Daily Current Affairs in Telugu 17-11-2020
భారత్ క్రికెటర్ సుదీర్ త్యాగి క్రికెట్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :
భారత మాజీ పేసర్ సుదీప్ త్యాగి క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికాడు. 2009లో మహేంద్ర సింగ్ దోని కేప్టేన్సి లో శ్రీలంక పై అరంగ్రేటం చేసిన ఈ మీడియం పేసర్ బౌలర్ టీం ఇండియా తరపున నాలుగు వన్డేలు ఆడి మూడు వికేట్లు పడగొట్టాడు. 2010 లో చివరి వన్డే లో పాల్గొన్న అతను లంక పైనే కెరీర్లో ఏకైక టి20 ఆడాడు. 41ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 109 వికెట్లు తీసిన ఈ 33ఏళ్ల త్యాగి ఐపిఎల్ లో 2009,10సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ,హైదరాబాద్ జట్లకు ప్రాతినిత్యం వహించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ క్రికెటర్ సుదీర్ త్యాగి క్రికెట్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: సుదీర్ త్యాగి
ఎప్పుడు : నవంబర్ 17
2022 కు వాయిదా పడిన అండర్-17 మహిళల ప్రపంచ కప్ :
భారత్ వేదికగా జరగాల్సిన మహిళల అండర్ -17 పుట్ బాల్ ప్రపంచ కప్ ను ఫిఫా రద్దు చేసింది. అయితే ఆ మెగా టోర్నీ ని నిర్వహించేందుకు మరో అవకాశం భారత్ కు ఇచ్చింది.2022టోర్నీ అతిత్య హక్కులను కట్టబెట్టింది.షెడ్యుల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ లో అండర్ -17ప్రపంచ కప్ భారత్ లో జరగాలి.అయితే కరోన కారణంగా మొదట ఈ టోర్నీ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి-మర్చి కి వాయిదా వేశారు.ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాని నేపద్యంలో ఆ టోర్నీ ని ఫిఫా రద్దు చేయాలని నిర్ణయించింది.ఈ టోర్నీ 2022 లో భారత్ కోస్టారికా (అండర్ -20 మహిళల కప్) లలో ఫిఫా టోర్నీ లు జరగనున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 కు వాయిదా పడిన అండర్ -17 మహిళల ప్రపంచ కప్
ఎవరు: ఫిఫా
ఎక్కడ : భారత్ కోస్టారికా
ఎప్పుడు : నవంబర్ 17
ఉత్తర అరెబీయ సముద్రంలోప్రారంబం అయిన రెండో విడత మలబార్ విన్యాసాలు :
భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా పాల్గొంటున్న రెండో దశ మలబార్-2020 నావికా దళం లో విన్యాసాలు ఉత్తర అరెబీయ సముద్రంలో అట్టహాసంగా ప్రారంబం అయింది. నాలుగు రోజుల పాటు కొనసాగే యుద్ద అబ్యాసాల్లో భారత దేశానికి చెందిన యుద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య తో పాటు అమెరికా ,ఆస్ట్రేలియా ,జపాన్ యుద్ద నౌకలు పాల్గొంటున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ద నౌక యు.ఎస్ఎస్ నిమిట్టి ఈ విన్యాసాల్లో పాల్గొనడం ప్రేత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఒక అధికారి తెలిపారు .చతుర్భుజ కూటమిలో భాగమైన ఈ నాలుగు దేశాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాల వల్ల పరస్పర సమన్వయ౦ పెరుగుతుందని భారత నావికా దళం భారత నావికా దళం ప్రకటించింది. మలబార్ మొదటి విడత విన్యాసం ఈ నెల 3నుంచి 6వరకు బంగాళా ఖాతం లో జరిగాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉత్తర అరెబీయ సముద్రంలోప్రారంబం అయిన రెండో విడత మలబార్ విన్యాసాలు :
ఎవరు: భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు
ఎక్కడ : ఉత్తర అరెబీయ సముద్రంలో
ఎప్పుడు:నవంబర్17
ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ చైర్మన్ గా క్రిష్ గోపాల కృష్ణ నియామకం
రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ మొట్టమొదటి చైర్మన్ గా ఇన్ఫోసిస్ సహావ్యవస్థాపకులు సేనాపతి(క్రిష్ )గోపాల కృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 17న ఒక ప్రకటనలో తెలిపింది. అందరకి ఆర్ధిక సేవల విస్తరణ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్(ఆర్ బిఐహెచ్)ను ఏర్పాటు చేయనునట్లు ఆగస్టులో సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. టెక్నాలజీ ప్రాదాన్యత ఇస్తూ ఫైనాన్సియల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు,ఇందుకు తగిన పరిస్థితులు నెలకొల్పడం ఆర్.బి.ఐ.హెచ్ యొక్క లక్ష్యం. చైర్మన్ నేతృత్వంలో పని చేసే ఆర్బిఐహెచ్ గవర్నర్ కౌన్సిల్ సభ్యులను కూడా ఆర్బిఐ నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ చైర్మన్ గా క్రిష్ గోపాల కృష్ణ నియామకం
ఎవరు: క్రిష్ గోపాల కృష్ణ
ఎక్కడ :న్యుడిల్లి
ఎప్పుడు : నవంబర్ 17
మాజీ ఒలింపియన్ జిగ్ మోహన్ కన్ను మూత :
మాజీ అథ్లెట్ ఒలింపియన్ జిగ్ మోహన్ గుండె పోటుతో మరణించారు. ఆయన వయసు 88ఏళ్ళు .1958-60 మద్య 110 మీటర్ల హార్టిల్ లో డేకాత్లాన్ లోనూ పలు రికార్డులు నెలకొల్పారు. 1960లో రోమ్ ఒలింపిక్స్ లో 110 మీటర్ల హర్టిల్స్ లో పోటీ పడ్డ ఆయన పటియాలలో సాయ్ సంయుక్త డైరెక్టర్ జనరల్ గా పని చేసారు. .భారత అథ్లెటిక్స్ లో శాస్త్రియ ఫిట్నెస్ శిక్షణ పద్దతులను పరిచయం చేసిన ఘనత ఆయనదే. పంజాబ్ పోలిస్ శాఖలో పదేళ్ళు పని చేసిన జిగ్ మోహన్ జాతీయ శిబిరంలో కోచ్ గా 20ఏళ్ళు స్ప్రింటర్లకు శిక్షణ ఇచ్చాడు. 1966 కామన్ వెల్త్ క్రీడల్లో ,1975ఆసియా అథ్లెటిక్ చాంపియన్షిప్ లో పాల్గొన్న భారత జట్టుకు చీఫ్ అథ్లెట్ కోచ్ గా సేవలు అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మాజీ ఒలింపియన్ జిగ్ మోహన్ కన్ను మూత
ఎవరు: జిగ్ మోహన్
ఎక్కడ :పంజాబ్
ఎప్పుడు : నవంబర్ 17
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |