
Daily Current Affairs in Telugu 03-08-2020
పరిపాలనా వికేంద్రికరణ బిల్లుకి ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ :

ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రికరణ బిల్లుకి సిఆర్డిఎ చట్టం రద్దు యొక్క బిల్లులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ జులై 31 న ఆమోదంతెలపడం తో అవి చట్టాలుగా మారనున్నాయి.రాష్ట్ర న్యాయ శాఖా కార్యదర్శి అయిన జి మనోహర్ రెడ్డి జులై 31 వేరు వేరుగా గెజిట్ నోటిఫికేషన్ లను విడుదల చేశారు.దీంతో మూడు రాజదానులు ఏర్పాటు సాకారం అవనుంది. పరిపాలన వికేంద్రికరణ ద్వారా రాష్ట్ర ప్రాంతీయ నమూనాబివ్రుద్ది సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు బిల్లులకు రూప కల్పన చేసి వాటిని గవర్నర్ ద్వారా ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పరిపాలనా వికేంద్రికరణ బిల్లుకి ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్
ఎవరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఆగస్ట్ 03
మహిళల ప్రపంచ టీం స్క్వాష్ చాంపియన్ షిప్ నుంచి వైదొలగిన భారత్ :

మహిళల ప్రపంచ టీం స్కాష్ చాంపియన్ షిప్ నుంచి భారత్ వైదొలగింది.ఈ విషయాన్నీ భారత స్క్వాష్ సమాఖ్య (ఎస్ఆర్ ఎఫ్ఐ) కార్యదర్శి సైరస్ పోంచా ఆగస్ట్ 02 న వెల్లడించారు. షెడ్యుల్ ప్రకారం మలేషియాలో కౌలాలంపూర్ లోని డిసెంబర్ 15నుంచి 20వరకు ఈ చాంపియన్ షిప్ జరగాల్సి ఉంది. అయితే కరోన లాక్ డౌన్ వల్ల తమ ప్లేయర్లకు సరైన ప్రాక్టీస్ లేదని దాంతో పాటు అంతర్జాతీయ ప్రయనాలపై నిషేదజ్ఞలు ఇంకా కొనసాగుతుండడం తో పాటు ప్లేయర్ ల యొక్క ఆరోగ్య బద్రత వంటి అంశాల దృష్టిలో ఉంచుకుని వైదోలగనున్నట్లు పోంచా తెలిపారు. చైనా వేదికగా గత జూన్ లో జరగాల్సిన ఆసియా జూనియర్ చాంపియన్ షిప్ ను ఆసియా స్క్వాష్ సమాఖ్య ను రద్దు చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల ప్రపంచ టీం స్క్వాష్ చాంపియన్ షిప్ నుంచి వైదొలగిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: ఆగస్ట్ 03
రాంకో అలత్త్హి యూర్ విభాగానికి వరించిన గోల్డెన్ పీకాక్ అవార్డు :

రాంకో సిమెంట్స్ అలత్తి యూర్ (తమిళనాడు) యూనిట్ కి “గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు” 2020 లబించింది. వార్షిక గోల్డెన్ పీకాక్ అవార్డులకు 344 కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నిర్వహణ సాంకేతికత శిక్షణ వ్యవహారాలు ప్రత్యెకంగా జీవిత సమతౌల్యతకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు, సాధిస్తున్న అత్యుత్తమ పలితాలను గాను ఈ ప్రతిస్టాత్మక అవార్డుకు రాం కో సిమెంట్స్ అలత్త్తియూర్ విభాగం ఎంపిక అయింది. సుప్రీం కోర్టు మాజీ ప్రదాన న్యాయ మూర్తి ఎంఎన్ వెంకట చలయ్య నేతృత్వంలో ని జ్యూరి అవార్డుకు సంబంధించి ట్రోఫీ ప్రశంశ పత్రాన్నియూనిట్ కు ప్రదానం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాంకో అలత్త్హి యూర్ విభాగానికి వరించిన గోల్డెన్ పీకాక్ అవార్డు :
ఎప్పుడు: ఆగస్ట్ 03
మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గా కొడాలి నిత్య ఎంపిక :

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తో కలిసి 40 దేశాలకు చెందిన వంద ప్రపంచసాంస్కృతిక తెలుగు సంస్థలు ఆన్ లైన్ లో నిర్వహించిన పోటీలో మిస్ టీన్ (13-19ఏళ్ళు) తెలుగు యూనివర్స్ గా కొడాలి నిత్య ఎంపికయింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రము హ్యుస్టన్ లో ఉంటున్న కోడాలి నిరూప్ కుమార్, రమ్య దంపతుల కుమార్తె నిత్య. ఆమె చిన్నతనం నుంచి కూచి పూడి, భారత నాట్యం లో అనేక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు గెలుచుకుంది. ఇందులోనే విజయవాడ కు చెందిన బి నాగాదుర్గ కుసుమ సాయి ప్రపంచ తెలుగు సు౦దరి విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. చందమామ కథలు తెలుగు పద్యాలూ పోటీలో విజయవాడ కు చెందిన కే.దియా శ్రీ ప్రథమ స్థానం లో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గా కొడాలి నిత్య ఎంపిక
ఎవరు: కొడాలి నిత్య ఎంపిక
ఎప్పుడు: ఆగస్ట్ 03
స్కోచ్ గోల్డెన్ అవార్డుకు ఎంపిక అయిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ :

ఐటి ఎనేబుల్డ్ స్కాలర్షిప్ స్కీమ్ల ద్వారా గిరిజనుల సాధికారత ప్రాజెక్టుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోటా) కు స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. డిజిటల్ ఇండియా కలలను సాకారం చేసుకోవటానికి మరియు పారదర్శకతతో పాటు డిజిటల్ సేవలను అందించడంలో భారత ప్రభుత్వం యొక్క నిబద్ధతను చూపించడానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. 66వ స్కోచ్ 2020 పోటీ “ఇండియా రిస్పాండ్స్ టు కోవిడ్ త్రూ డిజిటల్ గవర్నెన్స్” పేరుతో జరిగింది. డిజిటల్ ఇండియా & ఇ-గవర్నెన్స్ -2020 పోటీలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోటా) కూడా పాల్గొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్కోచ్ గోల్డెన్ అవార్డుకు ఎంపిక అయిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ
ఎవరు: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఆగస్ట్ 03
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |