Daily Current Affairs in Telugu 29-07-2020

daily current affairs in telugu 2020 pdf download, today current affairs in telugu 2020, eenadu pratibha current affairs in telugu pdf, latest current affairs in telugu 2020, , tejaswi current affairs telugu pdf, , ekalavya current affairs telugu pdf, current affairs month wise pdf download, sakshi current affairs, current affairs in telugu app, eenadu pratibha current affairs in telugu pdf, eenadu pratibha gk in telugu pdf, eenadu pratibha current affairs 2020, 6 months current affairs pdf, eenadu pratibha current affairs online test, eenadu pratibha appsc, telangana current affairs pdf, current affairs telugu lo, eenadu pratibha subscription, shine india current affairs in telugu pdf 2020, shine india magazine march 2020 pdf download, shine india magazine april 2020 pdf download, shine india march 2020 magazine pdf, shine india april 2020 magazine pdf, shine india magazine may 2020 pdf download, shine india magazine november 2019, telugu current affairs magazine, shine india may 2020 magazine,

Daily Current Affairs in Telugu 29-07-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

విశాఖ శాస్త్రవేత్త అయిన వివిఎస్ శర్మ కు దక్కిన జాతీయ అవార్డు :

విశాఖపట్నానికి చెందిన సీఎఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు అయిన వీవీఎస్ శర్మకు ప్రతిష్టాత్మక ఓషన్ సైన్స్, టెక్నా లజీ జాతీయ అవార్డు దక్కింది. యువ పరిశోధకులు మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం అట్మా స్పియరిక్ సైన్స్, టెక్నాలజీ రంగంలో లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా గోవాలోని నేషనల్ ఆన్ సెంటర్ ఫర్ పోలార్, ఓషన్ రీసెర్చి డైరెక్టర్ ఎం. రవించంద్రన్ సహా వీవీఎస్ శర్మకు ఓషన్ సైన్స్, టెక్నాలజీ జాతీయ అవార్డును కేంద్రం ప్రకటించింది. హిందు మహాసముద్రంలో జీవ రసాయన శాస్త్ర అధ్యయనంలో కృషికి గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: విశాఖ శాస్త్రవేత్త అయిన వివిఎస్ శర్మ కు దక్కిన జాతీయ అవార్డు

ఎవరు: వివిఎస్ శర్మ

ఎక్కడ: విశాఖపట్నo

ఎప్పుడు:జులై 29

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మైన జాతీయ ఖగోళ శాస్త్ర అవార్డుకు ఎంపికైన  ప్రొఫెసర్ చలపతి రావు :

బనారస్ హిందు యునివర్సిటీ లో అద్యపకునిగా పని చేస్తున్న తెలంగాణకు చెందిన  ప్రొఫెసర్  ఎన్వి చలపతి రావు  గారు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మైన జాతీయ  ఖగోళ  శాస్త్ర అవార్డును  ప్రకటించిది. పెట్రోలజి ,జియో  కేమిస్ట్రిలో  ఆయన చేసిన పరిశోదనకు  గాను నేషనల్ అవార్డ్  ఫర్ జియో సైన్స్  అండ్ టెక్నాలజీ  పురస్కారాన్ని  ప్రకటిస్తున్నట్లు  కేంద్ర ఖగోళ శాస్త్ర శాఖ జులై 29న వెల్లడించింది. హైదరాబాద్ లో జన్మించిన  ఆయన 1994 లో ఉస్మానియా  యునివర్సిటీ  లో పిహెచ్ డి పూర్తి చేశాడు.1997 లో యుకె లోని కేంబ్రిడ్జ్ యునివర్సిటీ లో మరో పిహెచ్ డి చేసారు.  జియోలజి రంగంలో కూడా అనేక ప్రతిష్టాత్మక  అవార్డులను అందుకున్నాడు. 

క్విక్ రివ్యు :

ఏమిటి: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మైన జాతీయ ఖగోళ శాస్త్ర అవార్డుకు ఎంపికైన  ప్రొఫెసర్ చలపతి రావు

ఎవరు: ప్రొఫెసర్ చలపతి రావు

ఎక్కడ: తెలంగాణా

ఎప్పుడు: జులై 29

మహిళా వ్యవస్థాపకతకు బలోపేతంకు 11మంది మహిళలకు దక్కిన ఎంటర్ ప్రేన్యూర్ షిప్ అవార్డులు :

మహిళా వ్యవస్తాపతను బలోపేతం చేస్తూ  మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే తొలిసారి గా ఐఐటి  డిల్లి డిపార్ట్ మెంట్  ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లు సంయుక్తంగా  ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఐదు రంగాల్లో కృషి చేసిన కళాశాల విద్యార్థినుల నుంచి  యువతుల వరకు 11 మందికి  ఉమెన్ ఎంటర్ ప్రేన్యుర్ షిప్ అవార్డులు ప్రకటించి ,రూ 25 లక్షల నగదు పురస్కారాలను  అందజేశాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో మత్స్య కారులతో కలిసి పని చేసిన  స్నేహల్ వర్మ స్టెమ్ (సైన్స్ ,టెక్నాలజీ ,ఇంజనీరింగ్,గణితం) బొమ్మల రూపకర్త ప్రియాంక ప్రభాకర్  కరోనా బారిన పడకుండా ధరించే ఉపకరణాలను రూపొందించిన మేఘన గాంధీ  తదితరులు ఇందులో ఉన్నారు. స్నేహల్ వర్మ చేసిన సూచనలు రెండు తెలుగు రాష్ట్రాల మత్స్య కారులకు ఎంతో ఉపయోగపడ్డాయని  సంస్థలు ప్రస్తుతించాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: మహిళా వ్యవస్థాపకతకు బలోపేతం కు 11మంది మహిళలకు దక్కిన ఎంటర్ ప్రేన్యూర్ షిప్ అవార్డులు

ఎవరు: ఐఐ టి  డిల్లి డిపార్ట్ మెంట్  ఆఫ్ సైన్స్  అండ్ టెక్నాలజీ

ఎక్కడ: న్యు డిల్లీ

ఎప్పుడు: జులై 29

ప్రతిష్టాత్మక మైన పుట్ బాల్ టీం అయిన మహన్ బాగాన్ కు దక్కిన అరుదైన గౌరవం :

క్రిక్రెట్ అంటే పడిచచ్చే భారత్ లో ఇప్పటికి ఫుట్ బాల్  బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక  జట్లలో మోహన్ బగాన్ క్లబ్ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్ కు జులై 29న ఒక అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లోని ప్రతి షాత్మక టైమ్స్ స్క్వేర్ ‘నాస్ డాక్ బిల్ బోర్డులపై క్లబ్ యొక్క లోగోను, టీమ్ రంగులను ప్రత్యేకంగాప్రదర్శించారు. భారత్ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు సంబంధించి అయిన ఇలా నాస్ డాక్ బిల్ బోర్డు పై ప్రదర్శించడం ఇదే తొలిసారికావడం విశేషం. జులై 29 ని మోహన్ బాగాన్ డే గా వ్యవహరిస్తారు. ఈ సందర్బంగా దానిని పురస్కరించుకుని టైమ్స్ స్క్వేర్ లో దీనిని ఏర్పాటు చేశారు.1911 లో ఇదే రోజు ప్రతిష్టాత్మకమైన  ఐఎఫ్ఎ షీల్డ్ టోర్నీలో బాగంగా మోహన్ బగాన్  2-1 తో బ్రిటిష్ కు చెందిన ఈస్ట్ యార్క్ షైర్ రెజిమెంట్ జట్టును ఓడించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రతిష్టాత్మక మైన పుట్ బాల్ టీం అయిన మహన్ బాగాన్ కు దక్కిన అరుదైన గౌరవం

ఎవరు: మహన్ బాగాన్ టీం

ఎప్పుడు: జులై 29

ఫ్రాన్స్ దేశం నుండి భారత్ రక్షణ విభాగంలో వచ్చి చేరిన రాఫెల్ యుద్ద విమానాలు  :

దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎప్పుడేపుడా అని  ఎదురుచూస్తున్న  అపురూప ఘట్టం జులై 29న ఆవిష్కృత మైనది.  భారత వాయుసేన  పోరాట సామర్థ్యాన్ని  బలోపేతం చేస్తూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఐదు రాఫెల్ యుద్ద విమానాలు  భారత భూబగంపై అడుగు పెట్టాయి. ఫ్రాన్స్  లోని మేరిగ్నాక్  వైమానిక స్తావరం నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరం  ప్రయాణించి హరియానలోని అంబాల వైమానిక  స్థావరం లో దిగాయి. అణ్వస్త్రాలతో  దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఈ విమానాలు  చైనా ,పాకిస్తాన్ లతో  సరిహద్దు వివాదం నేపద్యంలో భారత్ కు ఇది కీలకంగా మారింది. ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ కంపెని నుంచి 36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు ఎన్డియే ప్రబుత్వం 2016 లో రూ.59 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఫ్రాన్స్ దేశం నుండి భారత్ రక్షణ విభాగంలో వచ్చి చేరిన రాఫెల్ యుద్ద విమానాలు  

ఎవరు: ఫ్రాన్స్ దేశం

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: జులై 29

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *