
Daily Current Affairs in Telugu 31-07-2020
జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో చోటు దక్కించుకున్న సెహ్వాగ్ మరియు సర్దార్ సింగ్ :

జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని జులై 31 న కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సబ్యుల ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్ క్రికెట్ ప్లేయర్ విరెందర్ సిహ్వాగ్ తో పాటు భారత డాషింగ్ హాకి టీం మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ కు చోటు దక్కించుకున్నారు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందమ్ శర్మ ఈ ప్యానెల్ కు చైర్మన్ గా వ్యవహరిస్తారని పేర్కొంది. వీరితో పాటు రియో పారా ఒలింపిక్స్ రజత పతక విజేత దీపా మాలిక్ ,మాజీ టిటి(టేబుల్ టెన్నిస్) ప్లేయర్ మోనాలిసా బరువా మెహతా ,భారత మాజీ బాక్సర్ వెంకటేషణ్ దేవరాజన్ ,సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రదాన్ సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ సింగ్,టాప్స్ సియివో రాజేష్ రాజగోపాలన్ ,క్రీడా వ్యాఖ్యాత మనీష్ బటావియా క్రీడా పాత్రికేయులు అలోక్ సిన్హా వీరు భాటియాలు ఈ సెలక్షన్ కమిటీలో ఇతర సబ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో చోటు దక్కించుకున్న సెహ్వాగ్ మరియు సర్దార్ సింగ్
ఎవరు: సెహ్వాగ్ మరియు సర్దార్ సింగ్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జులై 31
బీల్ చెస్ టోర్నీ రన్నరప్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ ;

కరోనా క్లిష్ట సమయంలో నాలుగు నెలల విరామం తరువాత జరిగిన తొలి ముఖాముఖీ అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన బీల్ చెస్ ఫెస్టివల్ ఆంద్ర ప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ ఈ టోర్నమెంట్ రన్నరప్ గా నిలిచాడు. స్విట్జర్ లాండ్ లోని బీల్ నగరంలో జరిగిన జులై 29 ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ 36.5 పాయింట్లతో రెండో స్థానం లో నిలిచాడు. 37 పాయింట్లతో పోలాండ్ దేశానికి చెందిన గ్రాండ్ మాస్టర్ రాడోస్తా వోజ్తసేక్ ఓవరాల్ గా టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. చాంపియన్ వోజ్తసేక్ టోర్నీ ఓవరాల్ టైటిల్ ను గెలుచుకున్నాడు. చాంపియన్ వోజ్తసేక్ కు 10వేల స్విస్ ప్రాంక్ లు (రూ 8 లక్షల 20వేలు ) రన్నరప్ గా నిలిచిన వారికీ 7500 స్విస్ ప్రాంక్ లు (రూ.6లక్షల 15వేలు ) ప్రైజ్ మని గా లబించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: బీల్ చెస్ టోర్నీ రన్నరప్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ
ఎవరు: మాస్టర్ హరికృష్ణ
ఎక్కడ: స్విట్జర్ లాండ్
ఎప్పుడు: జులై 31
పద్మశ్రీ అవార్డు గ్రహీత సోనమ్ షెరింగ్ లెప్చ కన్నుమూత :

జానపద సంగీత విద్వాంసుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోనమ్ షెరింగ్ లెప్చ ఇటీవల కన్నుమూశారు. అతను 1928 లో పశ్చిమ బెంగాల్ లోని కాలింపాంగ్ లో జన్మించాడు. ఈయన సైనికుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. అతను సిక్కిం రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాలకు ప్రయాణించి, విస్తృతమైన భారతీయ జానపద పాటలు మరియు సాంప్రదాయ లెప్చా పాటలను పాడేవాడు.మరియు 1960 లో ఆల్ ఇండియా రేడియోలో జానపద సంగీతాన్ని వాయించాడు. జానపద సంగీత రంగంలో చేసిన కృషికిగాను ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు లభించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పద్మశ్రీ అవార్డు గ్రహీత సోనమ్ షెరింగ్ లెప్చ కన్నుమూత
ఎవరు: సోనమ్ షెరింగ్ లెప్చ
ఎప్పుడు: జులై 31
ప్రీమియర్ లీగ్ లో గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్న జామీ వర్డీ :

లీసెస్టర్ సిటీ స్ట్రైకర్, జామీ వర్డీ 2019,2020 సీజన్లో 23 గోల్స్ చేసిన తరువాత ప్రీమియర్ లీగ్స్ “గోల్డెన్ బూట్” ఫుట్బాల్ అవార్డును అందుకున్నాడు. అతను అర్సెనల్ స్ట్రైకర్ అయిన పియరీఎమెరిక్ అబామెయాంగ్ (22 గోల్స్), సౌతాంప్టన్ డానీ ఇంగ్స్ (22 గోల్స్), మరియు మాంచెస్టర్ సిటీ ఫార్వర్డ్ రహీమ్ స్టెర్లింగ్ (20 గోల్స్) లను వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక వ్యక్తిగత అవార్డును పొందాడు. ఈ అవార్డును పొందిన మొదటి లీసెస్టర్ సిటీ ఆటగాడిగా మరియు గత 20 సంవత్సరాలలో హ్యారీ కేన్ తరువాత ఈ అవార్డును పొందిన రెండవ ఆంగ్లేయుడిగా జామి వర్దిన్ నిలిచాడు. మాంచెస్టర్ సిటీ యొక్క బ్రెజిలియన్ కీపర్ ఎడెర్సన్ నార్విచ్ సిటీతో జరిగిన సీజన్లో తన 16 వ క్లీన్ షీట్ ఉంచిన తరువాత ఈ గోల్డెన్ గ్లోవ్ అవార్డును గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రీమియర్ లీగ్ లో గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్న జామీ వర్డీ
ఎవరు: జామీ వర్డీ
ఎప్పుడు: జులై 31
ఐ.సి.ఆర్.ఎ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) & గ్రూప్ సియివోగా ఎన్ శివరామన్ నియామకం :

గ్లోబల్ రేటింగ్స్ ప్రధాన సంస్థ అయిన మూడీస్ యొక్క ఆదీనం లోని ఇండియన్ రేటింగ్స్ ఏజెన్సీ ఐసిఆర్ఎ, ఆర్థిక రంగం యొక్క అనుభవజ్ఞుడైన ఎన్ శివరామన్ ను మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) & గ్రూప్ సియివో గా నియమించింది. ఈ నియామకం 2020 ఆగస్టు 10 నుండి అమల్లోకి తీసుకురానుంది.. ప్రస్తుతం అతను ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూపులో ఉన్నారు. దాదాపు ఏడాది క్రితం ఐసిఆర్ఎ డైరెక్టర్ బోర్డు తన మునుపటి ఎండి సియివోను తొలగించాలని నిర్ణయించింది., ఆయన స్థానం లో ఎన్.శివరామన్ గారిని ఐసిఆర్ఎ మేనేజింగ్ డైరెక్టర్ గా & గ్రూప్ సియివో గా నియమించారు .
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐ.సి.ఆర్.ఎ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) & గ్రూప్ సిఇఒగా ఎన్ శివరామన్ నియామకం
ఎవరు: ఎన్ శివరామన్
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |