
Daily Current Affairs in Telugu 15-08-2020
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ కు ప్రకటించిన టీం ఇండియామాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని :

మిస్టర్ కూల్ గా పేరున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ను ప్రకటించినాడు .భారత క్రికెట్ ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన నాయకుడిగా టీం ఇండియా కు ఎన్నో విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని తన ఆటకు ముగిస్తున్నట్లు అగస్ట్ 15 న ప్రకటించాడు. 14ఏళ్ల కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ తప్పుకున్నట్లు వెల్లడించారు.గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్లో న్యూజిలాండ్ తో ధోని తన చివరి మ్యాచ్ ను ఆడాడు.అయన 350 వన్డే లలో ధోని 50,57 సగటుతో 10,773 పరుగులు సాధించారు .ఇందులో 10 సెంచరీలు 73 అర్థ సెంచరీలు ఉన్నాయి. 98 టి20 మ్యాచ్ లలో 37.60 సగటుతో అతను 1617 పరుగులు చేశారు. 2007 లో టి20 ప్రపంచ కప్ ,2013 లో వన్డే వరల్డ్ కప్ , 2013 వన్డే చాంపియన్స్ ట్రోపీ ని గెలిపించిన ధోని మూడు ఐసిసి టోర్నీ లు సాధించిన ఏకైక కెప్టెన్ గ నిలవడం విశేషం
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ కు ప్రకటించిన టీం ఇండియామాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
ఎవరు; మహేంద్ర సింగ్ ధోని
ఎప్పుడు : .ఆగష్ట్ 15
గ్రామోదయ అవార్డులను అందుకున్న సుధ మూర్తి, శివకుమార్ లు :

సుధ మూర్తి, ఐటిసిసంస్థ కు చెందిన యొక్క శివకుమార్ లు గ్రామోదయ అవార్డులను ఇటీవల అందుకున్నారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన సుధా మూర్తి మరియు ఐటిసి లిమిటెడ్ అగ్రి మరియు ఐటి బిజినెస్ గ్రూప్ హెడ్, శివకుమార్ సురంపుడి గ్రామోదయ బంధు మిత్రా పురస్కారాల విజేతలలో ఉన్నారు. ఇతర విజేతలుగా పద్మ భూషణ్ విజయ్ భట్కర్, పద్మశ్రీ ఎస్పీ వర్మ, విలాస్ షిండే (డైరెక్టర్, సహ్యాద్రి), కూసం రాజమౌలి, తెలంగాణలోని గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్, పోగుల గణేశం, బౌల్ చైర్ వ్యవస్థాపకుడు, చల్లె స్వర్జన రాజ్ . గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జిసిఓటి) చేత స్థాపించబడిన గ్రామోదయ బంధు మిత్రా పురస్కారాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ. “మన జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయం మరియు జీవనోపాధి కోసం అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడిన వారికి సహాయాన్ని అందించడo మరియు సహకరించిన వ్యక్తుల కు మరియు సంస్థలు కు ఈ అవార్డులను ఇస్తారు
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్రామోదయ అవార్డులను అందుకున్న సుధ మూర్తి, శివకుమార్ లు
ఎవరు; సుధ మూర్తి, శివకుమార్
ఎప్పుడు : . ఆగష్ట్ 15
దాశరథి పురస్కారాన్ని (2020) గెలుచుకున్న సాహితి వెత్త తిరుగిరి రామానుజం :

స్వాతంత్ర్య దినోత్సం సందర్బంగా దాశరథి పురస్కారన్ని 2020 తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ గారు తిరుగిరి రామానుజం కు ప్రదానం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ఈ కార్యక్రమం లో సిఎం మాట్లాడుతూ తెలంగాణా జాతి గర్వించదగ్గ సాహితీ వేత్త గా తిరునగిరి రామానుజం అని కొనియాడారు.శాలువా కప్పి ఆయనను సన్మానించి జ్ఞాపిక గా రూ.101116 నగదు ను పురస్కారాన్ని అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దాశరథి పురస్కారాన్ని (2020) గెలుచుకున్న సాహితి వెత్త తిరుగిరి రామానుజం
ఎవరు; తిరుగిరి రామానుజం
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు : .ఆగస్ట్ 15
5వేల కిలోమీటర్ల కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన ఉగాండా రన్నర్ జాషువా చెప్తే గయ్ :

ప్రతిష్టాత్మక డైమాండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ లో ఉగాండా రన్నర్ జాషువా చెప్టి గయ్ పురుషుల 5వేల మీటర్ల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు ను నెలకొల్పాడు. 23 ఏళ్ల చెప్టి గయ్ ఐదు వేల మీటర్ల రేసును 12 నిమిషాల 35.36 సెకన్ల లో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.ఈ క్రమంలో 16ఏళ్లుగా కేనేనిసా బెకేలే (ఇతియోఫియా)12ని. 37.35 సెకన్లు ) పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డు ను చెప్టి గయ్ బద్దలు కొట్టాడు. గత ఏడాది దోహలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో చెప్టి గయ్ స్వర్ణ పతాకాన్ని సాధించి చాంపియన్ గా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 5వేల కిలోమీటర్ల కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన ఉగాండా రన్నర్ జాషువా చెప్తే గయ్ :
ఎవరు : జాషువా చెప్తే గయ్
ఎక్కడ: మొనాకో
ఎప్పుడు : .ఆగష్ట్ 15
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |