
Daily Current Affairs in Telugu 19-08-2020
రెడ్ చీఫ్ షూ కు బ్రాండ్ ఆఫ్ ఇండియా 2020 అవార్డు :

ఎకనామిక్ టైమ్స్ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక మైన ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2020 అవార్డు ను ప్రముఖ లెదర్ పుట్ వేర్ బ్రాండ్ రెడ్ చీఫ్ షూస్ కంపెని సొంతం చేసుకుంది.లెదర్ పుట్ వేర్ పరిశ్రమ లో నాణ్యమైన ఉత్పత్తులకు తయారు చేయడంలో పాటు కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందిస్తుందని ఎకనామిక్ టైమ్స్ కొనియాడింది.రెడ్ చీఫ్ కంపెని జనరల్ మేనేజర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఈ అవార్డు ప్రదానానికి మా కంపెని ఎన్నుకున్న ఎకనామిక్ టైమ్స్ సబ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రెడ్ చీఫ్ షూ కు బ్రాండ్ ఆఫ్ ఇండియా 2020 అవార్డు
ఎవరు: రెడ్ చీఫ్ షూ సంస్థ
ఎప్పుడు: ఆగస్ట్ 19
బీఎస్ఎఫ్ కొత్త డీజీగా నియమితులయిన రాకేశ్ అస్థానా :

భారత భద్రతా దళం (బీఎస్ఎఫ్) నూతన డైరెక్టర్ జనరల్‌గా రాకేశ్ అస్థానాను భారత ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం, డిజి ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) చీఫ్ ఎస్ ఎస్ దేస్వాల్ గారు ఈ ఏడాది 2020 మార్చి నుండి బిఎస్ఎఫ్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. అస్తానా ప్రస్తుతం మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సిబి) యొక్క అదనపు ఛార్జీతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) కు నాయకత్వం వహిస్తున్నారు. పాకిస్తాన్‌తో సుమారు 2,280 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వద్ద మోహరించిన సరిహద్దు కాపలా దళానికికూడా పూర్తి సమయం ఛార్జీని తీసుకొనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బీఎస్ఎఫ్ కొత్త డీజీగా నియమితులయిన రాకేశ్ అస్థానా :
ఎవరు: రాకేశ్ అస్థానా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: అగస్ట్ 19
మేఘాలయ గవర్నర్‌గా సత్య పాల్ మాలిక్ నియమకం:

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 ఆగస్టు 18 నుంచి సత్య పాల్ మాలిక్ ను గవర్నర్‌గా నియమించారు. దీనికి ముందు ఆయన గోవా గవర్నర్‌గా పనిచేసారు. త్రిపుర గవర్నర్‌గా 3 సంవత్సరాలు పనిచేసి ,మేఘాలయలో ఉండి 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసిన తథాగట రాయ్ గారి స్థానంలో సత్య పాల్ మాలిక్ గారు నియమించ బడ్డారు.మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న భగత్ సింగ్ కోశ్యారీకి గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు తన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన తథాగట రాయ్ స్థానంలో సత్య పాల్ మాలిక్ ఆగస్ట్ 18 ఈశాన్య రాష్ట్ర౦ అయిన మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మేఘాలయ గవర్నర్‌గా సత్య పాల్ మాలిక్ నియమకం
ఎవరు: సత్య పాల్ మాలిక్
ఎక్కడ: మేఘాలయ
ఎప్పుడు: ఆగస్ట్ 18
సెబీ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ GP గార్గ్ నియామకం :

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జిపి గార్గ్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇడి) గా నియమించింది. దీనికి ముందు, ఆయన సెబీలో నే చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు మరియు జనవరి 1994 లో చేరినప్పటి నుండిసెబి లో అనేక హోదాలో విధులను నిర్వహించాడు. అతను దేశంలో ఆర్థిక అక్షరాస్యత మరియు పెట్టుబడిదారుల విద్యపై సెబీ యొక్క కార్యక్రమాలతో దగ్గరి సంబందాలను కలిగి ఉన్నాడు .సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆగస్టు 14 న జి పి గార్గ్‌ను తన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సెబీ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ GP గార్గ్ నియామకం
ఎవరు: GP గార్గ్
ఎప్పుడు: ఆగస్ట్ 19
డిల్లి స్టేడియం లో ఒక స్టాండ్ కు చేతన్ చౌహన్ గారి పేరు నామకరణం :

దేశ రాజదని లోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్లా )స్టేడియంలో ఒక స్టాండ్ కు భారత మాజీ క్రికెటర్ దివంగత చేతన్ చౌహాన్ పేరును పెట్టె అంశం పై డిల్లి అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) చర్చించనుంది.ఈ విషయాన్ని డిడిసిఎ సంయుక్త కార్యదర్శి రాజన్మన్ చందా ఆగస్ట్ 19న తెలిపారు.అయితే స్టేడియంలో ఉన్న రెండు గేట్లలో ఒకదానికి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరును మరో దానికి మహిళల జట్టు కెప్టెన్ అంజుం చోప్రా పేర్లను ఇప్పటికే పెట్టారు.స్టేడియంలోని ఐదు స్టాండ్ లో నాలుగింటికి పలువురి క్రికెటర్ ల పేర్లు పెట్టారు. చేతన్ చౌహాన్ ఇటీవల కరోన వైరస్ వ్యాధి తో మరణించారు. అయన భారత్ తరపున 40టెస్టులు ఏడూ వన్డేలు ఆడారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లి స్టేడియం లో ఒక స్టాండ్ కు చేతన్ చౌహన్ గారి పేరు నామకరణం
ఎవరు: చేతన్ చౌహన్
ఎక్కడ: డిల్లి స్టేడియం లో
ఎప్పుడు: ఆగస్ట్ 19
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |