాడుతూ  స్వచ్చ  భారత్ మిషన్ కింద  ప్రకటించే  అవార్డుల లో తెలంగాణ  మూడేళ్ళుగా అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి గుర్తు చేశారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  తెలంగాణ కు స్వచ్చ సర్వేక్షన్ గ్రామీన్ పురస్కారం

ఎవరు:  రాష్ట్ర పంచాయితి రాజ్  గ్రామిణ అభివృద్ధి  శాఖ  మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు

ఎక్కడ: తెలంగాణ         

ఎప్పుడు: నవంబర్ 19

తెలంగాణ శాస్త్రవేత్తకు  జపాన్ అవార్డ్ :

పట్టు పరిశ్రమలలో పరిశోదనలతో  విశేష కృషి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త  డాక్టర్ తాళ్ళపల్లి  మొగిలి జపాన్ లోని  అంతర్జాతీయ పట్టు కమిషన్  నుంచి  ప్రతిష్టాత్మక  లూయిస్ పాశ్చర్  పురస్కారాన్ని  అందుకున్నారు. జపాన్ లోని సుకుబ  నగరంలో నవంబర్ 18 న జరిగియన కార్యక్రమంలో  ఈ పురస్కారాన్ని  అందుకున్నట్లు ఆయన  ఒక  ప్రకటనలో  తెలిపారు. వరంగల్ రూరల్  జిల్లా  పరకాల మండలం  చర్లపల్లి  కి చెందిన  మొగిలి  కాకతీయ  విశ్వ విద్యాలయంలో  డాక్టరేట్  పొందారు. మల్బరీ కొత్త వంగడాల  అభివృద్దిలో  ఆయన విశేష  కృషి చేశారు.  30 ఏళ్లుగా కేంద్ర  ప్రభుత్వ  పరిశోదన కేంద్రంలో  శాస్త్రవేత్తగా పనిచేశారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  తెలంగాణ శాస్త్రవేత్తకు  జపాన్ అవార్డ్

ఎవరు:  డాక్టర్ తాళ్ళపల్లి  మొగిలి

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు: నవంబర్ 19

అంతర్జాతీయ  ప్రమాణాలతో  సిద్దిపేటలో ఎఫ్ సిఆర్ఐ

సిద్ధిపేట జిల్లా ములుగు లోని  ఫారెస్ట్ కాలేజ్ ,రిసెర్చ్ ఇన్స్టిట్యూట్  (ఎఫ్ సేఆర్ఐ) ను అంతర్జాతీయ  ప్రమాణాలను  అనుగుణంగా  అబివృద్ది  చేయాలని  అటవీ శాఖ  నిర్ణయించింది. ఇందులో బాగంగా అమెరిక అలబమా లోని ఆబర్న్ విశ్వవిద్యాలయంలో  అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంపై  నవంబర్ 19న ప్రాథమిక  చర్చలు జరిపింది.  ఆ యునివర్సిటి  కి చెందినా  స్కూల్ అఫ్ ఫోరేస్త్రి  వైల్డ్ లైఫ్  సైన్సు  ప్రొఫెసర్ , దీన్ డాక్టర్ ఎ. జానకి రాం  రెడ్డి  ములుగులో  ఎఫ్ సే ఆర్ ఐ కొత్త  క్యాంపస్ ను సందర్శించారు. అనంతరం  హైదరాబాద్  అరణ్యభాన్  లో అటవీ శాఖ  ఉన్నతాధికారులతో  సమావేశమయ్యారు. అబర్న్ విశ్వ విద్యాలయంలో అమలు చేస్తున్న , విస్తరణ  కార్యక్రమాలను  తెలంగాణా అటవీ అధికారులతో  పంచుకున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అంతర్జాతీయ  ప్రమాణాలతో  సిద్దిపేటలో ఎఫ్ సిఆర్ఐ

ఎక్కడ: సిద్దిపేట

ఎప్పుడు: నవంబర్ 19

సునీత నారాయణ్ కు ఇందిరా గాంధీ  శాంతి బహుమతి  ప్రదానం

దేశ రాజదాని లో  వాయు కాలుష్యం  పట్ల కాంగ్రెస్  అద్యక్షురాలు  సోనియా గాంధి  మంగళ వారం  తీవ్ర ఆందోళన వ్యకం చేశారు. కాలుష్య  సమస్య పరిష్కారానికి  కాంగ్రెస్స్ అధికారంలో  ఉన్నపుడు  ప్రజా రవాణ వ్యవస్థ లో  సి ఎంజి(సంపీదన ఇందన్ వాయువు ) ని వినియోగించిన విషయాన్ని  ఆమె  ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంటర్  ఫర్  సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్  (సిఎస్ఈ) సారధి సునీత నారాయణ్  కు 2018 సంవత్సరానికి  గాను  ప్రకటించిన  ఇందిరా గాంధీ  శాంతి బహుమతి  ని నవంబర్ 19 న ఇక్కడ ప్రదానం చేశారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  సునీత నారాయణ్ కు ఇందిరా గాంధీ  శాంతి బహుమతి  ప్రదానం

ఎవరు:  సునీత నారాయణ్

ఎక్కడ: ఢిల్లీ

ఎప్పుడు: నవంబర్ 19

29 న భారత్ కు శ్రీ లంక  నూతన  అద్యక్షుడు :

శ్రీలంక కొత్త అద్యక్షుడు గోటబాయ రాజపక్స  ఈ నెల 29 న బారత  పర్యటనకు  వెళ్లనున్నారు. ఈ మేరకు భారత ప్రదాని  నరేంద్రమోడి  పంపిన  ఆహ్వానాన్ని  రాజపక్స  ఆమొదించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్  వెల్లడించారు. రెండు రోజుల  శ్రీలంక  పర్యటన లో ఉన్న  మంత్రి జై శంకేర్ నవంబర్౧౭ న ఇక్కడ రాజపక్స ను కలవనున్నారు. శ్రీలంక అద్యక్షునిగా  ప్రమాణ స్వీకారం  చేసిన రాజపక్స కు శుబాకాంక్షలు  తెలుపుతూ  భారత ప్రదాని  నరేంద్ర మోడీ  పంపిన సందేశాన్ని  అందచేసారు.  అదే విషయాన్ని జై శంకర్  ట్వీట్ చేసాడు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  29 న భారత్ కు శ్రీ లంక  నూతన  అద్యక్షుడు

ఎవరు: శ్రీ లంక  నూతన  అద్యక్షుడు గోటబాయ రాజపక్స

ఎక్కడ: భారత్

ఎప్పుడు: నవంబర్ 19

కార్బోశాట్ -3 కి ప్రయోగానికి  సన్నాహాలు

చంద్రయాన్ -2 తో  ప్రపంచ స్థాయిలో  సత్తా చాటిన భారతీయ అంతరిక్ష పరిశోదన  సంస్థ (ఇస్రో) నవంబర్ ,డిసెంబర్ నెలల్లో కీలక ఉపగ్రహాలను ప్రయోగించేదుకు సిద్దమవుతుంది.సరిహద్దు బద్రతను పెంచే  దిశగా  సమర్ధమంతమైన ఛాయా చిత్ర (ఇమజింగ్) వ్యవస్తలున్న కార్బోశాట్ -3 ఉపగ్రహ న్ని  ఈ నెల 25 న ప్రయోగించనున్నట్లు  ఇస్రో నవంబర్ 19 న బెంగళూర్ లో ప్రకటించింది. పాకిస్తాన్ లో ఉగ్రావాదుల  స్థావరాలపై  మెరుపు దాడులు  చేయడంలో  ఉపకరించిన  రిశాట్  శ్రేణికి  మించిన  సామర్త్యం  ఈ ఉపగ్రహాలకు  ఉన్నట్లు  ఇస్రో తెలిపింది.  థర్డ్ జనరేషన్ ఉపగ్రహంగా  బావిస్తున్న  కార్బోశాట్ -3 ఎక్కువ రేసేల్యుషన్ 25 సెమీ తో చిత్రాలు  తియగలదు. సైనిక ఉగ్రదలాల స్థావారాలను  మరింతగా  స్పష్టంగా  చూపగలదు. పీఎస్ఎల్వి-సి47 వాహక నౌక ద్వారా  ప్రయోగించే  ఈ ఉపగ్రహాన్ని  భూమికి  509కిలోమీటర్ల్  స్తిర కక్ష్యలో ,97.5 డిగ్రీల  కోణంలో  ఉంచాలన్నది  ఇస్రో అంచనా  వాతావరణం అనుకూలిస్తే  నవంబర్ 25 న ఉదయం  9. 28 గంటలకు పిఎస్ఎల్వి వాహక నౌక ను శ్రీహరి కోటలో  ఎస్డీఎస్ సే నుంచి సూర్యుని స్తిర కక్ష్యలో  కి పంపుతారు. కార్బోశాట్ తో పాటు  అమెరికా కు చెందినా (ఎంఎస్ఐఎల్) సహకారంతో  రూపొందించిన 13 వాణిజ్య  నానో  ఉపగ్రహాలను  ప్రయోగిస్తారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  కార్బోశాట్ -3 కి ప్రయోగానికి  సన్నాహాలు

ఎవరు: ఇస్రో

ఎక్కడ: బెంగళూర్

ఎప్పుడు: నవంబర్ 19

భువనేశ్వర్ లో నైపున్యాభివ్రుద్ది కేంద్రం –ఒడిష సిఎం నవీన్ పట్నాయక్

యువతకు సాంకేతిక  విద్య ,శిక్షణ పై ప్రభుత్వం  ప్రాదాన్యత  ఇస్తుందని  స్కిల్డ్ ఇన్ ఓడిశా  ముఖ్యమంత్రి  నవీన్ పట్నాయక్ అన్నారు. త్వరలో భువనేశ్వర్లో  ప్రపంచ స్థాయి  నైపుణ్య  అభివృద్ధి  కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని  తెలిపారు. కుర్డా ప్రాంతం లో ఉన్న  సెంచూరియన్  విశ్వ విద్యాలయంలో  నవంబర్19 న  ఉదయం నిర్వహించిన  స్నాతకోత్సవంలో  ముఖ్య మంత్రి పాల్గొన్నారు.  ప్రముఖ నటుడు  కమలహాసన్ కు  డాక్టరేట్  పట్టా ను  అందచేసి  సత్కరించారు.  భారత సిని రంగం లో తిరుగులేని నటునిగా గుర్తింపు  సాదించిన  కమల్ కు  డాక్టరేట్  అందించినందుకు ఏంతో గర్వ పడుతున్నానని  అన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  భువనేశ్వర్ లో నైపున్యాభివ్రుద్ది కేంద్రం –ఒడిష సిఎం నవీన్ పట్నాయక్

ఎవరు: ఒడిష సిఎం నవీన్ పట్నాయక్

ఎక్కడ: ఒడిష

ఎప్పుడు: నవంబర్ 18

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

జన్యు మార్పిడి  వత్తనాలపై పరిశోదనలు

తృణ ధాన్యాలతో పాటు  ,కందులు ,బొబ్బర్లు , సెనగ,వేరు, వేరుషేన్గలో  తెగుల్ల  నివారణ  ద్వారా ఉత్పాదకత , దిగుబడి  పెంచేందుకు  జన్యుమార్పిడి  (జిఎం ) విత్తనాలపై  పరిశోదానాలు చేస్తున్నామని  అంతర్జాతీయ  ఉష్ణ మండల  ప్రాంత  పంటల  పరిశోదన  సంస్థ  (ఇక్రిసాట్ ) డైరెక్టర్  జెనెరల్ (డిజి)  డాక్టర్  పీటర్  ఎస్. కార్ బెర్రీ  పేర్కొన్నారు.  వీటిని  రైతులకు  ఇవ్వడానికి  భారత  ప్రబుత్వాన్ని  కూడా అడిగామని  చెప్పారు.  ఇప్పటికే  బీటి బొబ్బర్లు (అలసంద ) విత్తనాలు  ఆఫ్రికా దేశాల్లో  విడుదల చేశామని   వివరించారు.  భారత్ ప్రబుత్వం అనుమతిస్తే  సెనగ ,కందులు,  బీటి, విత్తనాలు  పై మరిన్ని  ప్రయోగాలు  చేస్తున్నామని  అన్నారు. అస్త్రలియ కు చెందిన పీటర్  ఇటివల  ఇక్రిసాట్  కొత్త డిజి గా బాద్యతలు స్వీకరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  జన్యు మార్పిడి  విత్తనాలపై పరిశోదనలు

ఎవరు: (ఇక్రిసాట్ ) డైరెక్టర్ (డిజి)  డాక్టర్  పీటర్  ఎస్. కార్ బెర్రీ 

ఎప్పుడు:  నవంబర్ 19

బాల్య వివాహాలు తగ్గుముఖం  యునిసెఫ్ నివేదిక వెల్లడి

భారత్ వంటి  అధిక జనాభా  కలిగిన దేశాల్లో  గత 25 ఎల్ల కాలంలో బాల్య  వివాహాల  సంఖ్హ్య తగ్గుముఖం పట్టినట్లు  యునిసెఫ్  తాజా నివేదిక  వెల్లడించింది.  సామజిక  చైతన్య  సాదన దిశగా  జరగనున్న  కృషి  , ఆర్థిక ప్రగతి,మహిళా సాధికారత  వంటి  అంశాల  ప్రబావం  బాల్య వివాహాల  దురాచారం  ప్రపంచ వ్యాప్తంగా  బలహీనపడడానికి  కారణమైనట్లు  యునిసెఫ్ తన నివేదికలో  పేర్కొంది. విద్యావంతులైన  కుటుంబ సభ్యులు ,ఆర్ధిక స్థిరత్వం , శ్రామిక  భాగస్వామ్యం  పెరగడం  వంటి  అంశాలు బాల్య వివాహలు సంఖ్య  తగ్గడానికి  దోహదపడతాయి. ముఖ్యంగా  దక్షిణాసియ  దేశాల్లో  బాల్య వివాహాలు  సంఖ్య  గత పాతికేల్ల  కాలంలో 59 నుంచి 30 శాతానికి పడిపొయింది అని యునిసెఫ్  నివేదిక  తెలిపింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  బాల్య వివాహాలు తగ్గుముఖం  యునిసెఫ్ నివేదిక వెల్లడి

ఎప్పుడు: నవంబర్ 19

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *