
Daily Current Affairs in Telugu 11-08-2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుఎస్ బేస్డ్ ఐటి సంస్థ అయిన “బోస్టన్ గ్రూప్” తో అవగాహన ఒప్పందం :

విశాఖపట్నంలో ఐటి కంపెనీని ఏర్పాటు చేయడానికి బోస్టన్ గ్రూప్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త ఐటి సంస్థ ఐటి రంగంలో 25 వేల పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ కేంద్రంలోని ఉద్యోగులను ఆర్ అండ్ డి ఆన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లలో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ మరియు హ్యూమన్ రిసోర్సెస్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ కల్పిస్తుంది..
క్విక్ రివ్యు:
ఏమిటి: గవర్నెంట్ యుఎస్ బేస్డ్ ఐటి సంస్థ “బోస్టన్ గ్రూప్” తో అవగాహన ఒప్పందం
ఎవరు: బోస్టన్ గ్రూప్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఆగస్ట్ 11
కరోన పై పోరుకు రష్యా ప్రవేశపెట్టిన తొలి వ్యాక్సిన్ :

కరోన తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రపంచానికి శుబవార్త .ప్రాణాంతక కోవిద్ మహమ్మారి పై పోరాడే కీలక ఆయుధాన్ని రష్యా ఆవిష్కరించింది.ఈ మహమ్మారి నివారణకు మొట్టమొదటి సారిగా టీకాను పూర్తి స్థాయిలో సిద్దం చేసినట్లు రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్ట్ 11 న ప్రకటించారు.ఇది సమర్థవంతగా పనిచేస్తుందని కోవిద్ -19 నుంచి స్తిరంగా రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరికి ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. ఈ టీకా ను వాటి పై పరీక్షలు గమలేయా పరిశోదన సంస్థ ,రష్యా రక్షణ మంత్రిత్వ శాఖా అద్వర్యంలో జరిగాయి. దీని కోసం 38 మంది పై ఇప్పటి వరకు క్లినికల్ ప్రయోగాలు చేశారు. దీని తయారీ కోసం జూన్ 18 నుంచి శ్రమిస్తున్నారు.ఈ టీకా ద్వారా కోవిద్ నుంచి రెండు సంవత్సరాల పాటు రక్షణ కలిపిస్తుందని తెలిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: కరోన పై పోరుకు రష్యా ప్రవేశపెట్టిన తొలి వ్యాక్సిన్
ఎవరు: రష్యా
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: ఆగస్ట్ 11
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఇంటలిజెన్స్ చీఫ్ గా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం :

ఇంటలిజెన్స్ అదనపు డైరెక్టర్ ఆఫ్ పోలిస్ గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ని నియమించారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆగస్ట్ 11న ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నేపద్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగాదికరిగా ఉన్న రాజేంద్ర నాథ్ రెడ్డి ని నిఘా విభాగంకు అధికారిగా బదిలీ చేశారు. విజిలెన్స్ విభాగానికి కూడా ఆయనే ఇంచార్జ్ గా ఉంటారు .విశాఖ పట్నం పోలిస్ కమిషనర్ గా ఉన్న రాజీవ్ కుమార్ మీనాను మంగళగిరిలో లోని పోలిస్ హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న మనీష్ కుమార్ సిన్హా ను విశాఖ పట్నం సిటీ పోలిస్ కమిషనర్ గా బదిలి చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఇంటలిజెన్స్ చీఫ్ గా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం
ఎవరు: రాజేంద్రనాథ్ రెడ్డి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఆగస్ట్ 11
ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇండోరి కన్నుమూత :

ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇండోరి ఆగస్ట్ 11 న కన్నుమూసారు. కోవిద్ -19 సోకడంతో చికిత్స కోసం అదే రోజు అయన ఇండోర్ లోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స సమయంలో గుండె పోటు రావడం తో అయన మృతి చెందాడు. ఉర్దూ ముషాయిరాలతో అనే పేరు గడించిన రాహత్ సిని గేయ రచయితగా ను అందరికి సుపరిచితులు .ఈ ఏడాది కూడా రాహత్ గారు రాసిన “బులాతి హి మగర్ జానే క నహి “అనే కవిత సామజిక మాధ్యమంలో కూడా ఇది వైరల్ అయింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇండోరి కన్నుమూత
ఎవరు: రాహత్ ఇండోరి
ఎప్పుడు: ఆగస్ట్ 11
భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మానిటోంబి సింగ్ కన్నుమూత:

భారత మాజీ డిఫెండర్, మోహన్ బగన్ జట్టు కెప్టెన్ అయిన మానిటోంబి సింగ్ ఇటీవల కన్నుమూశారు. అతను మోహన్ బాగన్ జట్టు తరపున ఆడాడు మరియు 2010 లో డిల్లీ సాకర్ అసోసియేషన్ లీగ్ టైటిల్ గెలుచుకున్న హిందుస్తాన్ ఎఫ్‌సి జట్టులో భాగం గా ఉన్నాడు. 2002 లో వియత్నాంలో జరిగిన ఎల్జీ కప్‌లో మానిటోంబి భారత్ తరఫున కూడా ఆడాడు. అతను 2002 బుసాన్ ఆసియా క్రీడలలో ఇండియా జట్టులో కూడా ఉన్నాడు
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మానిటోంబి సింగ్ కన్నుమూత
ఎవరు: మానిటోంబి సింగ్
ఎప్పుడు: ఆగస్ట్ 11
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |